For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? ఈ ఊబిలో మాత్రం పడకండి!

|

డెబిట్, క్రెడిట్ కార్డుల పుణ్యమాని.. క్యాష్ ట్రాన్సాక్షన్స్ గణనీయంగా తగ్గిపోయాయి. క్రెడిట్ కార్డు ఉండడం ఓ హోదాగా కూడా చాలామంది భావిస్తున్నారు. మరికొందరైతే ఒక్క క్రెడిట్ కార్డుతో సరిపెట్టుకోవడం లేదు. నాలుగైదు కార్డులు పర్సులో ఉండాల్సిందే. రెస్టారెంట్, సినిమా థియేటర్, షాపింగ్, బిల్లుల చెల్లింపు.. ఇలా దేనికైనా క్యాష్‌కు బదులు కార్డు తీస్తున్నారు.

అయితే క్రెడిట్ కార్డు వినియోగించే వారు కచ్చితంగా ఒక్క జాగ్రత్త మాత్రం తీసుకుని తీరాలి. లేదంటే జేబుకు చిల్లు పడడం ఖాయం. అదేమిటంటే.. ప్రతి నెలా కార్డుపై ఉన్న బకాయిని పూర్తిగా చెల్లించేయడం. అలాకాకుండా డబ్బులు లేవనో, ఇంకేదైనా కారణంతోనో ఈసారికి 'మినిమం అమౌంట్ డ్యూ' కట్టేద్దాంలే.. వచ్చే నెలలో మొత్తం కట్టేసుకోవచ్చు అని అనుకున్నారా? మీరు చిక్కుల్లో పడ్డట్లే. ఎలాగో చూడండి!

క్రెడిట్ కార్డులకు పండుగల కిక్కు: జోరుగా పెరుగుతున్నాయ్క్రెడిట్ కార్డులకు పండుగల కిక్కు: జోరుగా పెరుగుతున్నాయ్

క్రెడిట్ కార్డులపై మోజు ఎందుకంటే...

క్రెడిట్ కార్డులపై మోజు ఎందుకంటే...

క్రెడిట్ కార్డులు ఉండడం ఒక హోదాగా మారిపోవడమే కాదు. అవసరానికి జేబులో డబ్బు లేకపోయినా కార్డు ఉంటే చాలు.. ఎప్పుడ ఎక్కడ ఎంతఅవసరమొచ్చినా స్వైపింగ్ మిషన్ వద్ద అలా స్వైప్ చేస్తే చాలు.. క్షణాల్లో పనైపోతోంది. పైగా ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించనక్కర్లేదు. క్రెడిట్ కార్డులు జారీ చేసే బ్యాంకులు అన్నీ దాదాపుగా 20-50 రోజుల వ్యవధి ఇస్తాయి. దీనిని క్రెడిట్ ఫ్రీ పీరియడ్ అని అంటారు. ఆ నిర్ణీత వ్యవధిలోగా కార్డుపై ఉన్న బకాయి కట్టేసుకుంటే చాలు. సరిగ్గా ఈ సౌలభ్యమే క్రెడిట్ కార్డుల వినియోగానికి ఆదరణ పెంచుతోంది.

బకాయి చెల్లించలేకపోతేనే ఇబ్బంది...

బకాయి చెల్లించలేకపోతేనే ఇబ్బంది...

క్రెడిట్ కార్డు వినియోగదారులు ప్రతీ నెల వారి కార్డుపై ఉన్న బకాయి మొత్తాన్ని నిర్ణీత వ్యవధిలోగా కట్టేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా కట్టకపోతేనే ఇబ్బంది మొదలవుతుంది. ఎందుకంటే, క్రెడిట్ కార్డులపై ఆయా బ్యాంకులు వసూలు చేసే వడ్డీ అధికంగా ఉంటుంది. సాధారణంగా క్రెడిట్‌ కార్డును బట్టి క్రెడిట్‌ ఫ్రీ పీరియడ్‌ 20-50 రోజుల వరకు ఉంటుంది. అంటే ఈ నిర్ణీత వ్యవధిలోగా బకాయి చెల్లింపు జరిపితే ఎలాంటి వడ్డీ విధించరు.

