గతంలో ఎక్కువమంది తమ పిల్లల భవిష్యత్తు కోసం చదువు ప్రారంభించే సమయంలోనో, గ్రాడ్యుయేషన్ సమయంలోనో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సమయంలోనో ఆలోచన చేసేవారు. ఇప్పుడు చాలామంది పుట్టినప్పటి నుంచే పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తున్నారు. ఎవరికైనా పెళ్లి కాగానే ఖర్చులు పెరుగుతాయి. పిల్లలు పుట్టాక మరింత పెరుగుతాయి. అదే సమయంలో తమ సంపాదనలో పిల్లల భవిష్యత్తు కోసం కూడా ప్లాన్ చేస్తున్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం ముందుగా ప్లాన్ చేయడమే కాదు, సరైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం కూడా ఎంతో ముఖ్యం.
- ప్రస్తుతం తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం చాలా ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు చదువులు చాలా ఖరీదుగా మారాయి. వారి చదువుల ఖర్చును కాలిక్యులేట్ చేసుకోవాలి. పిల్లల చదువు కోసం అయ్యే ఖర్చు.. పుస్తకాలు, కోచింగ్, ట్రాన్స్‌పోర్టేషన్‌తో పాటు ప్రత్యేక కోర్స్ ఫీజులు వంటి వాటిని పరిగణలోకి తీసుకోవాలి. వీటన్నింటితో తుది నిర్ణయానికి (ఖర్చు) రావాలి. ప్రత్యేక కోర్సుల, వాటి కోచింగ్ కోసం కూడా అదనపు ఖర్చులు ఉంటాయి.

మీరు మీ పిల్లలను విదేశాలకు పంపించాలనుకుంటే.. ఆయా కోర్సు, దేశాన్ని బట్టి ఖర్చులు మారుతుంటాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది. ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకొని కచ్చితమైన లక్ష్యాలతో సేవింగ్స్ ఉండాలి. వాటి ఆధారంగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎంచుకోండి.
షేర్లు వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం పెద్ద రిస్క్. అదే సమయంలో లాంగ్ టర్మ్‌లో అవి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటాయి. కాబట్టి మీ టార్గెట్ ఆధారంగా.. షేర్లు, ప్రాపర్టీ లేదా ప్రత్యామ్నాయాల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది.
పిల్లల వయస్సు ఆధారంగా పెట్టుబడులు పెట్టడం మంచిది. 10 ఏళ్లుకు పైగా అంటే లాంగ్ టర్మ్ పెట్టుబడులు కావాలనుకుంటే మార్కెట్, ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడులు పెట్టవచ్చు. హైబ్రిడ్ ఫండ్స్ లేదా లార్జ్ క్యాప్ ఫండ్స్‌లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ పొందవచ్చు.
మీ గోల్ కాల పరిమితి మూడేళ్లు అయితే షార్ట్ టర్మ్ పెట్టుబడులు మంచివి. బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్స్, షార్ట్ టర్మ్ డెబిట్ ఫండ్స్ వంటివి తీసుకోవాలి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications