For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయుష్మాన్ భారత్: మీరు అర్హులా కాదా ఇలా తెలుసుకోండి

|

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ఆయుష్మాన్ భారత్ యోజన. ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. దేశంలో 10 కోట్లకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతాయని అంచనా. అంటే దాదాపు 50 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది.

ఈ బ్యాంకులో 1998లో రూ.100 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అది 34 రెట్లు పెరుగుతుందిఈ బ్యాంకులో 1998లో రూ.100 ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అది 34 రెట్లు పెరుగుతుంది

లబ్ధిదారుల ఎంపిక

లబ్ధిదారుల ఎంపిక

సామాజిక, ఆర్థిక, కుల జనగణన (ఎస్ఈసీసీ) లెక్కల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారి వివరాలు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డీ1, డీ2, డీ3, డీ4, డీ5, డీ7 కేటగిరీలను ఎంపిక చేశారు. పట్టణాల్లో 11 వృత్తుల ఆధారంగా లబ్ధిదారులను నిర్ణయించారు. పలు రాష్ట్రాల్లోని రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన లబ్ధిదారులను ఇందులో విలీనం చేస్తారు. కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సు విషయంలో నిబంధనలు ఏమీ లేవు.

అర్హులో కాదో ఎలా తెలుసుకోవాలి?

అర్హులో కాదో ఎలా తెలుసుకోవాలి?

ఈ పథకం కోసం మీ వ్యక్తిగత వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, ఎన్నికల ఐడీ కార్డు, రేషన్ కార్డుల్లో ఏదో ఒక ప్రూఫ్ చాలు. ఈ పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్ రూపొందించింది. అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. mera.pmjay.gov.in లో లబ్ధిదారుల జాబితా ఉంటుంది. వెబ్ సైట్‌లో Am I Eligible అని కనిపిస్తుంది. ఇందులో మొబైల్ నెంబర్, కాప్చా ఎంటర్ చేశాక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేశాక.. రాష్ట్రం, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, పేరుతో సెర్చ్ చేయవచ్చు. మీరు లబ్ధిదారులైతే అక్కడ తెలుస్తుంది. మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ లేదా ఎస్ఈసీసీ పేరు ద్వారా సెర్చ్ చేయవచ్చు. మీ పేరు లేకుంటే ఆయుష్మాన్ మిత్రను కలిసి తెలుసుకోవాలి. 14555 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.

ఏయే సేవలు లభిస్తాయి?

ఏయే సేవలు లభిస్తాయి?

ఆయుష్మాన్ భారత్ స్కీంలో.. ప్రభుత్వ ఆసుపత్రి లేదా అగ్రిమెంట్ కుదుర్చుకున్న ప్రయివేటు ఆసుపత్రుల్లో సేవలు పొందవచ్చు. బైపాస్ సర్జరీ, స్టెంట్ వంటి 1354 వైద్య సేవలు అందుతాయి. ప్రతి ఆసుపత్రిలో ఆయుష్మాన్ మిత్ర ఉంటారు. ఆయుష్మాన్ మిత్ర ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. కాగా, నరేంద్ర మోడీ తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్, పీఎం-కిసాన్ యోజన, వంట గ్యాస్, రూరల్ రోడ్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్‌లు మంచి విజయాలు అని నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియా చెబుతున్నారు.

English summary

ఆయుష్మాన్ భారత్: మీరు అర్హులా కాదా ఇలా తెలుసుకోండి | All You Need to Know about Ayushman Bharat

Ayushman Bharat-National Health Protection Scheme, which will cover over 10 crore (one hundred million) poor and vulnerable families (approximately 50 crore (five hundred million) beneficiaries) providing coverage up to 5 lakh rupees ($7,100) per family per year for secondary and tertiary care hospitalization.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X