For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రావెల్ ఇన్సురెన్స్ గుడ్‌న్యూస్, మోసపూరిత బీమాలకు చెక్

|

ఆన్ లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్స్, యాప్స్ ద్వారా ప్రయాణ బీమా ను మోసపూరితంగా అంటగట్టే చర్యలకు భారతీయ బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్ డీఏఐ) చెక్ పెట్టింది. ఈ మేరకు బీమా కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఒక పోర్టల్ లో టికెట్ బుకింగ్ చేసే సమయంలో ప్రయాణ బీమా కవరేజీ డిఫాల్ట్ ఆప్షన్ గా ముందుగానే సెలెక్ట్ చేసి ఉండరాదు. ప్రయాణ తేదీ 90 రోజులకు మించి ఉన్నప్పుడు ప్రయాణ బీమాను జారీ చేయవద్దని తెలిపింది. ఆన్ లైన్ ట్రావెల్ ఏజెన్సీలు, పలు యాప్ లు ప్రయాణ బీమాకు సంబంధించిన ఆప్షన్ ను ముందుగానీ ఎంపిక చేసి పెట్టకుండా చూసుకోవాల్సిన భాద్యత బీమా సంస్థలదే అని ఐ ఆర్ డీఏఐ వెల్లడించింది.

<strong>ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేసి రూ.2 లక్షలు ఆదా చేయండి! ఎలాగంటే?</strong>ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేసి రూ.2 లక్షలు ఆదా చేయండి! ఎలాగంటే?

ఐ ఆర్ డీఏఐ సర్క్యులర్ లో ఏం ఉందంటే...

ఐ ఆర్ డీఏఐ సర్క్యులర్ లో ఏం ఉందంటే...

* దేశీయ ప్రయాణాల తేదీ 90 రోజులకు మించి ఉన్న తరుణంలో ప్రయాణ బీమాను జారీ చేయరాదు. ఇంటర్నేషనల్ ప్రయాణాల విషయంలో ఎప్పుడైనా జారీ చేయవచ్చు.

* ప్రయాణ బీమా ఏ సంస్థ నుంచి అందిస్తున్నది వంటి వివరాలతోపాటు బీమా కోసం చెల్లించిన ప్రీమియం, దానిపై చెల్లించే పన్ను తదితర వివరాలు తెలియ జేయాల్సి ఉంటుంది.

ప్రయోజనాలు వెల్లడించాలి

ప్రయోజనాలు వెల్లడించాలి

* పాలసీని తీసుకోవడం వలన కలిగి ప్రయోజనాలు వెల్లడించాలి. నిబంధనలు ఒకే చోట కనిపించాలని, వాటిని చదివి అర్థం చేసుకున్నట్టు ప్రయాణికులు ధ్రువీకరణ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

* ట్రావెల్ ఏజెన్సీలు ఈ నిబంధనలు పాటిస్తున్నాయా లేక తుంగలో తొక్కుతున్నాయా అన్నది తెలుసుకోవడానికి కనీసం మూడు నెలలకు ఒకసారి బీమా కంపెనీలు తనిఖీ చేయాల్సి ఉంటుంది.

* తాజాగా ఐ అర్ డీఏఐ విడుదల ల చేసిన మార్గదర్శ కాల మూలంగా మోసపూరితంగా ప్రయాణ బీమా పాలసీలను విక్రయించే ప్రక్రియకు అడ్డుకట్ట పడుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటిదాకా ఎలా ఉందంటే...

ఇప్పటిదాకా ఎలా ఉందంటే...

* ప్రయాణం కోసం టికెట్ కొనుగోలు చేసే సమయంలో ప్రయాణ బీమా కూడా టికెట్ తో పాటే కొనుగోలు చేయాల్సి వచ్చేది. బీమా అవసరం ఉన్నా లేకున్నా టికెట్ తోపాటు బీమాకు ప్రయాణికుడు చెల్లించాలి వచ్చేది. దీని వల్ల ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసే వారిపై భారీ స్థాయిలో భారం పాడేది.

* కొన్ని సార్లు ఇది వివరంగా కనిపించేది, కొన్ని సార్లు కనిపించేది కాదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

* ఏది ఏమైనా ఐఆర్ డీఏఐ నూతన ఆదేశాల వల్ల ప్రయాణ బీమా కొనుగోలు విషయంలో మరింత పారదర్శకతకు అవకాశం ఉందని చెబుతున్నారు.

* ప్రస్తుతం ఐఅర్ సిటీసి ప్రతి ప్రయాణికుని నుంచి 49 పైసలు ప్రీమియం (పన్నులు సహా) తీసుకుంటుంది. దీని కింద రూ.10,000 నుంచి రూ.10 లక్షల మధ్య వ్యయాలకు కవరేజీ లభిస్తుంది.

* ప్యాసెంజర్ మృతి చెందినా,శాశ్వత అంగ వైకల్యం కలిగినా, గాయాలు అయినప్పుడు ఆస్పత్రి ఖర్చులు వంటి వాటికీ ఐ ఆర్ సి టీసీ కింద కవరేజీ లభిస్తుంది.

ప్రయాణికుల ఇష్టం

ప్రయాణికుల ఇష్టం

ప్రయాణ బీమాలకు సంభందించి చాలా మంది బీమా ప్రీమియం చెల్లిస్తుంటారు. కానీ ప్రమాదాలు జరిగే శాతం తక్కువ స్థాయిలో ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు మాత్రం పరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే టికెట్ బుక్ చేసే వారందరికీ బీమా తీసుకోవాలన్న ఆసక్తి ఉండకపోవచ్చు. ఇలాంటి వారు ఇప్పుడు బీమాను తమ అభీష్టం మేరకు ఎంచుకునే వెసులుబాటు లభిస్తుంది.

English summary

ట్రావెల్ ఇన్సురెన్స్ గుడ్‌న్యూస్, మోసపూరిత బీమాలకు చెక్ | travel insurance sale via online ticket booking portals more stringent

This circular will come into force with immediate effect. All the group insurance arrangements that are not in compliance to these norms shall be terminated with effect from 01st Oct.
Story first published: Sunday, October 6, 2019, 12:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X