For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI బ్యాంక్‌కు వెళ్లకుండా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు: ఇలా... స్టెప్ బై స్టెప్

|

ప్రభుత్వం రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో బ్రాంచ్‌కు వెళ్లకుండా కూడా మీ మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. గతంలో ఎస్బీఐ కస్టమర్లు తమ బ్రాంచ్‌కు వెళ్లి రిజిస్టర్ మొబైల్ నెంబర్‌ను మార్చుకునేవారు. కానీ ఇప్పుడు ఎస్బీఐ ఏటీఎం, ఎస్సెమ్మెస్ తదితర మార్గాల ద్వారా మార్చుకునే వెసులుబాటు ఉంది. ఎస్బీఐ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సేవలు అందిస్తోంది. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సర్వీసులతో సేవలను సులభతరం చేసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కావాలంటే యాక్టివ్ మొబైల్ నెంబర్ కంపల్సరీ. దీనిని బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది.

<strong>మీ పీఎఫ్ అకౌంట్ నుంచి ఇలా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించవచ్చు</strong>మీ పీఎఫ్ అకౌంట్ నుంచి ఇలా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించవచ్చు

ఎస్సెమ్మెస్, ఏటీఎం ద్వారా మార్చుకోవచ్చు

ఎస్సెమ్మెస్, ఏటీఎం ద్వారా మార్చుకోవచ్చు

మీరు మీ హోం బ్రాంచ్‌కు దూరంగా ఉండి ఉంటే లేదా మీ బ్రాంచ్ ఉన్న నగరంలో కాకుండా మరో నగరంలో ఉండి ఉంటే లేదా మీ బ్రాంచ్ కంటే మీ ఎస్బీఐ ఏటీఎం దగ్గరగా ఉంటే... మీరు మీ హోం బ్రాంచ్‌కు వెళ్లకుండానే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను మార్చుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటే మీ మొబైల్ నెంబర్‌ను ఆన్ లైన్ ద్వారా మార్చుకోవచ్చు. ఇప్పుడు అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, బ్రాంచ్‌లో సబ్‌మిట్ చేయడం అవసరం లేదు. ఒకవేళ మీరు మీ హోం బ్రాంచ్‌కు దూరంగా ఉండి ఉంటే మీ సమీపంలోని ఏటీఎం ద్వారా మార్చుకోవచ్చు. ఎస్సెమ్మెస్, ఏటీఎం ద్వారా మీ మొబైల్ నెంబర్ ఇలా మార్చుకోవచ్చు....

 మూడ్ స్టెప్స్‌లలో మార్చుకోవచ్చు

మూడ్ స్టెప్స్‌లలో మార్చుకోవచ్చు

ఆన్‌లైన్ ద్వారా మొబైల్ నెంబర్ 3 స్టెప్స్‌లలో మార్చుకోవచ్చు. 1. పాత, కొత్త మొబైల్ నెంబర్స్ యొక్క ఓటీపీని ఉపయోగించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా 2. ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు ఏటీఎం 3. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ కాంటాక్ట్ సెంటర్ నుంచి కాల్ రిసీవ్ చేసుకోవడం ద్వారా.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి మీ యూజర్ నేమ్, లాగిన్ అండ్ ప్రొఫైల్ పాస్‌వర్డ్స్ ద్వారా యాక్సెస్ కావాలి. ఏటీఎం కార్డ్ దగ్గర ఉండాలి. అంతేకాదు, పాత, కొత్త మొబైల్ నెంబర్స్ యాక్టివ్‌గా ఉండాలి. రెండు మొబైల్స్‌కు కూడా ఎస్సెమ్మెస్‌లు వస్తాయి. అప్పుడు ఏటీఎంకు వెళ్లాల్సిన అవసరం లేదు.

 స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

- ఎస్బీఐ ఆన్‌లైన్ పోర్టల్‌కు వెళ్లండి. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అకౌంట్‌తో లాగిన్ కావాలి. (https://retail.onlinesbi.com/retail/login.htm)

- టాప్ ప్యానెల్‌లో ని ఫస్ట్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. ‘My Accounts & Profile'

- నెక్స్ట్ పేజీలోని 'Profile' లోకి వెళ్లండి.

- 'Personal Details' లింక్ పైన క్లిక్ చేయండి.

- ప్రొఫైల్ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి, సబ్‌మిట్ క్లిక్ చేయండి. పేరు, ఈ-మెయిల్ ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ డిస్‌ప్లే అవుతాయి.

- అక్కడ చేంజ్ మొబైల్ నెంబర్ ఆప్షన్ ఎంచుకోండి. బ్రాంచ్ ద్వారా లేదా ఓటీపీ/ఏటీఎం/కాంటాక్ట్ సెంటర్ ద్వారా ఎలాగైనా మార్చుకోవచ్చు. ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి.

- 'Change Mobile Number-Domestic only (Through OTP/ATM/Contact Centre)' ఆప్షన్‌ను ఎంచుకోండి. ఈ హైపర్ లింక్ పైన క్లిక్ చేయండి.

- 'Personal Details-Mobile Number Update' పేజీ కనిపిస్తుంది. అక్కడ 'Create Request', 'Cancel Request' మరియు 'Status' అనే మూడు ట్యాబ్స్ కనిపిస్తాయి.

- ఇందులో కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మళ్లీ రీటైప్ చేయండి. తర్వాత సబ్‌మిట్ కొట్టండి.

- వెరిఫై అండ్ కన్ఫర్మ్ యువర్ మొబైల్ నెంబర్ అనే పాపప్ సందేశం వస్తుంది. 'Ok'పై క్లిక్ చేయండి.

- కొత్త స్క్రీన్ పైన మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.

OTP on both the Mobile Numbers

IRATA : Internet Banking Request Approval through ATM

Approval through Contact Centre

పై మూడు ఆప్షన్‌లలో మీరు దేనినైనా ఎంచుకోవచ్చు.

ఓటీపీ ఆప్షన్ ఎంచుకుంటే

ఓటీపీ ఆప్షన్ ఎంచుకుంటే

- మీరు OTP మొబైల్ నెంబర్ ఆప్షన్ ఎంచుకుంటే పాత నెంబర్, కొత్త నెంబర్ రెండు మీ వద్ద ఉండేలా చూసుకోవాలి. అప్పుడు 'Proceed' క్లిక్ చేయాలి.

- అనంతరం డెబిట్ కార్డు ఆప్షన్ కనిపించే అకౌంట్ ఎంచుకోండి.

- మళ్లీ 'Proceed'పై క్లిక్ చేయండి.

- మరో స్క్రీన్‌లో అకౌంట్‌తో అనుసంధానమైన ఏటీఎం కార్డుల వివరాలు కనిపిస్తాయి. యాక్టివేటెడ్ ఏటీఎం కార్డు ఎంపిక చేసుకొని 'Proceed' పైన క్లిక్ చేయాలి.

- ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ గేట్‌వే ఓపెన్ అవుతుంది.

- అక్కడ కార్డు వివరాలు ఇవ్వాలి. కార్డు నెంబర్, వాలిడ్ త్రూ, ఎక్స్‌పైరీ డేట్, కార్డ్ హోల్డర్ పేరు, పిన్ మరియు బాక్స్‌లో కనిపించే కారెక్టర్స్ టైప్ చేయాలి.

- ఆ తర్వాత 'Submit' బటన్ పైన క్లిక్ చేయాలి.

- ఓసారి ఇన్‌ఫర్మేషన్ వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత 'Pay' బటన్ పైన క్లిక్ చేయాలి.

- ఆ తర్వాత మీ పాత, కొత్త నెంబర్లకు ఓటీపీ వస్తుంది.

- ఒక రెఫరెన్స్ నెంబర్‌తోపాటు ఓటీపీ మీ పాత, కొత్త మొబైల్ నెంబర్లకు మెసేజ్ వస్తుంది. తర్వాత మీ కొత్త నెంబర్ యాక్టివేషన్ కోరుతూ 567676 నెంబర్‌కు నాలుగు గంటల్లో ఎస్సెమ్మెస్ చేయాలి. ఈ ఫార్మాట్లో మెసేజ్ చేయాలి.

ACTIVATE <8 digit OTP value> <13 digit reference number>

- ఇది సక్సెస్ అయ్యాక మీ కొత్త ఫోన్ నెంబర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్, ఏటీఎంకు లింక్ అవుతుంది. మీకు మెసేజ్ కూడా వస్తుంది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఎంచుకుంటే

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఎంచుకుంటే

- 'IRATA : Internet Banking Request Approval through ATM' పైన క్లిక్ చేయాలి.

- Proceed పైన క్లిక్ చేయాలి.