వడ్డీ పడే పరిస్థితి తెచ్చుకోవద్దు..

వడ్డీ పడే పరిస్థితి తెచ్చుకోవద్దు..

అయితే ఈ క్రెడిట్‌ ఫ్రీ పీరియడ్‌లోగా మీ కార్డుపై ఉన్న బకాయి చెల్లించకపోతే మాత్రం నెలకు 3 నుంచి 4 శాతం వరకు వడ్డీ విధిస్తారు. ఈ వడ్డీ వార్షిక ప్రాతిపదికన తీసుకుంటే.. వడ్డీ రేటు 30 నుంచి 50 శాతం వరకు ఉంటుంది. ఇక చెల్లింపులో జాప్యం చేసినందుకు పడే పెనాల్టీలు కూడా కలుపుకుంటే ఇది ఏడాదికి 50 నుంచి 60 శాతం వరకు పడొచ్చు. అందుకే క్రెడిట్‌ కార్డు వినియోగదారులు బకాయి చెల్లించే విషయంలో నిర్లక్ష్యంగా ఉండరాదు.

‘మినిమం అమౌంట్ డ్యూ' ఊసే వద్దు...

‘మినిమం అమౌంట్ డ్యూ' ఊసే వద్దు...

కొంతమంది క్రెడిట్ కార్డు వినియోగదారులు కార్డుపై ఉన్న బకాయి మొత్తం పూర్తిగా చెల్లించలేని పరిస్థితిలో ‘మినిమం అమౌంట్ డ్యూ' (కనీస మొత్తం చెల్లింపు) ఆప్షన్‌ను ఎంచుకుంటారు. కానీ ఇదే తరువాతి కాలంలో వారికి పెద్ద గుదిబండగా మారుతుంది. కనీస మొత్తం చెల్లించి ఆ నెలలో బయటపడినా తర్వాతి నెల బిల్లులో అది మళ్లీ వడ్డీతో కలిసి వస్తుంది. అప్పుడైనా పూర్తి బకాయి చెల్లించాల్సిందే. అలా కాకుండా తరువాతి నెలలోనూ కనీస మొత్తమే చెల్లిస్తే ఆ తర్వాతి నెలలో చెల్లించాల్సిన మొత్తం మరింత పెరుగుతుంది. ఇలా క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది.

ఇలా ‘ఊబి'లో చిక్కుకుపోతారు...

ఇలా ‘ఊబి'లో చిక్కుకుపోతారు...

ఉదాహరణకు మీరు క్రెడిట్‌ కార్డును ఓ రూ.10 వేలకు స్వైప్ చేశారనుకోండి. బిల్లు జనరేషన్ అయిన తేదీ నుంచి బిల్లు చెల్లించాల్సిన డ్యూ డేట్ వరకు మీకు కొంత గడువు ఉంటుంది. ఆ గడువులోగా మీరు రూ.10 వేలు చెల్లించని పక్షంలో కనీస మొత్తం కింద 5 శాతం.. అంటే రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ కనీస మొత్తం చెల్లించేస్తే పెనాల్టీ అప్పటికప్పుడు పడదుగానీ.. తరువాత నెలలో మళ్లీ మొత్తం రూ.10 వేలు, అదనంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే, మీకు ఇచ్చిన క్రెడిట్‌ ఫ్రీ పీరియడ్‌ మీ డ్యూ డేట్‌తో ముగిసింది కాబట్టి ఆ తరువాత నుంచి మీరు తిరిగి రూ.9,500 వేలు చెల్లించే వరకు మళ్లీ వడ్డీ పడుతుంది. ఇలా ఈ వడ్డీ నెల నెలా పెరుగుతూ తడిసి మోపెడు అవుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డుల బిల్లు చెల్లింపు విషయంలో కార్డుదారులు అప్రమత్తంగా ఉండాలి.

English summary

క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? ఈ ఊబిలో మాత్రం పడకండి! | paying the minimum amount due on credit cards can make you fall into a debt trap

If you think that paying the 'minimum amount due' on your credit card bill every month will help you completely set-off your credit card bill within few months, then you are on the wrong track.
Story first published: Wednesday, October 2, 2019, 17:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X