For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఇబ్బందా?: ఈ యాప్స్ మీకు సహకరిస్తాయి!

|

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. దీంతో ట్యాక్స్ పేయర్స్ తమ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఐటీఆర్ ఫారంలను నోటిఫై చేసింది. ఐటీని ఫైల్ చేయడం చాలామందికి తెలియదు. దీంతో అందరు కూడా చార్టర్డ్ అకౌంటెంట్ సహకారం తీసుకుంటారు. ఐటీఆర్ ఫైల్స్ చేసేందుకు మీకు పలు వెబ్‌సైట్లు, మొబైల్ అప్లికేషన్లు కూడా అందుబాటులో ఉంటాయి. వీటి సహాయంతో ఫైల్ చేయవచ్చు. ఇలాంటి యాప్స్ మీ సమయాన్ని ఆదా చేయడంతో పాటు ఇబ్బందులు కూడా లేకుండా ఉంటాయి. ఐటీఆర్ ఫైల్ చేసేందుకు సహకరించే ఐదు మొబైల్ యాప్స్ ఇక్కడ చూడండి.

ATM కార్డు రూల్స్: ఈ బ్యాంకుల్లో ఛార్జీలు ఎలా ఉన్నాయంటేATM కార్డు రూల్స్: ఈ బ్యాంకుల్లో ఛార్జీలు ఎలా ఉన్నాయంటే

ఆల్ ఇండియా ఐటీఆర్

ఆల్ ఇండియా ఐటీఆర్

ఆల్ ఇండియా ఐటీఆర్ యాప్ ద్వారా పేపర్‌లెస్‌గానే ఐటీఆర్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫాం ప్లాట్ ఫాంలలో ఈ యాప్స్ ఉపయోగించవచ్చు. ఫారం 16తో పాటు ఇతర అవసరమైన డాక్యుమెంట్లను PDF లేదా ఇమేజ్‌ను అప్‌లోడ్ చేయాలి. ఇది ఆటోమేటిక్‌గా ఇన్‌పుట్స్‌ను స్టడీ చేసి, ఆటోమేటిక్‌గా ఫాంను ఫిల్ చేస్తుంది. దీంతో ఐటీఆర్ ఫైల్ చేయడం చాలా సులభం. ఒకవేళ ఈ యాప్ పని చేయకుంటే ట్యాక్స్ నిపుణులు మీ ఐటీఆర్ ప్రక్రియను పూర్తి చేస్తారు.

క్లియర్ ట్యాక్స్

క్లియర్ ట్యాక్స్

క్లియర్ ట్యాక్స్ ద్వారా పారం 26ఏఎస్, ఫారం 16లను అప్ లోడ్ చేసే వెసులుబాటు ఉంది. ఈ యాప్‌లో ఓ ఆసక్తికర ఫీచర్ ఉంది. ట్యాక్స్ పేయర్ ఆఫ్‌లైన్‌లో కూడా పన్ను వివరాలు ఎంటర్ చేయవచ్చు. ఆ తర్వాత యూజర్ ఆన్‌లైన్‌లోకి రాగానే క్లియర్ ట్యాక్స్ సర్వర్‌తో సింక్ అవుతాయి. ఈ యాప్ ద్వారా ఐటీఆర్ దాఖలు చేయవచ్చు, ఆదాయపన్ను రీఫండ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. దీనికి పాన్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ అవసరం. ఇన్‌కం ట్యాక్స్ ఎంత చెల్లించారు, హెచ్ఆర్ఏ బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకోవడానికి రెంట్ రశీదు జనరేట్ చేసుకోవచ్చు.

H&R Block

H&R Block

హెచ్ అండ్ ఆర్ బ్లాక్ యాప్ ద్వారా కూడా ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. కేవలం ఫైలింగ్ మాత్రమే కాదు, రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఇబ్బందులు ఎదురైతే నిపుణుల సాయం అందుతుంది. ఈ యాప్ ద్వారా ట్యాక్స్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసుకోవచ్చు. రిటర్నులను చూసుకోవచ్చు. ఈ-ఫైల్ స్టేటస్ చూడొచ్చు.

ట్యాక్స్ స్మైల్ మరియు ట్యాక్స్ స్పానర్

ట్యాక్స్ స్మైల్ మరియు ట్యాక్స్ స్పానర్

ట్యాక్స్ స్మైల్ యాప్ పన్ను సంబంధ వివరాలను తెలియపరుస్తుంది. స్పీడీ ఫైలింగ్, అక్యూరసీ, పోస్ట్ పైలింగ్ సపోర్ట్‌ను ప్రొవైడ్ చేస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్ పూర్తయ్యాక మాత్రమే చార్జ్ వసూలు చేస్తారు. ఐటీఆర్ ఫైల్ చేశాక కూడా అవసరమైన సహకారం అందిస్తుంది.

ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ట్యాక్స్ స్పానర్ అనే మరో యాప్ కూడా ఉంది. ఈ యాప్ ద్వారా ఐటీఆర్ ఫైల్ చేయాలంటే ఈ-మెయిల్, ఫారం 16 అందించాలి. ఫారం 16 లేనివారు తమ పాన్ కార్డు ద్వారా కూడా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు.

English summary

ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఇబ్బందా?: ఈ యాప్స్ మీకు సహకరిస్తాయి! | Facing difficulty in Income Tax Return filing? These apps can help you out

The new financial year (FY20) has started and taxpayers will be required to file their income tax return (ITR). Recently, the government has notified new ITR forms. People usually seek help from Chartered Accountants (CA) as they are not well-versed with the process of filing.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X