For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉన్నత చదువుల కోసం విద్యారుణం ఉందిగా...

By Jai
|

ఉన్నత విద్య చాలా ఖరీదు తో కూడుకున్న వ్యవహారంలా మారిపోయింది. తల్లిదండ్రులు తమ సంపాదనలో అధిక శాతం పిల్లల విద్య కోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సంపాదన తక్కువ స్థాయిలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల విద్యకు అవసరమైన డబ్బుకోసం అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ప్రైవేట్ వ్యక్తుల వద్దఅప్పులు చేస్తే పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. ఇది వారి కుటుంబ ఆర్ధిక పరిస్థితిని దిగజార్చే అవకాశము ఉంటుంది. అందుకే బ్యాంకులు అందిస్తున్న విద్య రుణాన్ని తీసుకోవడం ద్వారా తక్కువ వడ్డీతో పాటు వాయిదాలో తీసుకున్న రుణాన్ని చెల్లించే వెసులుబాటు ఉంటుంది. విద్య రుణంద్వారా ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో స్థిరపడే అవకాశం ఉంటుంది.

SBI ఎడ్యుకేషన్ లోన్: ఈ డాక్యుమెంట్స్ అవసరం, పూర్తి వివరాలు చదవండి!SBI ఎడ్యుకేషన్ లోన్: ఈ డాక్యుమెంట్స్ అవసరం, పూర్తి వివరాలు చదవండి!

విద్యా రుణం

విద్యా రుణం

  • - దేశంలోనే కాకుండా విదేశాల్లో అభ్యసించాలనుకునే విద్యకోసం రుణం పొందవచ్చు.
  • - విద్య రుణంపై ఫ్లోటింగ్ వడ్డీ రేటు 12 శాతం నుంచి 17 శాతం వరకు ఉంటుంది.
  • - తీసుకునే రుణ మొత్తాన్ని బట్టి వడ్డీ రేటు మారుతుంది.
  • - ఈ రుణ కాల పరిమితి 1 సంవత్సరం నుంచి 10 ఏళ్ల వరకు ఉంటుంది.
  • - విద్య వ్యయాల్లో వంద శాతం వరకు రుణం పొంద దానికి అవకాశం ఉంటుంది.
  • - తీసుకున్న విద్య రుణాన్ని అవసరమైతే ముందస్తుగా చెల్లించే సదుపాయం ఉంటుంది.
  • - ఈ రుణానికి హామీ దారు అవసరం
  • ప్రయోజనాలు

    ప్రయోజనాలు

    • - ఉన్నత విద్యకోసం ఎక్కువ మొత్తం అవసరం ఉన్న వారు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
    • - అన్నిరకాల కోర్సులకు విద్యారుణం అందిస్తారు. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, వొకేషన్ కోర్సులు,ఇతర సర్టిఫికెట్ కోర్సుల కోసం విద్య రుణం తీసుకోవచ్చు.
    • - రూ. 10 లక్షల నుంచి గరిష్టంగా రూ. 15 లక్షల వరకు రుణం పొందవచ్చు.
    • - విదేశాల్లో విద్య కోసం రూ.20 లక్షల వరకు బ్యాంకులు రుణాన్ని అందిస్తున్నాయి.
    • - కుటుంబ వార్షిక ఆదాయం తోపాటు చదివే కోర్సును బట్టి విద్య రుణం ఇస్తారు.
    • - మహిళా విద్యార్థినులకు రుణంపై డిస్కౌంట్ లేదా తక్కువ వడ్డీ రేటును బ్యాంకులు ఆఫర్ చేస్తుంటాయి.
    • - విద్య రుణం తీసుకున్న వారు వెంటనే రుణం చెల్లింపు మొత్తాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉండదు. కోర్సు పూర్తయిన తరవాత రుణ చెల్లింపు కాల పరిమితిని 5-7 ఏళ్ల వరకు పొడిగించుకోవచ్చు.
    • - రూ. 4 లక్షలకన్నా తక్కువ తీసుకునే రుణానికి సెక్యూరిటీ లేదా గ్యారంటర్ అవసరం లేదు.
    • అర్హతలు

      అర్హతలు

      • - దరఖాస్తుదారు దేశ నివాసి అయి ఉండాలి
      • - దేశీయంగా లేదా విదేశాల్లో గుర్తింపు పొందిన కోర్సును అభ్యసించాలి.
      • - దరఖాస్తుదారు ప్రవాస భారతీయుడు అయివుంటే చెల్లుబాటులో ఉన్న పాస్ పోర్టును కలిగి ఉండాలి.
      • - దేశీయంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా ప్రోగ్రామ్స్, టెక్నికల్ కోర్సులు, మేనేజ్మెంట్ కోర్సులు, ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు విద్య రుణం పొందవచ్చు.
      • - విదేశాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ ల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సర్టిఫికెట్ డిగ్రీ లకు పొందవచ్చు.
      • - బ్యాంకులు రుణం మంజూరు చేసేముందు విద్యార్హతలు, ధ్రువీకరణ పత్రాలు అడుగుతుంటాయి.
      • ఏ కోర్సులకు రుణం పొందవచ్చు.

        ఏ కోర్సులకు రుణం పొందవచ్చు.

        • - ఇంజినీరింగ్, మెడిసిన్
        • - మేనేజ్ మెంట్ కోర్సులు
        • - ఐ సీ డబ్ల్యూ ఏ, సి ఏ
        • - ఐ ఐ ఎం , ఐ ఐ టీ ల్లో చదివే కోర్సులు
        • - డిగ్రీ కోర్సులు
        • - హోటల్, హాస్పిటాలిటీ
        • - శాప్, ఈ ఆర్ పీ , ఎయిర్ హోస్టెస్ట్రైనింగ్
        • - నర్సింగ్, పారామెడికల్ కోర్సెస్
        • గుర్తింపు పొందిన యూనివర్సిటీలు ఆఫర్ చేసే ఇతర కోర్సులు

English summary

ఉన్నత చదువుల కోసం విద్యారుణం ఉందిగా... | How to applly for education loan, interest rate other details

As a full time student, you will start repaying the loan on completion of your studies. However, during your time of study, you will need to pay the monthly interest.
Story first published: Thursday, June 6, 2019, 12:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X