For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గూగుల్ గుడ్‌న్యూస్, కొత్త యూజర్ హిస్టరీ ఆటోమేటిక్‌గా డిలీట్

|

సెర్చింజన్ దిగ్గజం గూగుల్ మరో ప్రైవసీ అప్‌డేట్‌ను ప్రకటించింది. తాజాగా గూగుల్ (మెయిల్) ఉపయోగించేవారికి సెర్చ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై వారి లొకేషన్ సెట్టింగ్, యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ మొత్తం ఆటోమేటిక్‌గా డిలీట్ కానుంది. ఈ మేరకు గూగుల్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసినట్లు అల్పాబెట్ - గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ మేరకు తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు.

ఇక అమెరికన్లకు ఎక్కువ వేతనాలు! మన ఐటీ కంపెనీలపై ప్రభావంఇక అమెరికన్లకు ఎక్కువ వేతనాలు! మన ఐటీ కంపెనీలపై ప్రభావం

ఈ మూడు అంశాలు పరిగణలోకి తీసుకుంటాం

ఈ మూడు అంశాలు పరిగణలోకి తీసుకుంటాం

మేం ఏదైనా ఉత్పత్తిని రూపొందించే సమయంలో ప్రధానంగా మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుంటామని, యూజర్ల సమాచార గోప్యత లేదా సురక్షితంగా ఉంచడం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం, నియంత్రణలో ఉండటం వంటి అంశాలు ఉంటాయని సుందర్ పిచాయ్ తెలిపారు. నేడు ఈ రోజు ప్రైవసీ అప్ డేట్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. మరింత భద్రతను కల్పించే ఉద్దేశ్యంలో భాగంగా కొత్త ఆవిష్కరణ తీసుకు వచ్చినట్లు తెలిపారు.

18 నెలలకు ఆటో డిలీట్, తొలిసారి యూజర్లకు

18 నెలలకు ఆటో డిలీట్, తొలిసారి యూజర్లకు

డేటాకు సంబంధించి మార్పులు చేసినట్లు పిచాయ్ తెలిపారు. మీ లొకేషన్ హిస్టరీ 18 నెలల తర్వాత ఆటోమేటిక్‌గా తొలగింపు ఉంటుందని తెలిపారు. డేటాను డిలీట్ చేయాలనుకుంటే ఇప్పటి వరకు ఆ పనిని మ్యానువల్‌గా చేయలి. ఇక నుండి ఆటోమేటిక్‌గా డిలీట్ కానుంది. గూగుల్ అకౌంట్ కొత్తగా ఉపయోగించడం మొదలు పెట్టిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.

పాత యూజర్లకు..

పాత యూజర్లకు..

పాత యూజర్లకు కూడా డేటాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. వారు ఎంచుకునే ఆప్షన్ బట్టి డేటా మూడు నెలలు లేదా పద్దెనిమిది నెలలకు ఓసారి ఆటోమెటిక్‌గా డిలీట్ అయ్యే ఆప్షన్‌ను గత ఏడాది అందుబాటులోకి తెచ్చింది. లొకేషన్ హిస్టరీ, సెర్చ్, వాయిస్, యూట్యూబ్ యాక్టివిటీ డేటా ఆటోమేటిక్‌గా తొలగిపోతుంది. దీంతో యూజర్ల భద్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని గూగుల్ తెలిపింది.

జీమెయిల్, గూగుల్ డ్రైవ్‌లకు వర్తించదు

జీమెయిల్, గూగుల్ డ్రైవ్‌లకు వర్తించదు

ఈ ఆటోమెటిక్ డిలిట్ ఆప్షన్ జీ మెయిల్, గూగుల్ డ్రైవ్‌కు, ఫోటోల వంటివాటికి వర్తించదని గూగుల్ వెల్లడించింది. గూగుల్ ఆటో డిలీట్‌కు సంబంధించి మీరు ఇప్పటికే లొకేషన్ హిస్టరీ, వెబ్, యాప్ యాక్టివిటీ సెట్టింగ్స్‌ను మార్చుకుంటే దానిని మార్చడం లేదని తెలిపింది. అయితే మెయిల్ ద్వారా, నోటిఫికేషన్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఆటో-డిలీట్ గురించి గుర్తు చేస్తుంది. కాబట్టి ఆటో డిలీట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. యూట్యూబ్ ఆటో డిలీట్ మొదటిసారి 36 నెలలకు ఉంటుందని తెలిపింది. ప్రస్తుత కస్టమర్లు 3 నెలలు లేదా 18 నెలలు ఆటో డిలీట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

English summary

గూగుల్ గుడ్‌న్యూస్, కొత్త యూజర్ హిస్టరీ ఆటోమేటిక్‌గా డిలీట్ | Google brings auto delete options for location history, web and app activity

Alphabet and Google Sundar Pichai has announced new privacy improvements to keep your information safe, including changes to its data retention practices across core products to keep less data by default.
Story first published: Thursday, June 25, 2020, 16:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X