For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లోన్స్ చాలా ఈజీ... ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే ప్రయోజనాలెన్నో

|

న్యూఢిల్లీ: 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి చివరి తేదీ ఆగస్ట్ 31, 2019. కొందరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆసక్తి చూపించరు. రూ.2.5 లక్షల ఆదాయం దాటిన వారు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. 60 నుంచి 80 ఏళ్ల వయస్సు కలిగిన వారు రూ.3 లక్షలు, 80 ఏళ్లు దాటిన వారు రూ.5 లక్షల మినహాయింపు ఉంది. అయితే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల లాభాలు ఉంటాయి.

గడువుదాటినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే జరిమానా ఇలా, జైలుశిక్షగడువుదాటినా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుంటే జరిమానా ఇలా, జైలుశిక్ష

ఐటీఆర్‌తో ప్రయోజనాలు

ఐటీఆర్‌తో ప్రయోజనాలు

ఆదాయం మినహాయింపు పరిమితి లోపు ఉన్నప్పటికీ, భారత్ వెలుపల ఏదైనా ఆస్తి కలిగి ఉంటే లేదా భారత్ వెలుపల ఏవైనా ఆర్థిక కార్యకలాపాలు ఉంటే లేదా భారతదేశం వెలుపల ఉన్న ఆస్తులు లేదా ఆర్థిక కార్యకలాపాల వల్ల ప్రయోజనాలు ఉంటే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే లాభముందా.. అంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.. అనుకుంటే పొరపాటు. ఐటీఆర్ ఫైల్ చేయడం మాండేట్ కాని వ్యక్తులు కూడా అది ఫైల్ చేస్తే కొన్ని ప్రయోజనాలు పొందుతారు. మినహాయింపు కంటే తక్కువ ఆదాయం ఉన్నా ఫైల్ చేస్తే బెనిఫిట్స్ ఉంటాయి.

సులభంగా లోన్స్ వస్తాయి

సులభంగా లోన్స్ వస్తాయి

టీడీఎస్ కట్ అయితే, రీఫండ్ కోసం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చునని చెబుతున్నారు. మనం లోన్స్ కోసం అప్లై చేసుకున్నప్పుడు కూడా ఐటీ రిటర్న్స్ ఉపయోగపడాయి. మన ఐటీ రిటర్న్స్ ఆధారంగా రుణ అర్హత, రుణ పరిమాణం దీనిపై ఆధారపడి ఉంటుంది. మీ ఐటీ రిటర్న్స్ మీ ఆదాయం, ట్యాక్స్ గురించిన కంప్లీట్ డిటైల్స్ చెబుతాయి. కాబట్టి ఆర్థిక సంస్థలు సులభంగా లోన్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.

క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు

క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే నష్టాన్ని క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. మీకు నష్టం వచ్చిందనో, మినహాయింపు కంటే తక్కువ ఉందనో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుండా ఉండవద్దు. అలా చేస్తే వచ్చే ఏడాదికి నష్టాన్ని క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ప్రమాదవశాత్తూ మరణించినా లేదా వైకల్యం సంభవించిన సందర్భాల్లో మోటారు వాహన చట్టం ఐటీఆర్‌ను తప్పనిసరి చేయలేదు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ విషయంలో క్లెయిమ్ ట్రైబ్యునల్ అంగీకరించిన ప్రొసీజర్స్‌కు ఢిల్లీ హైకోర్టు ఆమోదం ఐటీఆర్ అవసరాన్ని తెలియజేస్తోంది.

పన్ను చెల్లింపులో పరిగణించే అంశాలు

పన్ను చెల్లింపులో పరిగణించే అంశాలు

వేతనం పొందుతున్న వారు వేతనం, అలవెన్సులు.. అన్నింటిపై పన్ను చెల్లించాలి. ఇల్లు/ఆస్తి వంటి ఆస్తులు కలిగి ఉంటే దానిపై ఆదాయం పొందుతున్నట్లయితే పన్ను చెల్లించాలి. పెట్టుబడి తర్వాత మొత్తాలను విక్రయించినట్లయితే వాటి ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలి. వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం లభిస్తే పన్ను చెల్లించాలి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా ఆదాయం, ప్యామిలీ పెన్షన్, గిఫ్ట్ రూపంలో వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలి.

English summary

లోన్స్ చాలా ఈజీ... ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే ప్రయోజనాలెన్నో | Benefits of filing ITR even when income is below exemption limit

Even though filing of ITR is not mandatory for some individuals, there are certain benefits that one can avail of provided the ITR has been filed.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X