For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: సులభ ఐటీ రిటర్న్స్ దాఖలుకు ఈ-ఫైలింగ్ లైట్, ఇవి కావాలి..

|

న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు తేదీని ఆగస్ట్ 31వ తేదీ వరకు పొడిగించారు. దీంతో ఎంతోమంది ట్యాక్స్ పేయర్స్‌కు ఊరట లభించింది. ఐటీ రిటర్న్స్‌ను సులభంగా, వేగంగా ఫైల్ చేసేందుకు ఆదాయ పన్ను శాఖ ఈ-ఫైలింగ్ లైట్ వర్షన్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. డిపార్టుమెంటుకు చెందిన అధికారిక పోర్టల్ http://www.incometaxindiaefiling.gov.in/home ద్వారా దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఈ పోర్టల్‌ను ఓపెన్ చేయగానే హోమ్ పేజీ పైన కనిపిస్తుంది.

ఈ-ఫైలింగ్

ఈ-ఫైలింగ్

ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి ఆగస్ట్ 31వ తేదీ డెడ్ లైన్ అని, చివరి నిమిషంలో హడావుడి పడకుండా, సాధ్యమైనంత త్వరగా రిటర్న్స్ ఫైల్ చేయాలని సూచన చేశారు. హోమ్ పేజీలో పూర్తిగా పైన e-filing.. any where, any time అని ఉంటుంది. దాని పైన క్లిక్ చేస్తే ఆగస్ట్ 31వ తేదీలోగా ఫైల్ చేయాలని సూచన ఉంటుంది. హోమ్ పేజీ పైన Quick Linksలో Quick ITR Filing (New) పైన క్లిక్ చేయాలి. అది నేరుగా ఈ ఫైలింగ్ పేజీలోకి వెళ్తుంది.

సులభతరం, వేగవంతం

సులభతరం, వేగవంతం

లైటర్ వర్షన్ ఈ-ఫైలింగ్ పోర్టల్ ట్యాక్స్ పేయర్స్‌కు సులభతరమే కాకుండా, వేగవంతంగా ఉంటుంది. ఈ-ఫైలింగ్ లైట్ ద్వారా పైల్ చేసేందుకు యూజర్ నేమ్, పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. ట్యాక్స్ పేయర్స్‌కు హోమ్ పేజీలో పోర్టల్ లాగిన్ మరియు ఈ-ఫైలింగ్ లైట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ-ఫైలింగ్ లైట్ పోర్టల్ ద్వారా డ్యాష్ బోర్డు, మై అకౌంట్, ఈ-పైల్ సెక్షన్స్‌ యాక్సెస్ ఉంటుంది.

వీటికి మాత్రమే యాక్సెస్

వీటికి మాత్రమే యాక్సెస్

మై అకౌంట్ సెక్షన్ కింద ఫాం 26ఓఏ, ప్రీ-ఫైల్డ్ రిటర్న్స్, ప్రీ-ఫైల్డ్ రిటర్న్స్ XML వర్షన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లైటర్ వర్షన్ ఈ-ఫైల్ సెక్షన్ ద్వారా కేవలం ఈ-ఫైలింగ్ మాత్రమే చేయవచ్చు.

పోర్టల్ లాగిన్ ద్వారా అయితే..

పోర్టల్ లాగిన్ ద్వారా అయితే..

పోర్టల్ లాగిన్ ద్వారా డ్యాష్ బోర్డు, మై అకౌంట్, ఈ ఫైల్ ప్రొసీడింగ్స్, ఈ-నివారన్, కంప్లియెన్స్, ఈ-ఫైల్ వంటి సేవలు చూడవచ్చు. ఈ పోర్టల్ ద్వారా బ్యాంకు అకౌంట్ లింక్, ఆదార్ లింక్ చేసుకోవచ్చు. అడ్రస్ మార్పులు చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు ఉంటే...

పూర్తి వివరాలు ఉంటే...

ఎవరి వద్దనైనా వ్యక్తిగత వివరాలు సహా పూర్తి వివరాలు మీ సిస్టంలో ఉంటే ఈ-ఫైలింగ్ లైట్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. అప్పుడు ఇది ఎంతో సులభంగా పూర్తవుతుంది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఆగస్ట్ 31. అన్ని వివరాలు ఉంటే కనుక ఈ-ఫైలింగ్ లైట్ ద్వారా రిటర్న్స్ దాఖలు ఎంతో సులభం, వేగవంతం.

English summary

గుడ్‌న్యూస్: సులభ ఐటీ రిటర్న్స్ దాఖలుకు ఈ-ఫైలింగ్ లైట్, ఇవి కావాలి.. | Income Tax department launches e filing lite, Here are details

Being a lighter version, the 'e-Filing Lite' will not carry the same links as available to the taxpayer on accessing Portal Login on I-T E-filing website.
Story first published: Friday, August 2, 2019, 8:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X