For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మారిన ఆధార్ కార్డు రూల్: బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్ చాలా ఈజీ

|

ఆధార్ కార్డు ఉంటే ఇక బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడం మరింత సులభం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఆధార్ రూల్స్‌లో మార్పులు చేసింది. ఆధార్ KYCకి సంబంధించిన నిబంధనలను సరళీకరించింది. బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్‌కు ఆధార్ KYC రూల్స్‍‌ను సవరించింది. దీంతో ఆధార్ కార్డులో అడ్రస్ మార్పు అవసరం లేదు. ఆధార్ KYC వినియోగానికి సంబంధించి డిపార్టుమెంట్ ఆఫ్ రెవెన్యూ, ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఆధార్ అప్‌డేట్ చేయాలా:పేరు, జెండర్, బర్త్ డేలపై కీలకమార్పులుఆధార్ అప్‌డేట్ చేయాలా:పేరు, జెండర్, బర్త్ డేలపై కీలకమార్పులు

ఉద్యోగం మారినప్పుడు మరో ప్రాంతానికి వెళ్లినా..

ఉద్యోగం మారినప్పుడు మరో ప్రాంతానికి వెళ్లినా..

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ నిబంధనలను కేంద్రం సవరించింది. ఉద్యోగం మారినప్పుడు మరో ప్రాంతానికి వెళ్లినవారు అక్కడ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ అడ్రస్ అవసరం లేదు. ప్రస్తుత అడ్రస్ సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటే చాలు. అకౌంట్ తెరువవచ్చు. బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్‌కు సంబంధించి ఆధార్ KYCకి మాత్రమే తాజా సవరణ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

అకౌంట్ ఓపెనింగ్ లేదా బ్రాంచ్ మార్చుకోవడానికి..

అకౌంట్ ఓపెనింగ్ లేదా బ్రాంచ్ మార్చుకోవడానికి..

ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాల్సిన అవసరం లేదని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ చెప్పారు. ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఉద్యోగులు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ట్రాన్సుఫర్ అయిన సందర్భంలో బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్ లేదా బ్యాంకు అకౌంట్ బ్రాంచ్ మార్చుకునేందుకు ఆధార్ KYC కింద కొత్త అడ్రస్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని చెప్పారు.

 ఈజీగా మార్చుకునే వెసులుబాటు

ఈజీగా మార్చుకునే వెసులుబాటు

ఆధార్ కార్డులో మరో అడ్రస్ ఉన్నవారు బ్యాంకు అకౌంట్ ఈజీగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. బ్యాంకుల్లో KYC కింద మరో అడ్రస్‌తో ఉన్న ఆధార్ ఇచ్చినా సరిపోతుంది. అయితే ప్రస్తుత అడ్రస్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ట్రాన్సుఫర్ అయిన వారికి, వలస వెళ్లిన వారికి ఈ రూల్స్ వర్తిస్తాయి.

English summary

మారిన ఆధార్ కార్డు రూల్: బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్ చాలా ఈజీ | Govt eases norms for opening bank account for migrants with Aadhaar KYC

The government has eased KYC norms for migrants to open bank account by allowing them to give a self-declared local address as sufficient proof of residence in case it is different from one mentioned in Aadhaar document.
Story first published: Friday, November 15, 2019, 16:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X