For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం కొంటున్నారా?: ఏ ఆభరణంపై ఎంత ట్యాక్స్ పడుతుందో తెలుసుకోండి

|

దసరా నుంచి ధన్‌తెరాస్, దీపావళి వరకు బంగారం కొనుగోలును ఎంతోమంది భారతీయులు శుభప్రదంగా భావిస్తారు. ఈ పండుగ సీజన్‌లో అన్ని రకాల సేల్స్‌తో పాటు పసిడి సేల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. పండుగ సీజన్‌లో దుకాణ యజమానులు కూడా భారీ ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తుంటారు. తరుగు, మజూరీ తగ్గింపును ఇస్తుంటారు. జ్యువెలర్స్ ప్రమోషనల్ ఆఫర్లు అందిస్తారు. అంతేకాకుండా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ గోల్డ్ ఈటీఎఫ్, సావరీన్ గోల్డ్ బాండ్స్ ట్రేడింగ్ పైన ట్రేడింగ్ సెషన్‌ను రెండు రోజుల క్రితం సాయంత్రం 5 గంటల నుంచి ఏడు గంటలకు పొడిగించాయి. బంగారం కొనుగోలుపై ఇన్‌కం ట్యాక్స్ ఉంటుంది. అది వివిధ రకాలుగా ఉంటుంది.

బంగారంపై భారీ పెట్టుబడి సరైనదేనా?

బంగారంపై భారీ పెట్టుబడి సరైనదేనా?

మీ పోర్ట్‌పోలియోలో ఇన్సురెన్స్‌గా బంగారాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎంత వరకు చేయవచ్చు? గరిష్టంగా 5 శాతం నుంచి 10 శాతం. ఇంతకుమించి ఎక్కువ పెడితే అది తప్పుడు నిర్ణయం అవుతుందనేది నిపుణుల సూచన. మీ కూతురు పెళ్లి వంటి తదితర కారణాలకు అయితే అది సరైన నిర్ణయంగా భావించవచ్చునని చెబుతున్నారు. అదే సమయంలో బంగారంపై భారీగా పెట్టుబడి కూడా సరికాదని సూచిస్తున్నారు. కొనుగోలుతో పాటు అమ్మే సమయంలో ఆదాయపు పన్ను చిక్కులు రాకుండా చూసుకోవాలి.

బంగారంపై ట్యాక్స్ వేటిపై ఆధారపడి ఉంటుంది?

బంగారంపై ట్యాక్స్ వేటిపై ఆధారపడి ఉంటుంది?

బంగారంపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అది కొనుగోలు చేసే రూపంపై ఆధారపడి ఉంటుంది. అంటే బంగారం ఏ రూపంలో ఉందనే అంశం ఆధారంగా ట్యాక్స్ మారుతుంది. అదే సమయంలో కాల వ్యవధిపై కూడా ఆధారపడి ఉంటుంది. బంగారం కొనుగోలు చేసిన మూడేళ్ల తర్వాత విక్రయిస్తే దానిని షార్ట్ టర్మ్‌గా పరిగణిస్తారు. అంతకుమించితే అది లాంగ్ టర్మ్ అవుతుంది. జీఎస్టీ, క్యాపిటల్ గెయిన్స్ చెల్లించాల్సి ఉంటుంది.

లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్

లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్

బంగారం అమ్మకంపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీ గ్రాస్ టోటల్ ఇన్‌కమ్‌‍కు జత అవుతాయి. అనుగుణంగా ట్యాక్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్ గెయిన్స్‌కు 20.8 శాతం చెల్లించాలి. ఇందులో సెస్ కూడా కలిసి ఉంటుంది. ఇండెక్సేషన్ బెనిఫిట్స్ ఉంటాయి. బంగారం కొనుగోలు చేసిన ధరను ద్రవ్యోల్భణానికి అనుగుణంగా సవరిస్తారు.

ఫిజికల్ గోల్డ్ సేల్‌పై ట్యాక్స్

ఫిజికల్ గోల్డ్ సేల్‌పై ట్యాక్స్

బార్స్, కాయిన్స్ లేదా జ్యువెల్లరీ వంటి ఫిజికల్ గోల్డ్ అమ్మకం ద్వారా వచ్చే లాభాలను షార్ట్ టర్మ్ మూలధన లాభాలుగా పరిగణిస్తారు. తదనుగుణంగా ట్యాక్స్‌లు ఉంటాయి. మూడేళ్ల తర్వాత అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG)గా లెక్కిస్తారు.

గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్

గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్

గోల్డ్ ఈటీఎఫ్‌లు మెటల్ ధరలను ట్రాక్ చేసే సెక్యూరిటీలు మరియు అవి స్టాక్ ఎక్స్చేంజీలలో ట్రేడ్ అవుతాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు లేదా గోల్డ్ ఎంఎఫ్ సేల్స్ ద్వారా వచ్చే లాభాలపై ఫిజికల్ బంగారంతో సమానంగా పన్ను ఉంటుంది.

సావరీన్ గోల్డ్ బాండ్స్

సావరీన్ గోల్డ్ బాండ్స్

సావరీన్ గోల్డ్ బాండ్స్ అంటే గ్రాముల్లో సూచించబడిన ప్రభుత్వ సెక్యూరిటీ బంగారం. వీటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేస్తుంది. ఈ గోల్డ్ బాండ్స్ ఎనిమిదేళ్ల మెచ్యూరిటీ కాలంతో ఉంటాయి. ఐదేళ్ల తర్వాత బాండ్స్ విక్రయించవచ్చు. 8 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు. గోల్డ్ ఈటీఎఫ్ లేదా గోల్డ్ ఫండ్స్ వంటి వాటిల్లో ఈ వెసులుబాటు ఉండదు. అలాగే బాండ్స్ పైన సంవత్సరానికి 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీపై పన్ను ఉంటుంది. అయితే టీడీఎస్ మాత్రం వర్తించదు. సావరీన్ గోల్డ్ బాండ్స్ పైన జీఎస్టీ ఉండదు. బంగారం కొనుగోళ్లపై 3% జీఎస్టీ ఉంటుంది.

English summary

బంగారం కొంటున్నారా?: ఏ ఆభరణంపై ఎంత ట్యాక్స్ పడుతుందో తెలుసుకోండి | Know the income tax rules before buying gold

Buying valuables like gold and silver on occasions like Dhanteras is considered auspicious in India. This year buyers have another option: sovereign gold bonds, which are currently open for subscription.
Story first published: Sunday, October 27, 2019, 9:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X