- డెబిట్ కార్డు ఆప్షన్ కనిపించే అకౌంట్ ఎంచుకోవాలి.

- Proceed పైన క్లిక్ చేయాలి.

- అకౌంట్‌తో అనుసంధానమైన ఏటీఎం కార్డుల వివరాలు మీకు నెక్స్ట్ స్క్రీన్‌లో కనిపిస్తాయి.

- యాక్టివేట్‌గా ఉన్న ఏటీఎం కార్డు ఎంపిక చేసుకోవాలి.

- Proceed పైన క్లిక్ చేయాలి.

- ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ గేట్‌వే ఓపెన్ అవుతుంది.

- కార్డు వివరాలు ఇవ్వాలి. కార్డు నెంబర్, వాలిడ్ త్రూ, ఎక్స్‌పైరీ డేట్, కార్డ్ హోల్డర్ పేరు, పిన్ మరియు బాక్స్‌లో కనిపించే కారెక్టర్స్ టైప్ చేయాలి.

- Submit బటన్ పైన క్లిక్ చేయండి.

- వెరిఫై చేసుకున్నాకా.. Pay బటన్ పైన క్లిక్ చేయాలి.

- ఆ తర్వాత మీకు ఓ సందేశం వస్తుంది. Thanks for registering mobile number with us. The status of your request is pending. Kindly complete the registration process according to the option selected by you. అని వస్తుంది.

- ఒక రెఫరెన్స్ నెంబర్‌తోపాటు మీ పాత, కొత్త మొబైల్ నెంబర్లకు ఓటీపీ మెసేజ్ వస్తుంది.

- ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ గ్రూప్ ఓటీఎం సెంటర్‌కు వెళ్లి, మీ కార్డును స్వైప్ చేయండి. Services ట్యాబ్‌ను సెలక్ట్ చేసుకొని, పిన్ ఇవ్వాలి.

- ఏటీఎం స్క్రీన్‌లోని Others ట్యాబ్ ఎంచుకోండి. Internet Banking Request Approval పైన క్లిక్ చేయండి.

- అప్రూవల్, రిక్వెస్ట్ కోసం మీ 10 డిజిట్ గల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయండి.

- ఇది సక్సెస్ అయ్యాక మీ రిక్వెస్ట్ (మొబైల్ నెంబర్ చేంజ్) పూర్తవుతుంది.

 కాంటాక్ట్ సెంటర్ ద్వారా అప్రూవల్

కాంటాక్ట్ సెంటర్ ద్వారా అప్రూవల్

- Approval through Contact Centre బటన్ పైన క్లిక్ చేయండి.

- Proceed పైన క్లిక్ చేయండి.

- డెబిట్ కార్డు కలిగిన అకౌంట్‌ను ఎంచుకోవాలి.

- Proceed పైన క్లిక్ చేయండి.

- ఏటీఎం కార్డును సెలక్ట్ చేసుకొని, Proceed పైన క్లిక్ చేయండి.

- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది.

- మీ కార్డ్ వివరాలు ఇవ్వండి.

- Submit పైన క్లిక్ చేయాలి.

- ఇన్‌ఫర్మేషన్ వెరిఫై చేసుకొని, Pay బటన్ పైన క్లిక్ చేయాలి.

- తర్వాత మీకు మెసేజ్ కనిపిస్తుంది. Thanks for registering mobile number with us. The status of your request is pending. Kindly complete the registration process according to the option selected by you అని వస్తుంది.

- మీకు రెఫరెన్స్ నెంబర్ మెసేజ్ వస్తుంది.

- మూడు వర్కింగ్ డేస్‌లలో బ్యాంక్ కాంటాక్ట్ పర్సన్ మీ కొత్త నెంబర్‌కు కాల్ చేస్తారు.

- వారు రిఫరెన్స్ నెంబర్ అడుగుతారు. ఆ తర్వాత పర్సనల్ డిటెయిల్స్ అడుగుతారు.

- కాంటాక్ట్ సెంటర్ వెరిఫై చేసుకొని, కావాల్సిన సమాచారం తీసకుంటారు.

English summary

SBI బ్యాంక్‌కు వెళ్లకుండా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు: ఇలా... స్టెప్ బై స్టెప్ | SBI Mobile Number Change: Here's how to do it without visiting bank branch

If you are away from your home branch or living in a different city or if an SBI ATM is closer than the bank branch, here are the ways for SBI mobile number change online.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X