For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిర్‌టెల్ 25% వరకు టారిఫ్, కొత్త ధరలు ఇవే..: అదే దారిలో జియో, వొడాఫోన్ ఐడియా

|

దేశంలో ప్రస్తుతం ఉన్న టారిఫ్ ధరలు కంపెనీలు నడిచేందుకు ఏమాత్రం సహకరించేలా లేవని, పెంచితేనే కంపెనీలు మనగలుగుతాయని భారతీ ఎయిర్‌టెల్ ఎప్పటి నుండో చెబుతోంది. త్వరలో టారిఫ్స్ పెంచే అవకాశం ఉందని ఆ సంస్థ అధినేత గతంలోనే స్పష్టం చేశారు. తాజాగా ధరలు పెంచుతున్నట్లు టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించింది. టారిఫ్‌ను 20 శాతం నుండి 25 శాతం మేర పెంచినట్లు సోమవారం తెలిపింది. వాయిస్ ప్లాన్స్, అన్‌లిమిటెడ్ వాయిస్, డేటా ప్లాన్ బండిల్స్, డేటా టాప్-అప్ రీచార్జీల పైన ప్రభావం చూపిస్తుంది. పెరిగిన కొత్త ఛార్జీలు 26 నవంబర్ 2021 నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. ఎంట్రీ లెవల్ వాయిస్ ప్లాన్ 25 శాతం పెరిగింది. మోస్ట్ అన్‍‌లిమిటెడ్ వాయిస్ బండిల్స్ 20 శాతం మేర పెరిగాయి.

కస్టమర్ నుండి రూ.200కు పైగా ఆదాయం

కస్టమర్ నుండి రూ.200కు పైగా ఆదాయం

ఎయిర్‌టెల్ టారిఫ్ పెంపు కీలక నిర్ణయం నేపథ్యంలో ఒక్కో కస్టమర్ పైన సగటు ఆదాయం(ARPU) రూ.200-300కు చేర్చాలని ఎయిర్‌టెల్ భావిస్తోందట. అప్పుడు కానీ మూలధనంపై సరైన రాబడి ఉంటుందని, ఇది ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాకు దారితీస్తుందని తెలిపింది. ARPU ఆదాయం పెరగడం వల్ల నెట్‌వర్క్స్, స్పెక్ట్రమ్ కొనుగోళ్లలో పెట్టుబడులకు అవకాశం ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది. అలాగే భారత్‌లో 5G అమలుకు దోహదం చేస్తుందని తెలిపింది. టారిఫ్ చార్జీలను తిరిగి సమతుల్యం చేయాలని నిర్ణయించినట్లు వివరించింది. ఈ పెంపుతో ఇప్పటి వరకు రూ.79తో వచ్చిన 28 రోజుల కాలపరిమితిగల ప్రామాణిక వాయిస్ ప్లాన్‌కు ఇక నుండి రూ.99 చెల్లించాలి. అలాగే అన్‌లిమిటెడ్ ప్రారంభ వాయిస్ బండిల్ ఇప్పటి వరకు రూ.149 కాగా, ఇక నుండి రూ.179 ఉంటుంది. యాన్యువల్ ప్లాన్ రూ.2498 నుండి రూ.2999కి పెరిగింది. టాప్-అప్స్‌లోను మార్పులు ఉన్నాయి.

పాత టారిఫ్ - కొత్త టారిఫ్

పాత టారిఫ్ - కొత్త టారిఫ్

- ప్రస్తుత ధర రూ.79 - కాలపరిమితి 28 days - కొత్త ధర 99 - ప్రయోజనాలు 50% more talktime at Rs 99, 200MB data 1p/sec voice tariff

- ప్రస్తుత ధర రూ.149 - కాలపరిమితి 28 days - కొత్త ధర 179 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 2 GB data

- ప్రస్తుత ధర రూ.219 - కాలపరిమితి 28 days - కొత్త ధర 265 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 1 GB/day data

- ప్రస్తుత ధర రూ.249 - కాలపరిమితి 28 days - కొత్త ధర 299 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 1.5 GB/day data

- ప్రస్తుత ధర రూ.298 - కాలపరిమితి 28 days - కొత్త ధర 359 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 2 GB/day data

- ప్రస్తుత ధర రూ.399 - కాలపరిమితి 56 days - కొత్త ధర 479 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 1.5 GB/day data

- ప్రస్తుత ధర రూ.449 - కాలపరిమితి 56 days - కొత్త ధర 549 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 2 GB/day data

- ప్రస్తుత ధర రూ.379 - కాలపరిమితి 84 days - కొత్త ధర 455 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 6 GB data

- ప్రస్తుత ధర రూ.598 - కాలపరిమితి 84 days - కొత్త ధర 719 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 1.5 GB/day data

- ప్రస్తుత ధర రూ.698 - కాలపరిమితి 84 days - కొత్త ధర 839 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 2 GB/day data

- ప్రస్తుత ధర రూ.1498 - కాలపరిమితి 365 days - కొత్త ధర 1799 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 24 GB data

- ప్రస్తుత ధర రూ.2498 - కాలపరిమితి 365 days - కొత్త ధర 2999 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 2 GB/day data

టాప్-అప్

టాప్-అప్

- ప్రస్తుత టారిఫ్ రూ.48 - అన్‌లిమిటెడ్ - కొత్త టారిఫ్ రూ.58 - 3 GB data

- ప్రస్తుత టారిఫ్ రూ.98 - అన్‌లిమిటెడ్ - కొత్త టారిఫ్ రూ.118 12 GB data

- ప్రస్తుత టారిఫ్ రూ.251 - అన్‌లిమిటెడ్ - కొత్త టారిఫ్ రూ.301 50 GB data

జియో, వొడాఫోన్ అదే దారిలో

జియో, వొడాఫోన్ అదే దారిలో

ఎయిర్‌టెల్ టారిఫ్ పెంపు నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా, జియో కూడా తమ టారిఫ్స్ పెంచే అవకాశముంది. టెలికం రంగం కోలుకోవాలంటే టారిఫ్ పెంపు అవశ్యమని వొడాఫోన్ ఐడీయా సీఈవో రవీందర్ టక్కర్ కూడా ఇటీవలే అన్నారు. తమ కంపెనీ మొబైల్ టారిఫ్ పెంపు కోసం ప్రయత్నిస్తోందన్నారు. మరోవైపు ప్లాన్‌ చార్జీల పెంపు ప్రకటన నేపథ్యంలో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎయిర్‌టెల్ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఒక్కో షేర్ విలువ దాదాపు 4 శాతం లాభపడింది. ఈ షేర్ నేడు కూడా స్వల్పంగా లాభపడింది.

English summary

ఎయిర్‌టెల్ 25% వరకు టారిఫ్, కొత్త ధరలు ఇవే..: అదే దారిలో జియో, వొడాఫోన్ ఐడియా | Airtel raises tariffs upto 25%, Full list of new prices: Others could follow

Bharti Airtel has today announced that the telecom operator will be increasing its prepaid plan prices for various plans in India. The new rates will affect voice plans, unlimited voice and data plan bundles and data top-up recharges.
Story first published: Tuesday, November 23, 2021, 11:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X