కరోనా సమయంలోను ఈ స్కీం కోసం బారులు! SBI నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇలా జాయిన్ కావొచ్చు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అటల్ పెన్షన్ యోజన (APY) స్కీంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 52 లక్షల మంది కొత్తగా చేరినట్లు అధికారిక డేటా వెల్లడిస్తోంది. దీంతో డిసెంబర్ 2020 నాటికి 2.75 కోట్ల మంది ఈ స్కీంలో ఉన్నారు. అరవై ఏళ్లకు పైబడిన మూడింతల ప్రయోజనం కలిగించే ప్రభుత్వ స్కీం ఇది. ఈ స్కీం ద్వారా కనీస గ్యారెంటీ పెన్షన్ ఉంటుంది. సబ్‌స్క్రైబర్ మరణం అనంతరం జీవిత భాగస్వామికి అదే హామీ పెన్షన్ ఉంటుంది. అలాగే, పెన్షన్ మొత్తాన్ని నామినీకి ఇస్తారు.
SBI, PNB, యాక్సిస్ బ్యాంకు వడ్డీరేట్లు: ఎక్కడ ఎక్కువ అంటే

ఎస్బీఐ ద్వారా ఇలా...
అటల్ పెన్షన్ యోజనలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకు 52 లక్షల మంది కొత్తగా చేరగా, ఇందులో 15 లక్షల మంది ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ద్వారా ఎన్‌రోల్ చేసుకున్నారు. ఎస్బీఐ బ్రాంచీని సంప్రదించడం ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా అటల్ పెన్షన్ యోజన స్కీంకు దరఖాస్తు చేసుకోవడానికి SBI అవకాశం కల్పిస్తోంది. ఇది ఎంతో ప్రయోజకరమైన పథకం.

ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇలా..
SBI నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇలా ఎన్‌రోల్ కావొచ్చు....
- ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అకౌంట్‌లోకి లాగిన్ కావాలి.
- సోషల్ సెక్యూరిటీ స్కీంను ఎంచుకోవాలి.
- అందులో అటల్ పెన్షన్ యోజనను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత ఈ స్కీంతో లింగ్ కావాలని భావించే మీ సేవింగ్స్ అకౌంట్ నెంబర్‌ను సెలక్ట్ చేయాలి.
- అక్కడ క్లిక్ చేయగానే కస్టమర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (CIF) ఆప్షన్ వస్తుంది.
- సిస్టం జనరేటెడ్ CIFను ఎంచుకోవాలి.
- మీ స్క్రీన్ పైన కనిపించి ఈ-ఫామ్‌ను నింపాలి.
- అమౌంట్, కాంటడ్రిబ్యూషన్ పీరియడ్, నెలవారీ చెల్లింపు లేదా వార్షిక చెల్లింపు వంటి వివరాలను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత ఫామ్‌ను సబ్‌మిట్ చేయాలి.
- అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

వీరు చేరవచ్చు..
భారత పౌరులు, 18 ఏళ్ళ నుండి 40 ఏళ్ల మధ్య ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ స్కీంలో చేరవచ్చు. ఈ పథకం ఐదు స్థిర నెలవారీ పెన్షన్ ఎంపికలను అందిస్తుంది. రూ.1000, రూ.2,000, రూ.3,000, రూ.4,000, రూ.5,000 నుంచి రూ.5 వేల వరకు డిపాజిట్ చేయవచ్చు. కరోనా కారణంగా సవాళ్లు ఎదురైనప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 52 లక్షలకు పైగా కొత్త చందాదారులను చేరడం గమనార్హం.