For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అవాంఛిత కాల్స్, ఆర్థిక మోసాలకు 'డిజిటల్ ఇంటెలిజెన్స్' చెక్

|

అవాంఛిత ఫోన్ కాల్స్, సందేశాలతో పాటు టెలికం సోర్సెస్ ఆధారంగా జరిగే ఆర్థిక మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిని కట్టడి చేసే అంశంపై టెలికం శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈ ఇంటెలిజెన్స్ యూనిట్‌ను, కస్టమర్ ప్రయోజనాల పరిరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.

కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ నేతృత్వంలో జరిగిన అత్యున్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అవాంఛిత కాల్స్, అవాంఛిత సందేశాలతో టెల్కో యూజర్లను వేధిస్తూ, నిబంధనలను ఉల్లంఘించే టెలీ మార్కెటర్లు, ఇతర వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాని అధికారులను ఆదేశించారు.

Government to set up digital intelligence unit to tackle pesky calls, financial frauds

టెల్కో వనరుల ద్వారా ఆర్థిక మోసాలు జరుగుతున్నాయని, ఇలాంటి వాటి విషయంలో తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అవాంఛిత కాల్స్, ఆర్థిక మోసాల కట్టడి కోసం డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌ (DIU) ఏర్పాటు కానున్నట్లు వెల్లడించింది.

English summary

అవాంఛిత కాల్స్, ఆర్థిక మోసాలకు 'డిజిటల్ ఇంటెలిజెన్స్' చెక్ | Government to set up digital intelligence unit to tackle pesky calls, financial frauds

To address the nuisance of pesky calls and messages as well as to make digital transactions secure and check financial frauds, the government has been proposed to impose a financial penalty against telemarketers including disconnection of resources in case of repetitive violations.
Story first published: Tuesday, February 16, 2021, 19:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X