For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెలుగులో గూగుల్ అసిస్టెంట్, లెన్స్ ఈ భాషల్నీ అర్థం చేసుకోగలదు

|

గూగుల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ సహా మరిన్ని భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ కాలంలో ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. ఇందులోను ఆండ్రాయిడ్ ఫోన్‍‌లు అధికం. చాలామంది గూగుల్ అసిస్టెంట్ సదుపాయాన్ని ఉపయోగిస్తుంటారు. మరికొందరికి దీని గురించి తెలిసినా మాతృభాషలో లేక వినియోగానికి ఉపయోగించలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం గూగుల్ ప్రత్యేకంగా కొత్త అప్ డేట్ తీసుకు వచ్చింది.

నెలకు రూ.1,500 జీతం,ఇప్పుడు KBCలో రూ.1 కోటి గెలిచిన వంటమనిషినెలకు రూ.1,500 జీతం,ఇప్పుడు KBCలో రూ.1 కోటి గెలిచిన వంటమనిషి

తెలుగు సహా ఎనిమిది భాషల్లో...

తెలుగు సహా ఎనిమిది భాషల్లో...

గూగుల్ అసిస్టెంట్‌ను ఇక నుంచి హిందీ, తెలుగు, గుజరాతీ, కన్నడ, ఉర్దూ, బెంగాలీ, మరాఠి, తమిళంలో వినియోగించే సదుపాయాన్ని కల్పించింది. గురువారం జరిగిన గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో ఈ కొత్త అప్ డేట్‌ను ప్రకటించింది. ఈ కొత్త సదుపాయంతో గూగుల్ అసిస్టెంట్‌తో పని చేసే స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్లు ఇకపై ఆయా భాషల్లో ఇచ్చే ఆదేశాల మేరకు పని చేస్తాయి.

ఈ కొత్త సదుపాయం కోసం ఏం చేయాలంటే?

ఈ కొత్త సదుపాయం కోసం ఏం చేయాలంటే?

ఈ కొత్త సదుపాయం వినియోగించడానికి తొలుత గూగుల్ యాప్‌ను అప్ డేట్ చేసుకోవాలి. ప్రస్తుతం హిందీతో పాటు ఇతర భాషల్లో గూగుల్ అసిస్టెంట్ అందుబాటులో ఉన్నప్పటికీ ఓఎస్ లాంగ్వేజ్ మార్చుకోవాల్సి వచ్చేది. ఇకపై అలా మార్చకుంటానే ఈ సదుపాయం ఉంటుంది.

ఇక సులభంగా మార్చుకోవచ్చు...

ఇక సులభంగా మార్చుకోవచ్చు...

ఇకపై భారత యూజర్లు గూగుల్ అసిస్టెంట్ లాంగ్వేజ్‌ను సులభంగా మార్చుకోవచ్చునని గూగుల్ ప్రతినిధి తెలిపారు. హే గూగుల్ టాక్ టు మి ఇన్ తెలుగు... అని కమాండ్ చేస్తే సరిపోతుందని, ఎవరికి కావాల్సిన భాషను వారు చెప్పాలని, ఇందుకు సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆండ్రాయిడ్, ఆండ్రాయిడ్ గో, కాయ్ ఓఎస్ డివైజ్ వినియోగదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త అప్ డేట్‌తో ఇష్టమైన భఆషలో గూగుల్ సేవలను పొందవచ్చునని చెప్పారు.

గూగుల్ లెన్స్..

గూగుల్ లెన్స్..

గూగుల్ లెన్స్ కూడా తమిళ్, తెలుగు, మరాఠీలను సపోర్ట్ చేయనుంది. ఇదివరకు కేవలం ఇంగ్లీష్, హిందీలను మాత్రమే సపోర్ట్ చేసింది. దీని ద్వారా యూజర్లు తమ ఫోన్ కెమెరాను ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ భాషల వైపు చూపిస్తే గూగుల్ లెన్స్ దానిని వినియోగదారులకు అవసరమైన భాషలోకి మార్చుతుంది.

English summary

తెలుగులో గూగుల్ అసిస్టెంట్, లెన్స్ ఈ భాషల్నీ అర్థం చేసుకోగలదు | Google Assistant gets more optimised for Indian languages

Google's Assistant on smart speakers, smartphones and computers can now talk to users in Telugu along with eight other Indian languages without requiring the OS support for local language.
Story first published: Thursday, September 19, 2019, 17:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X