For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా... అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.

By Jai
|

ఫిక్స్ డ్ డిపాజిట్ (ఎఫ్ డి) అనగానే బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ గుర్తుకు వస్తుంది అందరికి. ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే వారు ముందుగా ఎంచుకునేది ఫిక్స్ డ్ డిపాజిట్లనే. పిల్లల విద్యాభ్యాసం, వివాహం వంటి వాటికీ ఈ సొమ్ము ఎక్కువగా ఉపయోగ పడుతుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు, బ్యాంకింగేతర కంపెనీలు అనేక రకాల ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలను అందిస్తున్నాయి. సాధారణ ఖాతాదారులు ఎవరైనా ఈ ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడి పెట్టి స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు కాస్త ఎక్కువ వడ్డీని పొందడానికి అవకాశం ఉంటుంది.

జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎప్పుడు తీస్తారు: వడ్డీ రేటు వివరాలు.జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎప్పుడు తీస్తారు: వడ్డీ రేటు వివరాలు.

ఎవరెవరు పెట్టుబడి పెట్టవచ్చు

ఎవరెవరు పెట్టుబడి పెట్టవచ్చు

దేశీయంగా నివాసం ఉంటున్నవారెవరైనా ఫిక్స్ డ్ డిపాజిట్ చేయవచ్చు. పెద్దవారి పేరుమీదనే కాకుండా చిన్న పిల్లల పేరు మీద కూడా ఫిక్స్ డ్ డిపాజిట్ చేయవచ్చు. చిన్న పిల్లల పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే తండ్రి లేదా తల్లి గార్డియన్ గా ఉండాలి. 18 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత పిల్లల పేరు మీదకు ఫిక్స్ డ్ డిపాజిట్ ను మార్చుకోవచ్చు.

కాలపరిమితి

కాలపరిమితి

ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాల కాల పరిమితి 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు ఉంటుంది. పన్ను ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీం కాలపరిమితి ఐదేళ్లు అంతకు మించి కూడా ఉంటుంది. మన అవసరాలకు అనుగుణంగా ఫిక్స్ డ్ డిపాజిట్ కాలపరిమితిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాల్లో రెండు రకాలు ఉంటాయి. ఇందులో నెలవారీగా వడ్డీని పొందవచ్చు. పెన్షన్ మాదిరిగా నెలవారీగా డబ్బు కావాలనుకునే వారు ఇలాంటి పథకాన్ని ఎంచుకోవచ్చు. లేదా నిర్దేశిత గడువు తర్వాత ఇక మొత్తం గా అసలు వడ్డీని పొందవచ్చు.

ముందే తీసుకోవచ్చు

ముందే తీసుకోవచ్చు

ఫిక్స్ డ్ డిపాజిట్ మొత్తాన్ని కాలపరిమితి కన్నా ముందుగా కూడా తీసుకోవచ్చు. అయితే బ్యాంకులు ఇందుకు కొంత చార్జీని వసూలు చేస్తాయి. వడ్డీ రేటు తక్కువగా ఉన్న సమయంలో ఫిక్స్ డ్ డిపాజిట్ సొమ్మును తీసుకుంటే తక్కువ వడ్డీ రేటు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్దేశిత కాలం వరకు ఈ డిపాజిట్ల జోలికి పోకపోవడం వెళ్లకపోవడం మంచిది. ఎందుకంటే ఒక్కసారిగా ఎక్కువ మొత్తం చేతికి అందుతుంది. ఏదైనా అవసరానికి వస్తుంది.

ఫిక్స్ డ్ డిపాజిట్లపై రుణం

ఫిక్స్ డ్ డిపాజిట్లపై రుణం

అత్యవసర సమయాల్లో మీ ఫిక్స్డ్ డిపాజిట్లపై రుణాన్ని తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. చాలా బ్యాంకులు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. మీ ఎఫ్ డీ సొమ్ములో గరిష్టంగా 90 శాతం వరకు రుణం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఫిక్స్ డ్ డిపాజిట్ కాలపరిమితి ఉన్నంతవరకు లేదా తక్కువ కాలానికి రుణం పొందవచ్చు. అయితే ఈ రుణం పై వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎంత అంటే మీ ఫిక్స్డ్ డిపాజిట్ పై వచ్చే వడ్డీ రేటుకన్నా 1-2 శాతం ఎక్కువ ఉంటుంది.

వడ్డీ రేటు

వడ్డీ రేటు

బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో కొంత వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఎక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకును ఎంచుకోవాలి. ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటును ఆఫర్ చేస్తుందో ఆయా బ్యాంకుల వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. సాధారణంగా తక్కువ కాలపరిమితికి చేసే డిపాజిట్లపై తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. కాబట్టి ఎక్కువ కాలవ్యవధికి డిపాజిట్ చేయడం వల్ల ఎక్కువ వడ్డీ రేటును పొందడానికి అవకాశం ఉంటుంది.

English summary

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా... అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. | Here is you need to know about FD interest rates

A fixed deposit (FD) is a financial instrument provided by banks or NBFCs which provides investors a higher rate of interest than a irregular savings account, until the given maturity date. It may or may not require the creation of a separate account.
Story first published: Friday, June 14, 2019, 15:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X