For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రభుత్వం ఛీప్‌గా ఇచ్చే బీమా.. రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి తెలుసా ?

|

కుమార్ వయస్సు 45 ఏళ్లు. అతనికి ఇద్దరు పిల్లలు. వాళ్లిద్దరీ వయస్సు 15 ఏళ్లలోపే. అతని జీతం ఎంత కష్టపడినా నెలకు రూ.25వేల లోపే. అదే సమయంలో కుమార్ భార్య గృహిణి. నెలనెలా అలా అలా బండి ఈదుకుంటూ వస్తుంటారు. కూడబెట్టింది ఏమీ లేదు.. ఏ నెలకు ఆ నెల నడిస్తే చాలనుకునే పరిస్థితి. ఆల్ హ్యాపీస్ అనుకుంటున్న తరుణంలో ఒక రోజు ఉన్నట్టుండి కుమార్‌కు జబ్బు చేసింది. అప్పులు చేసి అక్కడో ఇక్కడో తిరిగి రెండుమూడు లక్షలు పెట్టి కుమార్‌ను బతికించుకుంది ఆ కుటుంబం. అయితే కొద్దికాలం తర్వాత అది తిరగబెట్టి కుమార్ ఈ లోకం వదిలివెళ్లిపోయాడు. ఇద్దరు పిల్లలు, చేతిలో చిల్లిగవ్వలేదు, పైగా మూడు లక్షల అప్పు. ఇప్పుడు ఆలోచించండి.. ఆ కుటుంబం పరిస్థితి. ఇది ఒక్క కుమార్ కథే కాదు.. మనలో చాలా మంది పరిస్థితీ అంతే. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు.. సంపాదనలో మార్పులు ఉండొచ్చేమో కానీ.. ప్లానింగ్ మాత్రం లేదు.

పై స్టోరీలో మనం అర్థమైంది ఏంటీ అంటే.. ఆ కుటుంబ పెద్ద హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనే వాటి గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. ఫలితాన్ని మాత్రం అతని కుటుంబం అనుభవించింది. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఉన్నదానిలో అతి తక్కువ ఖర్చులో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఈ మధ్య అతి చవకగా అందిస్తున్న బీమా వివరాలేంటో చూడండి. ఇప్పటికైనా వీటి గురించి తెలుసుకుని, మరో నలుగురికి కూడా వివరిద్దాం.

బ్యాంక్ ఖాతా తెరవండి

బ్యాంక్ ఖాతా తెరవండి

ఆ.. బ్యాంక్ ఖాతానే కదా.. మా దగ్గర ఉంది అని కొట్టిపారేయొద్దు. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్లి ముందుగా ప్రధాని జన్ ధన్ యోజన కింద బ్యాంక్ ఖాతా తెరవండి. ఒక వేళ దీని గురించి మీకు అవగాహన లేకపోతే బ్యాంక్ మేనేజర్, లేదా ఉద్యోగుల సహాయం పొందండి. దీన్ని మీరు తీసుకోవడం ద్వారా రూ.30 వేల విలువైన జీవిత బీమా, రూ.1,00,000 విలువైన ప్రమాద బీమా సౌకర్యం వెంటనే లభిస్తుంది. పైసా ఖర్చు లేకుండా. ఒక వేళ ఏదైనా జరిగితే.. ఈ సొమ్ము అక్కరకు వస్తుంది. ఇంకో విషయం.. మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోండి.

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్

కుటుంబ పెద్ద హఠాన్మరణం ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడ్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. స్కూలుకు వెళ్లే పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యత వంటివి బోనస్. అందుకే చిన్న టర్మ్ కవర్ తీసుకుంటే.. ఒక వేళ ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు కనీసం కొద్దిగా ఆర్థిక సాయమైనా వాళ్లకు అక్కరకు వస్తుంది. కుటుంబ పెద్ద లేని లోటు తీర్చలేకపోయినప్పటికీ డబ్బు మాత్రం చేతికందుతుంది. అందుకే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో చేరండి. ఏడాదికి ఇందుకు మీరు ఖర్చు చేయాల్సిన మొత్తం రూ.330. దీంతో మీకు రూ.2 లక్షల టర్మ్ కవర్ దొరుకుతుంది. పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ల వాళ్ల వరకూ ఇది తీసుకోవచ్చు. బ్యాంకులో ఆటో డెబిట్ సౌకర్యం ఉంటుుంది కాబట్టి.. ప్రతీ ఏడాది మనతో ప్రమేయం లేకుండానే ఈ సొమ్ము మీ బ్యాంక్ ఖాతా నుంచి తగ్గించబడ్తుంది.

