For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Aadhaar PVC Card: రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేకపోయినా ఆర్డర్ చేయవచ్చు

|

PVC ఆధారిత ఆధార్ కార్డు ఫోటోగ్రాఫ్, డిజిటల్ సంతకం చేసిన క్యూఆర్ కోడ్ సహా పలు భద్రతా లక్షణాలు కలిగి ఉంటుంది. అంతేకాదు, దీనిని తీసుకు వెళ్లడం చాలా సులభమైనది, మన్నికైనది. కొద్ది రోజుల క్రితం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UADAI) 'ఆర్డర్ ఆధార్ కార్డు' సేవలను ప్రారంభించింది. రూ.50కి పీవీసీ ఆధార్ కార్డు అందిస్తారు. దీని కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని, డెలివరీ ఛార్జీలు, పన్నులు కలిపి యాభై రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని UADAI పేర్కొంది.

బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్, 15% వేతన పెంపు: వారానికి 5 డేస్ వర్కింగ్‌పై నిరాశబ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్, 15% వేతన పెంపు: వారానికి 5 డేస్ వర్కింగ్‌పై నిరాశ

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి మాత్రమే కాదు..

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి మాత్రమే కాదు..

మన పర్సులో ఇమిడిపోయే విజిటింగ్ కార్డు సైజులో ఉండటం ఈ ఆధార్ కార్డు ప్రత్యేకత. ఈ కార్డును పొందడానికి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి మాత్రమే పొందాల్సిన పనిలేదు. నాన్-రిజిస్టర్డ్ లేదా ప్రత్యామ్నాయ మొబైల్ నెంబర్‌తోను పీవీసీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఓటీపీ కోసం ఏ మొబైల్ నెంబర్ అయినా ఉపయోగించవచ్చు. ఓ వ్యక్తి తన కుటుంబం మొత్తానికి పీవీసీ ఆధార్ కార్డులను ఆన్ లన్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు.

ఇలా ఆర్డర్ చేయండి

ఇలా ఆర్డర్ చేయండి

uidai.gov.in లేదా resident.uidai.gov.in ద్వారా ఆధార్ నెంబర్, వర్చువల్ ఐడీ, ఎన్‌రోల్‌మెంట్ ఐడీని ఉపయోగించి పీవీసీ ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేయవచ్చు. 'మై ఆధార్' అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ అర్డర్ ఆధార్ పీవీసీ కార్డు అనే లింక్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ కార్డు నెంబర్‌ను పేర్కొనాలి. సెక్యూరిటీ క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ కార్డు లింకు చేయబడిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక అది పేమెంట్ గేట్-వేలోకి వెళ్తుంది. అక్కడ మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా రూ.50 చెల్లించాలి. స్పీడ్ పోస్డ్ ద్వారా ఈ కార్డు మీ ఇంటి అడ్రస్‌కు అందుతుంది.

ఆధార్ స్టేటస్‌ను ట్రాక్ చేయవచ్చు. uidai వెబ్ సైట్లో ట్రాకింగ్ ఆప్షన్ ఉంది. మై ఆధార్ అని క్లిక్ చేసి, చెక్ ఆధార్ పీవీసీ కార్డు స్టేటస్ అని ఎంచుకుంటే స్టేటస్ తెలుస్తుంది.

ప్రివ్యూ ఇలా మాత్రమే..

ప్రివ్యూ ఇలా మాత్రమే..

ఆధార్ ప్రివ్యూ ఆప్షన్ కూడా ఉంద. అయితే ఇది కేవలం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కే. టైమ్ ఆధారిత వన్ టైమ్ పాస్‌వర్డ్(TOTP)ను ఎం-ఆధార్ అప్లికేషన్ ద్వారా కూడా ఉపయోగించవచ్చు. ఎం-ఆధార్ అనేది ఆధార్ డిజిటల్ రూపం. దీనిని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ వెరిఫికేషన్ కోడ్ కోసం క్యూఆర్ కోడ్‌ను కలిగి ఉంటుంది. ఎం-ఆధార్‌ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

English summary

Aadhaar PVC Card: రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేకపోయినా ఆర్డర్ చేయవచ్చు | Aadhaar News: You can now order Aadhaar PVC card online for Rs 50

Other than being easy to carry and durable, the PVC-based Aadhaar Card has a digitally signed secure QR code with photograph and demographic details with multiple security features.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X