For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

NRIలకు గుడ్‌న్యూస్: ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, లాభమేమిటి?

|

NRIలకు గుడ్ న్యూస్. ఇండియన్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్న ఎన్నారైలు విదేశాల నుంచి రాగానే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఎన్నారైలు ఆధార్ పొందాలంటే 180 రోజులు వేచి చూసే పరిస్థితి. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే ఆధార్ ఇచ్చే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు గత బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. తక్షణమే ఆధార్ జారీపై సెప్టెంబర్ 20వ తేదీన కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఎన్నారై భారత్‌కు చేరుకోగానే ఆధార్ పొందేందుకు అర్హుడు.

రూ.12,500 సాయం: రైతుభరోసాకు ఎవరు అర్హులు, విధివిధానాలురూ.12,500 సాయం: రైతుభరోసాకు ఎవరు అర్హులు, విధివిధానాలు

ముందే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

ముందే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకారం భారత్ వెలుపల నివసిస్తున్న ఎన్నారైలు ఇప్పుడు ఆధార్ కోసం ముందే దరఖాస్తు చేసుకోవచ్చు. విదేశాల నుంచి వచ్చే ఎన్నారై ఏ రోజు ఇండియాకు వస్తున్నాడో తేదీలను మెన్షన్ చేయాలి. వారికి అందుబాటులో ఉన్న తేదీల ఆధారంగా సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆధార్ దరఖాస్తు పార్మాలిటీస్ పూర్తి చేయాలి. పేర్కొన్న తేదీల ప్రకారం ఆధార్ ఇస్తారు. అంటే ఎన్నారైలు 180 రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆధార్ జారీ ప్రక్రియలో అవసరమైన మార్పులు చేస్తామని, తద్వారా ఎన్నారైలకు ఆధార్ జారీ ఆలస్యం కాదని UIDAI CEO అజయ్ భూషణ్ పాండే తెలిపారు.

టైమ్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు

టైమ్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు

ఎన్నారైలకు తక్షణమే ఆధార్ జారీ చేసేందుకు అవసరమైన సాంకేతిక మార్పులు చేస్తున్నామని, బయటి దేశాల్లో ఉన్నవారు కూడా టైమ్ స్లాట్ కోసం దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పిస్తున్నామని, వారు ఏ ఆధార్ కేంద్రానికి వెళ్లాలనుకుంటున్నారో పేర్కొనవచ్చునని అజయ్ భూషణ్ పాండే తెలిపారు. వారు భారత్ వచ్చిన వెంటనే ఆధార్ కేంద్రానికి వెళ్లి ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

ఎన్నారైలకు ఆధార్‌తో లాభాలు

ఎన్నారైలకు ఆధార్‌తో లాభాలు

భారత్‌లో ప్రస్తుతం ఆధార్ చాలా ముఖ్యం. ఆదాయ పన్ను దాఖలు చేయడం మొదలు ఈ-కేవైసీ వరకు (కొన్నింటికి తప్ప) అన్నింటికి ఆధార్ కార్డు అవసరం. ఎన్నారై కనుక వెంటనే ఆధార్ పొందితే ఈ-కేవైసీ ప్రక్రియ కోసం దానిని ఉపయోగించుకోవచ్చు. అలాగే ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలులో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

పాస్‌పోర్ట్ ఐడీ, అడ్రస్ ప్రూఫ్‌గా...

పాస్‌పోర్ట్ ఐడీ, అడ్రస్ ప్రూఫ్‌గా...

ఎన్నారైలు ఆధార్ కార్డు దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. ఇక్కడ ఆ కింది విషయాలు తెలుసుకోండి.

- ఇండియన్ పాస్‌పోర్ట్ కలిగిన ఎన్నారైలు బయోమెట్రిక్ ఐడీ కోసం ముందస్తు అపాయింటుమెంట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

- చెల్లుబాటు అయ్యే ఇండియన్ పాస్‌పోర్ట్‌ను గుర్తింపు కార్డుగా, అడ్రస్ ప్రూఫ్‌గా, పుట్టిన తేదీ రుజువుగా UIDAI అంగీకరిస్తుంది.

భారత్ అడ్రస్ లేకుంటే...

భారత్ అడ్రస్ లేకుంటే...

- ఎన్నారై పాస్‌పోర్టులో భారత్ అడ్రస్ లేకుంటే చిరునామా రుజువుగా UIDAI ఆమోదించిన ఇతర పీఓఏ డాక్యుమెంట్స్ సమర్పించాలి.

- ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు గత ఏడాది కాలంలో 182 రోజులు భారత్‌లో ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే ఇవ్వనుంది.

ఎన్నారైలు ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఎన్నారైలు ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

- NRIలు UIDAI పోర్టల్‌లోకి వెళ్లాలి.

- అక్కడ పేర్కొన్న అన్ని వివరాలు ఇవ్వాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి.

- మీరు ఇండియాకు వచ్చే షెడ్యూల్ టైమ్‌ను పేర్కొనాలి.

- ఏ డాక్యుమెంట్స్ అవసరమో తెలుసుకునేందుకు ఇది క్లిక్ చేయండి.

(https://ssup.uidai.gov.in/ssup/instruction#ListofValidDocuments)

English summary

NRIలకు గుడ్‌న్యూస్: ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, లాభమేమిటి? | NRIs Will Get Instant Aadhaar In India: How to apply?

In a huge relief to millions of NRIs, Government of India has issued notification, stating that every NRI will get their Aadhaar card instantly, after they arrive in India.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X