For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇల్లు కట్టుకుంటున్నారా? అనుమతి కోసం తిరగాల్సిన అవసరంలేదు!

|

ఇల్లు కట్టుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది! ఇళ్ల నిర్మాణ అనుమతుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేందుకు కొత్త మున్సిపల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ద్వారా సులభంగా మంజూరు కానున్నాయి. మున్సిపాల్టీలలో ఇండిపెండెంట్ హౌస్‌ల నుంచి అపార్టుమెంట్స్, బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు, ఆకాశహర్మ్యాలు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్.. ఇలా ప్రతి నిర్మాణ అనుమతులు త్వరగా మంజూరు చేసేందుకు పురపాలక శాఖ టీఎస్ బీపాస్ విధానం తెచ్చింది.

రూ.1కే ఇంటి అనుమతి, తక్షణ అప్రూవల్: అలాచేస్తే జైలు శిక్షరూ.1కే ఇంటి అనుమతి, తక్షణ అప్రూవల్: అలాచేస్తే జైలు శిక్ష

అనుమతుల కోసం టీఎస్ బీపాస్

అనుమతుల కోసం టీఎస్ బీపాస్

ఈ కొత్త విధానం ప్రకారం వివిధ రకాల అనుమతులు, ఎన్‌వోసీల కోసం ప్రత్యేకంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. టీఎస్ బీపాస్ కింద అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే.. భవనానికి అవసరమయ్యే ఎన్‌ఓసీ కోసం సమాచారం వెళ్తుంది.

సమాచారం అసంపూర్తిగా ఉంటే..

సమాచారం అసంపూర్తిగా ఉంటే..

నల్లా కన్వర్షన్ కోసం వివిధ శాఖల చుట్టూ తిరగాల్సిన పని లేదు. కేవలం టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులకు వెళ్తుంది. మీరు ఇచ్చిన సమాచారం అసంపూర్తిగా ఉంటే పది రోజుల్లో పూర్తి సమాచారం కావాలని అధికారులు అడుగుతారు. ఆ వివరాలు ఇవ్వగానే ఎన్‌వోసీ ఇస్తారు.

21 రోజుల్లోనే అనుమతి.. లేదంటే

21 రోజుల్లోనే అనుమతి.. లేదంటే

ఏ శాఖ అయనా పది రోజుల్లోనే దరఖాస్తుదారుకు సమాచారం ఇవ్వాలి. దరఖాస్తు పెట్టుకున్న వ్యక్తి వివరాలు ఇవ్వగానే ఫైల్ క్లియరెన్స్ ఉండాలి. 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తారు. 21 రోజుల్లో రాకుంటే మరుసటి రోజు అనుమతి మంజూరు అయినట్లేనని మంత్రి కేటీఆర్ కూడా చెప్పారు. ఇక అనుమతికి కారణమైన అధికారులపై చర్యలు ఉంటాయి.

టీఎస్ బీపాస్ ప్రత్యేకతలు

టీఎస్ బీపాస్ ప్రత్యేకతలు

- కలెక్టర్ నేతృత్వంలో జిల్లాకు ఒక బీపాస్ కమిటీ ఉంటుంది.

- లే అవుట్లు, బిల్డింగ్స్ నిర్మాణం ప్రతిపాదనలను కమిటీ పరిశీలిస్తుంది.

- అనుమతి తీసుకున్న తర్వాత ఆయా భవనాలను పరిశీలిస్తుంది.

- అనుమతిచ్చిన ప్రకారం కాకుండా అందుకు విరుద్ధంగా నిర్మాణాలు ఉంటే లేదా తప్పుడు సమాచారం ఉంటే చట్టరీత్యా శిక్ష. ఇలాంటి సందర్భాల్లో సమాచారం లేకుండా కూల్చివేత ఉంటుంది.

- అన్నీ సక్రమంగా ఉంటే ఆన్ లైన్‌లో ఎన్‌ఓసీ జారీ చేస్తారు.

English summary

ఇల్లు కట్టుకుంటున్నారా? అనుమతి కోసం తిరగాల్సిన అవసరంలేదు! | Good News: Building permits in Telangana

Telangana is perhaps one of those few States, where no permission is required for constructing a G+1 house in a land admeasuring 76 square yards i.e. 63 sq metres.
Story first published: Friday, January 17, 2020, 13:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X