ఆధార్ వివరాలు ఇచ్చిన వారికి వెంటనే ఆన్‌లైన్ ద్వారా పాన్ నెంబర్ కేటాయించే సదుపాయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రారంభించారు. ఫిబ్రవరి 12వ తేదీన ప్రయోగాత్మకంగా దీనిని ప్రారంభించారు. ఇందులో భాగంగా నిన్నటి వరకు 6,77,680 పాన్ నెంబర్లు ఆన్ లైన్ ద్వారా కేటాయించారు. ఆధార్ నెంబర్, ఆధార్‌లో నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్ రెండూ ఉన్న వారికి ఆన్ లైన్ ద్వారా పాన్ కేటాయింపు వర్తిస్తుందని సీబీడీటీ పేర్కొంది.

ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ ద్వారా ఉచితం
ఆధార్ కార్డు ద్వారా పాన్ నెంబర్ లేదా పాన్ కార్డు తీసుకోవాలనుకునే వారు ఐటీ శాఖకు చెందిన ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కు వెళ్లి అడిగిన వివరాలు అందించాలి. ఆ తర్వాత 15 నిమిషాల్లో పాన్ నెంబర్ వస్తుంది. పన్ను చెల్లింపుల ప్రక్రియ మరింత సులభతరం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సేవను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఎలక్ట్రానిక్ పాన్ (ఈ-పాన్) సేవలు పూర్తి ఉచితంగా లభిస్తాయని సీబీడీటీ తెలిపింది.

పాన్ కేటాయింపు మరింత సులభతరం చేసేందుకు
పాన్ కార్డు కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్‌లోనే దీనిని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ప్రతిసారి అన్ని వివరాలతో దరఖాస్తును నింపాల్సిన అవసరం లేకుండా కేవలం ఆధార్ వివరాలతో ఆన్‌లైన్ ద్వారా వెంటనే పాన్ నెంబర్ కేటాయించే ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. చెల్లుబాటయ్యే ఆధార్ నంబర్‌ను, దీంతో అనుసంధానమైన ఫోన్ నంబర్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉంది.

పాన్ కార్డు ఇలా పొందవచ్చు..
పాన్ కార్డు వెంటనే పొందేందుకు ఇలా చేయండి.
- ఆదాయపు పన్ను శా ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- అక్కడ మీ ఆధార్ వివరాలు పొందుపరచాలి.
- ఆధార్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- ఇది పూర్తయిన పది పదిహేను నిమిషాల తర్వాత 15 డిజిట్ అక్నాలెజ్‌మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది.
- ఈ-పాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

పాన్-ఆధార్ లింక్ చివరి తేదీ జూన్ 30
మే 25వ తేదీ నాటికి మొత్తం 50.52 కోట్ల పాన్ కార్డులను ఆధాయపు పన్ను శాఖ జారీ చేసింది. ఇందులో 49.39 కోట్లు ఇండివిడ్యువల్స్‌కు జారీ చేయగా 32.17 కోట్ల పాన్‌కార్డులు ఆధార్‌తో లింక్ అయ్యాయి. పాన్-ఆధార్ లింకింగ్‌కు చివరి తేదీ జూన్ 30, 2020.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications