For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్ గ్రామసచివాలయ ఉద్యోగం: ఖాళీలు, వేతనం, అర్హతలు, దరఖాస్తు విధానం

|

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ అయింది. షెడ్యూల్ ప్రకారం జూలై 22న విడుదల కావాల్సిన నోటిఫికేషన్ జూలై 26న రాత్రి విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేయనున్న గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి మొత్తం 1,28,728 పోస్టులను భర్తీ చేస్తుంది. గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 99,088 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 పోస్టులు భర్తీ చేస్తారు. జిల్లా ఎంపిక కమిటీల ద్వారా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. gramasachivalayam.ap.gov.in. వెబ్ సైట్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

జగన్‌కు 'రూ.10 కోట్ల' ఊరట: 'జగతి ఆస్తుల్ని, డిపాజిట్స్ విడుదల చేయండి'జగన్‌కు 'రూ.10 కోట్ల' ఊరట: 'జగతి ఆస్తుల్ని, డిపాజిట్స్ విడుదల చేయండి'

భర్తీ చేయనున్న పోస్టులు... చివరి తేదీ

భర్తీ చేయనున్న పోస్టులు... చివరి తేదీ

గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, సర్వే అసిస్టెంట్, ఏఎన్ఎం, వెటర్నరీ/ఫిషరీస్ అసిస్టెంట్, మహిళా పోలీసు అండ్ ఉమెన్ చైల్డ్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్, అగ్రికల్చర్/హార్టికల్చర్ ఎంపీఈవో, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. వార్డు సచివాలయాల్లో కార్యదర్శి, మౌలిక వసతుల కార్యదర్శి, శానిటేషన్ కార్యదర్శి, విద్యా కార్యదర్శి, ప్రణాళికా కార్యదర్శి, వెల్ఫేర్ అండ్ డెవెలప్‌మెంట్ కార్యదర్శి, ఇంధన కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శి పోస్టులు భర్తీ చేస్తారు. దరఖాస్తు చివరి తేదీ ఆగస్ట్ 10.

80 శాతం ఉద్యోగాలు స్థానికులకు.. స్థానికత గుర్తింపు ఇలా...

80 శాతం ఉద్యోగాలు స్థానికులకు.. స్థానికత గుర్తింపు ఇలా...

గ్రామ, వార్డు సచివాలయాల్లో భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో 80 శాతం పోస్టులను స్థానికులకు కేటాయిస్తారు. మిగిలిన 20 శాతం పోస్టులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని అభ్యర్థుల స్థానికతను గుర్తిస్తారు. నాలుగో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్ళ కాలంలో నాలుగేళ్ల పాటు ఏ జిల్లాలలో చదువుకుంటారో సదరు అభ్యర్థిని ఆ జిల్లా స్థానిక కేటగిరీ కింద గుర్తిస్తారు. ఆ జిల్లాకు కేటాయించిన పోస్టుల్లో 80 శాతం వారితో భర్తీ చేస్తారు. ఓ జిల్లాలో ఎక్కువ కాలం చదివి వేరే జిల్లాలో దరఖాస్తు చేసుకుంటే ఓపెన్ కేటగిరీలో అంటే 20 శాతం మందిలో ఎంపిక చేస్తారు.

అర్హతలు...

అర్హతలు...

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారి వయస్సు 18 నుంచి 42 మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గరిష్ట పరిమితిలో అయిదేళ్లు సడలింపు. వికలాంగులకు పదేళ్లు సడలింపు. సంబంధిత ఉద్యోగంలో ఇప్పటికే ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తూ ఉంటే వయో పరిమితిలో వారి సర్వీసు కాలానికి సడలింపు ఉంటుంది. వీరికి డీడీవో (డిస్ట్రిక్ట్ డెవలప్‍‌మెంట్ ఆఫీసర్)గా పంచాయతీ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఈ పంచాయతీ సెక్రటర్లకే.. గ్రామవాలంటీర్లకు వేతనాలు చెల్లించే బాధ్యతను కూడా ప్రభుత్వం అప్పగించింది.

వేతన వివరాలు...

వేతన వివరాలు...

ఎంపికయ్యే అభ్యర్థికి మొదటి రెండేళ్లు రూ.15వేల చొప్పున గౌరవ వేతనం ఉంటుంది. ఈ రెండేళ్లు ప్రొబెషనరీ పీరియడ్. అనంతరం పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగా హోదా కల్పిస్తారు. అప్పుడు బేసిక్ శాలరీని అమలు చేస్తారు. పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు రూ.15,000 నుంచి రూ.46,000 మధ్య బేసిక్ శాలరీ ఉంది. మిగిలిన పోస్టులకు రూ.14,600 నుంచి రూ.44,870 మధ్య బేసిక్ శాలరీగా అమలు చేస్తారు.

దరఖాస్తు విధానం...

దరఖాస్తు విధానం...

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇందుకు ప్రభుత్వం మూడు వెబ్ పోర్టల్స్‌ను ఏర్పాటు చేసింది. http://gramasachivalayam.ap.gov.in/ ఈ వెబ్ సైట్ ఓపెన్ చేయగానే తొలుత ఉద్యోగ ప్రకటన వివరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3లలో దరఖాస్తు విధానం ఉంటుంది.

- మొదటి స్టెప్‌లో ప్రొఫైల్ నమోదు చేయాలి.

https://gramasvlmotr1956563.apcfss.in/ApGsVroPsOTPR2007191115.apgs

- రెండో స్టెప్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలి.

http://gramasachivalayam.ap.gov.in/application5217.html

- అనంతరం స్టెప్ 3లో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

https://payments.apcfss.in/PAYMENTFORMS17/apgsavm2019payment1985472369.do

స్టెప్ 1

స్టెప్ 1

వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఇందులో దరఖాస్తుదారు పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ నెంబర్ లేకుంటే దాని టిక్ చేయవలసి ఉంటుంది. అప్పుడు ఓటరు కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, పాస్ బుక్, పాస్ పోర్ట్ వంటి ఇతర వివరాలు నింపవలసి ఉంటుంది. ఆ తర్వాత ఫోటోను అటాచ్ చేయాలి. ఏ సైజ్ ఫోటో, ఉండాలో కూడా అక్కడ క్లియర్‌గా ఉంది. ఆ తర్వాత డిక్లరేషన్‌పైన టిక్ చేసి, కాప్చా ఎంటర్ చేసి, అప్ లోడ్ చేయాలి. అప్పుడు దరఖాస్తుదాకు సంబంధించి కేటాయించిన ఐడీ వివరాల మెసేజ్ వస్తుంది. దీని ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

స్టెప్ 2

స్టెప్ 2

స్టెప్ 2లో వివిధ కేటగిరీ కింద ఉద్యోగ వివరాలు ఉంటాయి. మీరు అందులో ఎంచుకొని దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడీ ఇవ్వాలి. డేటా ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కాప్చాను ఎంటర్ చేయాలి. డిక్లరేషన్ పైన టిక్ చేసి, సబ్‌మిట్ చేయాలి. తప్పులు లేకుండా నింపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం పూర్తి చేసి, క్లిక్ బటన్ నొక్కే వరకు తప్పులు సరిదిద్దుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం మార్చుకునే వీలుండదు.

ఇందులో కేటగిరీ-1లో ...

1. Panchayat Secretary (Grade-V)

2. Mahila Police and Women & Child Welfare Assistant/Ward Women & Weaker Sections Protection Secretary (Female)

3. Welfare & Education Assistant

4. Ward Administrative Secretary

కేటగిరీ- IIలో.. Group - A

(Common Examination with preference)

1. Engineering Assistant (Grade-II)

2. Ward Amenities Secretary (Grade-II)

Group - B

(Common Examination)

1. Village Revenue Officer (Grade-II)

2. Village Surveyer (Grade-III)

కేటగిరీ IIIలో...

(Separate Exam For Each Post)

1. Village Agriculture Assistant (Grade-II)

2. Village Horticulture Assistant

3. Village Fisheries Assistant

4. Panchayat Secretary (Grade-VI)

Digital Assistant

5. Ward Sanitation & Environment Secretary (Grade-II)

6. Ward Planning & Regulation Secretary (Grade-II)

7. Animal Husbandry Assistant

8. ANM/Ward Health Secretary (Grade-III) (Female)

9. Ward Education & Data Processing Secretary

10. Ward welfare & Development secretary (Grade-II)

11. Village Sericulture Assistant ఉద్యోగాలు ఉన్నాయి. APPLY పైన క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి.

స్టెప్ 3

స్టెప్ 3

చివరలో పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడీ.. లాగిన్ ఐడీ ఎంటర్ చేయాలి. పుట్టిన తేదీ వివరాలు ఇవ్వాలి. కాప్చాను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేయాలి.

ఫీజు వివరాలు...

ఫీజు వివరాలు...

అప్లికేషన్ ఫీజు రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.200. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లు కేవలం అప్లికేషన్ ఫీజు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. నాన్ లోకల్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. దీనికి రూ.100 ఛార్జ్ చేస్తారు. గరిష్టంగా ఒక అప్లికేషన్ 3 జిల్లాలకు అనుమతి.

ఎందులో ఎన్ని ఉద్యోగాలు..

ఎందులో ఎన్ని ఉద్యోగాలు..

రూరల్:

Panchayat Secretary - 7040

Village Revenue Officer(VRO)(Grade-II) - 2,880

ANMs (Grade-III) - 13,540

Animal Husbandry Assistant - 9,886

Village Fisheries Assistant - 794

Village Horticulture Assistant - 4,000

Village Agriculture Assistant (Grade-II) - 6,714

Village Sericulture Assistant - 400

Mahila Police and Women & Child Welfare Assistant - 14,944

Engineering Assistant (Grade-II) -11,158

Panchayat Secretary (Grade-VI) Digital Assistant - 11,158

Village Surveyor (Grade-III) - 11,158

Welfare and Education Assistant - 11,158

English summary

ఆంధ్రప్రదేశ్ గ్రామసచివాలయ ఉద్యోగం: ఖాళీలు, వేతనం, అర్హతలు, దరఖాస్తు విధానం | Andhra Pradesh Grama sachivalayam announces over 1.3 lakh vacancies

Andhra Pradesh Grama Sachivalayam recruitment notification is available online. As per reports, the Grama Sachivalayam will be recruiting eligible candidates on over 1.3 lakh vacancies.
Story first published: Sunday, July 28, 2019, 17:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X