For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Electricity Bill: కరెంట్ బిల్ ఎక్కువగా వస్తోందా..? తగ్గించుకోవటానికి టిప్స్ ఇవే.. సగానికి పైగా ఆదా..

|

Electricity Bill: అసలే అన్నింటి ఖర్చులు పెరిగి సామాన్యులు భారంగా జీవితాలను వెళ్లదీస్తున్న ప్రస్తుత సమయంలో కరెంట్ బిల్లులు కూడా షాక్ కొట్టించేలా వస్తున్నాయి. దీనికి ప్రభుత్వాలు సైలెంట్ గా పవర్ ఛార్జీలను పెంచేయటం కూడా కారణంగా నిలుస్తోంది. వీటికి తోడు తాజాగా గ్యాస్, పెట్రోల్ వంటి ఇతర ఇంధనాల ధరలు సైతం జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇలాంటి సందర్బంలో బిల్లుల బాదుడు నుంచి ఉపసమనం పొందటానికి ఈ చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి..

 హోమ్ ఆటోమేషన్..

హోమ్ ఆటోమేషన్..

తలనొప్పుగా మారిన కరెంట్ బిల్లులను అదుపులో ఉంచుకోవాలంటే ముందుగా పాటించాల్సింది ఏమిటంటే.. ఇంట్లో ఉన్న అనేక పరికరాలను ఒకేసారి వినియోగించటం మానేయటం. అనవసరంగా ఎలక్ట్రిక్ పరికరాలను గంటల తరబడి వాడటం ఖర్చును పెంచుతుంది. ఇలాంటి వాటికి తగ్గించటానికి ఈ రోజుల్లో అనేక సెన్సార్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వినియోగం వల్ల ఆటోమేటిక్ గా నిరుపయోగంగా ఉన్న పరికరాలు ఆఫ్ అవుతాయి.

స్టార్ రేటింగ్..

స్టార్ రేటింగ్..

ఈ రోజుల్లో తక్కువ పవర్ ఉపయోగించుకుంటూ పనిచేసే పరికరాలను కంపెనీలు తయారు చేస్తున్నాయి. అధిక స్టార్ రేటింగ్ ఉన్నట్లయితే అవి తక్కువ కరెంట్ వినియోగించుకుంటాయి. దీనివల్ల గతంలో కంటే విద్యుత్ తక్కువ వినియోగం కారణంగా వినియోగదారులకు బిల్లుల భారం తగ్గుతుంది.

ఎలక్ట్రిక్ గీజర్..

ఎలక్ట్రిక్ గీజర్..

అసలే వర్షాకాలం.. పొద్దున్నే చాలా మంది ఇళ్లలో తప్పకుండా వినియోగించే వస్తువు గీజర్. దీని వినియోగం వల్ల చాలా విద్యుత్ ఖర్చవుతుంది. కాబట్టి.. ఈ ఖర్చును తగ్గించుకోవటానికి సోలార్ వాటర్ హీటర్ లేదా గ్యాస్ ఆధారిత పవర్డ్ గీజర్లను ఏర్పాటు చేసుకోవటం ఉత్తమైన ఎంపిక. పైగా ఇది లాభదాయకం కూడా.

నాన్-ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్:

నాన్-ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్:

ఇంట్లో అత్యధికంగా విద్యుత్ వినియోగానికి మరో కారణం బిల్లు ఎక్కువగా వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పవర్ సేవ్ చేయటానికి సరైన మార్గం ఏమిటంటే.. ఇన్వర్టర్ టెక్నాలజీతో తయారైన ఏసీలను వినియోగించటమే. దీని కారణంగా ఏసీ విద్యుత్ వినియోగం దాదాపు 15 శాతం వరకు ఆదా అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

వంటగది చిమ్నీ:

వంటగది చిమ్నీ:

వంటగదిలో వేడి, పొగను తొలగించటానికి ఈ రోజుల్లో అనేక మంది చిమ్నీలను అమర్చుకోవటం సర్వ సాధారణంగా మారిపోయింది. అయితే ఇవి కూడా మీ కరెంట్ బిల్లు పెరుగుదలకు కారణమని మనలో చాలా మందికి తెలియదు. వేసవిలో వీటి వినియోగం మరింత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటికి మార్కెట్లో ఉన్న వివిధ ప్రత్యామ్నాయాలను ఉపయోగించటం ఉత్తమం. వీటికి తోడు ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టౌలు, కూలర్లు, రెఫ్రిజరేట్ల వంటి వాటిని ఎక్కువగా వినియోగించటం కూడా అధిక కరెంట్ బిల్లులకు ప్రధాన కారణంగా ఉంది. వీటి వినియోగాన్ని తగ్గించుకోవటం ద్వారా కరెంట్ బిల్లు ఏకంగా సగానికి పైగా తగ్గుతుందని గుర్తుంచుకోండి.

English summary

Electricity Bill: కరెంట్ బిల్ ఎక్కువగా వస్తోందా..? తగ్గించుకోవటానికి టిప్స్ ఇవే.. సగానికి పైగా ఆదా.. | follow these power saving tips that really help you to cut power bills more than half

follow these power saving tips that really help you
Story first published: Sunday, August 7, 2022, 12:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X