ప్రైవేట్ బీమా సంస్థలు.. ఆదాయం చూడకుండా టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. అందుకే చిన్న ఉద్యోగులకు, షాపుల యజమానాలకు, చిరువర్తకులకు ఇదో అత్యద్భుత వరం.

ప్రమాద బీమా

ప్రమాద బీమా

దీన్ని ఎవరూ లెక్కచేయరు. వాస్తవానికి టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కంటే దీనికే వేల్యూ ఎక్కువ. ఎందుకంటే.. ఏదైనా ప్రమాదం జరిగి ఇంటికే పరిమితమైనప్పుడు.. ఆ బాధ వర్ణణాతీతం. ఓ వైపు జీతం అందదు, ఖర్చులు కుంగదీస్తుంటాయి. అందుకే ఇప్పుడు ఎస్బీఐ వంటి అనేక బ్యాంకులు అతి చవకగా యాక్సిడెంటల్ కవర్‌ను అందిస్తున్నాయి. ఏడాదికి రూ.750 చెల్లిస్తే.. రూ.5 లక్షల వరకూ ప్రమాద బీమా పొందొచ్చు. ఇది మరణం లేదా.. పాక్షిక-శాశ్వత వైకల్యానికి పనికొస్తుంది.

దీనికి అదనంగా ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కూడా తీసుకోండి. ఇది లక్ష నుంచి రెండు లక్షల వరకూ కవర్ ఇస్తుంది.

ఆరోగ్య బీమా

ఆరోగ్య బీమా

చిన్న చిన్న రోగాలు వచ్చినప్పుడు మనం ఆసుపత్రులకు వెళ్లడం పరిపాటే. వాటికి పెద్దగా ఖర్చు కాదు. కానీ ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడే అసలు చిక్కు. మనం కూడబెట్టిందంతా కరిగిపోతుంది. ఇలాంటి సమయంలో కావాల్సిందే ఆరోగ్య బీమా. ప్రస్తుతం అనేక సంస్థలు ఆరోగ్యబీమా అందిస్తున్నాయి. అయితే ఇందుకోసం నెలకు రూ.10 నుంచి 15 వేల వరకూ ఖర్చవుతుంది. ఒక వేళ అది కట్టుకోలేని పక్షంలో ప్రధాని జన్ ఆరోగ్య స్కీమ్ కింద మీరు లబ్ధి పొందగలరేమో చెక్ చేసుకోండి. పట్టణాల్లో ఉన్న అసంఘటిత కార్మికులకు, ఉద్యోగులకు కేంద్రం ఈ వరాన్ని ఇచ్చింది. మీ ఎలిజిబులిటీని వెబ్ సైట్లో చెక్ చేసుకోండి. ఒక వేళ మీరు ఈ పరిధిలోకి వస్తే.. ఇక ఆలస్యం చేయకుండా కేంద్రం ఇచ్చే ఆరోగ్య బీమాలో చేరిపోండి. మీ ఎలిజిబులిటీని కింది లింక్ లో చెక్ చేసుకోండి. https://mera.pmjay.gov.in/search/eligible

రిటైర్మెంట్ ప్లాన్

రిటైర్మెంట్ ప్లాన్

వయస్సు మళ్లిన తర్వాత ఇతరులపై ఆధారపడకుండా మనకాళ్లపై మనం నిలబడగలగాలి. రికరింగ్ డిపాజిట్ల మొదలు మ్యూచువల్ ఫండ్ వరకూ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. వీటికి తోడు ప్రధాని శ్రమ్ యోగి మంధన్ పెన్షన్ యోజనను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. నెలకు ఇప్పుడు రూ.200 చెల్లింపుతో 60 ఏళ్ల కాలంలో నెలకు రూ.3000 వరకూ పెన్షన్ అందుకునే సౌలభ్యం ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కనీసం చిన్న చేతి ఖర్చులకు ఎవరిపై ఆధారపడకుండా హుందాగా జీవించేందుకు దోహదపడ్తుంది.

English summary

ప్రభుత్వం ఛీప్‌గా ఇచ్చే బీమా.. రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి తెలుసా ? | central government under many schemes helping citizens of India

central government under many schemes helping citizens of India in covering health and accidental insurance. Under a scheme you can also get monthly pension too. To check out many details read this article about term insurance, health insurance and retirement planning.
Story first published: Sunday, August 18, 2019, 9:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X