For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త ఐటీ రిటర్న్స్ ఫారమ్స్ ఇవే: ఈ వివరాలు తెలుసుకోండి

|

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫాంను నోటిఫై చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంతో పాటు 2019-20 అసెస్‌మెంట్ ఏడాదికి కూడా వీటినే ఉపయోగించాలి. నోటిఫై చేసిన కొత్త ఐటీ రిటర్న్స్ ఫాంలో ఐటీఆర్1 Sahaj, 2, 3, 4 Sugam, 5, 6, 7లు ఉంటాయి. కొత్త రిటర్న్స్ ఫాం ద్వారా మరింత సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మీరు భారత్‌లో ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు, అన్‌లిస్టెడ్ షేర్లు ఎన్ని కలిగి ఉన్నారు పేర్కొనాల్సి ఉంటుంది. అలాగే టీడీఎస్‌కు సంబంధించిన పాన్ కార్డు నెంబర్ తప్పనిసరి. కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నా, పేరు మీద అన్‌లిస్టెడ్ షేర్లు కలిగి ఉన్నా ఐటీఆర్ ఫాం 1 లేదా 4లను దాఖలు చేయలేరు.

ఐటీఆర్ 1

ఐటీఆర్ 1

శాలరీ, వన్ హౌస్ ప్రాపర్టీ, ఇతర మార్గాల్లో రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తి ఐటీఆర్ 1 ఫాం దాఖలు చేయాల్సి ఉంది. ఇది ఒక పేజీ కలిగిన ఫారం. వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయం రూ.50 లక్షల లోపు ఉండాలి.

ఆదాయ మార్గాలు....

1. వేతనం లేదా పెన్షన్ ద్వారా ఆదాయం

2. వన్ హౌస్ ప్రాపర్టీ ద్వారా ఆదాయం

3. ఇతర ఆదాయ మార్గాలు.

- కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నా, పేరు మీద అన్‌లిస్టెడ్ షేర్లు కలిగి ఉన్నా ఈ ఫాం దాఖలు చేయలేరు.

- ఐటీఆర్ 1లో స్టాండర్డ్ డిడక్షన ఆప్షన్ అందుబాటులో ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్ దాఖలు చేసేసమయంలో గరిష్టంగా రూ.40,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.

- మీకు ఇళ్లు ఉంటే అది ఎక్కడ ఉందో స్పష్టంగా తెలియచేయాలి. ఆ ఇంట్లో ఎవరున్నారనే విషయాలు కూడా అందించాలి. మీరే ఉన్నారా ఇతరులు ఉన్నారా తెలియజేయాల్సి ఉంటుంది.

- ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయం వివరాలు ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటి వాటి ద్వారా వచ్చే ఆదాయ వివరాలు ఇవ్వాలి. ఇక గతంలో మాదిరిగానే శాలరీ బ్రేకప్ వివరాలు అందించాలి.

ఐటీఆర్ 2

ఐటీఆర్ 2

- తమ ప్రొఫెషన్, వ్యాపారాల ద్వారా ఆదాయం లేని ఇండివిడ్యుయల్స్, హిందూ అన్‌డివైడెట్ ఫ్యామిలీ (ఉమ్మడి కుటుంబాలు-హెచ్‌యూఎఫ్)లు ఐటీఆర్ 2 దాఖలు చేయవచ్చు.

- ఇందులో మీరు మీ రెసిడెన్సీ స్టేటస్ తెలియజేయాల్సి ఉంటుంది.

- 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను మీరు ఎన్నిరోజులు ఇండియాలో ఉన్నారో చెప్పాలి.

- మీరు అన్‌లిస్టెడ్ కంపెనీలో షేర్లు కలిగి ఉంటే ఆ వివరాలు ఇవ్వాలి. కంపెనీ పేరు, షేర్ల కొనుగోలు వివరాలు పొందుపర్చాలి.

ఐటీఆర్

ఐటీఆర్

కంపెనీలు, తమ ప్రొఫెషన్ ద్వారా ఆదాయం పొందుతున్న ఇండివిడ్యుయల్స్, ఉమ్మడి కుటుంబాలు ఐటీఆర్ 3ని దాఖలు చేయాల్సి ఉంటుంది. మొత్తం ఆదాయం రూ.50 లక్షల లోపు ఉండి, బిజినెస్ ద్వారా ఆదాయం గడించే వారు ఐటీఆర్ 4 ఫారాలను వేయాలి. ఐటీఆర్ 1, 2, 3, ఫాం 7 ఐటీఆర్ దాఖలు చేయని వారు ఐటీఆర్ 5 దాఖలు చేస్తారు.

English summary

కొత్త ఐటీ రిటర్న్స్ ఫారమ్స్ ఇవే: ఈ వివరాలు తెలుసుకోండి | ITR forms for FY18-19 notified: Here is all you need to know

New Income Tax Return (ITR) forms for the financial year 2018-19 have been notified. These forms require new details to be filled in by taxpayers. New information required includes the number of days of residency in India, holding of unlisted shares and mandatory quoting of PAN of tenant in case of TDS.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X