For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త అద్దె చట్టం: 2 నెలల అడ్వాన్స్, ఎక్కువ రోజులుంటే 4 రెట్ల రెంట్

|

న్యూఢిల్లీ: అద్దె ఇళ్ల యజమానులు, కిరాయిదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకువస్తామని ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అద్దె ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేసింది. దేశంలో భవనాలు, స్థలాలను అద్దెకు ఇవ్వడానికి సంబంధించిన డ్రాఫ్ట్‌ను రూపొందించిన కేంద్రం, ఆగస్ట్ 1లోపు బిల్లుపై ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుంది. ఓనర్స్, రెంటర్స్ నష్టపోకుండా పలు నిబంధనలు బిల్లులో ప్రతిపాదించింది. ఈ బిల్లు వస్తే అప్పుడు ఎక్కడైనా ఒకేవిధమైన ధరలో ఇల్లు దొరుకుతుంది.

ఇంట్రెస్టింగ్: రుణాలు ఇచ్చేందుకు మాల్యాకు HDFC నోఇంట్రెస్టింగ్: రుణాలు ఇచ్చేందుకు మాల్యాకు HDFC నో

నిబంధనలు... సెక్యూరిటీ డిపాజిట్

నిబంధనలు... సెక్యూరిటీ డిపాజిట్

ఈ డ్రాఫ్ట్ ప్రకారం అద్దె ఇళ్ల సెక్యూరిట డిపాజిట్ రెండు నెలలకు మించకూడదు. నివాసేతర సముదాయాలకు ఒక నెల అద్దెను కనీస సెక్యూరిటీ డిపాజిట్‌గా నిర్ధారించారు. ఈ తరహా నియంత్రణ వల్ల వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చినవారు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, వృత్తి నిపుణులు, విద్యార్థులు ఇళ్లు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకే అద్దె విధానం.

నిబంధనలు... ఎక్కువ రోజులు ఉంటే 4 రెట్ల అద్దె వసూలు

నిబంధనలు... ఎక్కువ రోజులు ఉంటే 4 రెట్ల అద్దె వసూలు

అద్దె పెంచాలంటే కిరాయిదారుకు యజమాని మూడు నెలల ముందే రాతపూర్వకంగా వెల్లడించాలి. అద్దెకు భవనం లేదా ఖాళీ స్థలం తీసుకున్నవారు ముందుగా ఒప్పందం చేసుకున్న సమయం కంటే ఎక్కువ రోజులు ఉంటే సమయానికి ఖాళీ చేయకుంటే రెండు నుంచి నాలుగు రెట్లు అధికంగా అద్దె వసూలు చేయవచ్చు. సమయానికి మించి రెండు నెలలు ఉంటే 2 రెట్లు, అంతకుమించి ఉంటే 4 రెట్లు వసూలు చేస్తారు.

నిబంధనలు... రిపేర్ చేసి కట్ చేసుకోవచ్చు

నిబంధనలు... రిపేర్ చేసి కట్ చేసుకోవచ్చు

ఇంట్లో ఏదైనా రిపేర్ చేయించాల్సిన పరిస్థితులు వస్తే.. ఓనర్ దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోకుంటే అద్దెకు ఉన్నవారు రిపేర్ చేయించుకొని అద్దెలో మినహాయించుకోవచ్చు. అలాగే అద్దెకు ఉన్నవారు చేయించుకోవాల్సిన రిపేర్ల విషయంలోను వారు పట్టించుకోకుంటే ఓనర్ రిపేర్ చేయించి.. ఆ ఖర్చును అడ్వాన్స్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయించుకోవచ్చు లేదా అడిగి తీసుకోవచ్చు.

అద్దె వ్యవహారాల విభాగం

అద్దె వ్యవహారాల విభాగం

యజమానులు, కిరాయిదారుల ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్యవేక్షణలో ఇందుకు సంబంధించిన విభాగం ఏర్పాటు చేస్తారు. ఓనర్ - రెంటర్ ఇద్దరూ ఒప్పంద పత్రాన్ని కలెక్టర్ పర్యవేక్షణలోని అద్దె వ్యవహారాల విభాగానికి 2 నెలలలోపు ఇవ్వాలి. వీరికి ఆ విభాగం ఓ విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇస్తుంది. అద్దెను నిర్ణయించడం, సవరించడం వంటి అధికారాలు కూడా ఈ విభాగానికి ఉంటాయి. రెంట్ అథారిటీ, రెంట్ కోర్టు, రెంట్ ట్రైబ్యునళ్ల ఏర్పాటు వల్ల వివాదాలు, ఫిర్యాదుల పరిష్కారం సులభం కానుంది.

స్థానిక భాషలో డిజిటల్ ప్లాట్ ఫాం

స్థానిక భాషలో డిజిటల్ ప్లాట్ ఫాం

రెంటల్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్, ఇతర డాక్యుమెంట్స్ సమర్పణకు రాష్ట్రస్థాయిలో స్థానిక భాషల్లో ఒక డిజిటల్ ప్లాట్ ఫాం ఏర్పాటు చేస్తారు. ఈ రెంటల్ డ్రాఫ్ట్‌పై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఆగస్ట్ 1వ తేదీ లోపు అభిప్రాయాలు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభిప్రాయాలు చెప్పవచ్చు. కాగా, 2011 జనాభా లెక్కల ప్రకారం 1.1 కోట్ల ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్్న అద్దె నియంత్రణ చట్టం యజమానులకు ఆందోళన కలిగించేలా ఉందని కేంద్రం అభిప్రాయపడుతోంది. అందుకే కొత్త రెంటల్ చట్టం తీసుకు వస్తోంది.

English summary

కొత్త అద్దె చట్టం: 2 నెలల అడ్వాన్స్, ఎక్కువ రోజులుంటే 4 రెట్ల రెంట్ | Centre's new model law caps security deposit that landlords can demand

Unable to find a good house to rent in urban areas? Soon, millions of new properties could be up for renting as the Centre has proposed a model tenancy law to regulate renting of houses.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X