కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు ఇటీవల శుభవార్త చెప్పింది. 2019-20(అసెస్‌మెంట్ ఇయర్ 2020-21) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు తేదీని డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. మీరు ఇంకా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుంటే, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే ఫైల్ చేయడం మంచిది. తేదీ దగ్గర పడుతున్న కొద్ది హడావుడి అవుతుంది. కాబట్టి వెంటనే ఫైల్ చేయాలి. అదే సమయంలో ఐటీఆర్‌కు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ చేసిన మార్పులు తెలుసుకోవడం మంచిది.

ఐటీ రిటర్న్స్ సులభతరం
పన్ను దాఖలు చేసే ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆదాయపుపన్ను శాఖ ఎప్పటికప్పుడు ఐటీఆర్‌లో మార్పులు చేస్తుంది. ఈ ఏడాది కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఐటిఆర్ ఫైలింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ముందుగా నింపిన ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను అందుబాటులో ఉంచారు. ఐటీఆర్‌లో ప్రీ-ఫిల్డ్ వేతన ఆదాయం వంటి కొన్ని అంశాలు ఉంటాయి. ఐటీఆర్ ఫైలింగ్‌ను సులభతరం చేసేందుకు ఈ కొత్త ఫారాలు తెచ్చారు. పన్ను చెల్లింపుదారుల ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలను అనుసంధానించడం వల్ల పన్ను చెల్లింపుదారులకు ముందే పూరించిన ఫారాలను అందుబాటులో ఉంచింది.

ఈ వివరాలు వెల్లడించాలి
ఈక్విటీ షేర్ల లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్(LTCG), రూ.1 లక్ష పైన ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. 2018 జనవరి 31వ తేదీ లోపు కొనుగోలు చేసిన లిస్టెడ్ షేర్లను గుర్తించి, వాటిపై పన్ను విధించబడదు. ఈ వివరాల కోసం ప్రత్యేక షెడ్యూల్ 112A ప్రవేశపెట్టారు. అంటే ఒక కంపెనీలో ఈక్విటీ వాటా అమ్మకం వివరాలు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(STT) వివరాలు బహిర్గతం చేయాలి.

మార్పులు ఇవే..
ఐటీఆర్‌లో కీలక మార్పుల విషయానికి వస్తే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ ఖాతాల్లో రూ.1 కోటి రూపాయలకు పైగా డిపాజిట్ చేసిన వారు లేదా తన/ఇతరుల విదేశీ ప్రయాణం కోసం రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేస్తే, ఏడాది విద్యుత్ బిల్లు రూ.1 లక్ష దాటితే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి.
ఐటీఆర్ 1, ఐటీఆర్ 2లోని వివిధ షెడ్యూల్స్‌లో పాన్ నెంబర్‌కు బదులు ఆధార్ నెంబర్ వినియోగించుకునే వెసులుబాటు ఉంది. సెక్షన్ 80సీ, 80డీ, 80జీ కింద వివిధ పెట్టుబడులకు వర్తించే పన్ను మినహాయింపు కాలపరిమితిని కరోనా దృష్ట్యా ఐటీ డిపార్టుమెంట్ పొడిగించింది. కొత్తగా షెడ్యూల్ డీఐని తెచ్చారు. హెల్త్ ఇన్సురెన్స్, ముందస్తు హెల్త్ చెక్ అప్, వైద్యఖర్చుల క్లెయిమ్స్ కోసం షెడ్యూల్ 80డీకి మార్పులు చేశారు. ఐటీ రీఫండ్స్ కోసం బహుళ బ్యాంకు ఖాతాలను ఎంచుకోవచ్చు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications