For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌ధాన మంత్రి బీమా యోజ‌న ద్వారా మీ జీవితానికి సుర‌క్ష‌

క‌నీస ప్రీమియం రేటు ఏడాదికి 12 రూపాయలుగా ఉండే ఈ పాలసీ పేదవాళ్ళకి, తక్కువ ఆదాయం వచ్చే వర్గాలకి ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అకాల మరణానికి, శాశ్వత అవిటితనానికి 2లక్షల రూపాయ

|

భారత ప్రభుత్వం ప్రకటించిన మూడు సామాజిక సురక్ష పథకాలలో ఒకటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. పిఎంఎస్ బివై అనేది ఒక ప్రమాదబీమా స్కీం. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన మరణాలకి, అవిటితనానికి ఒక ఏడాది సమయానికి బీమా కల్పిస్తుంది. ప్రతి ఏడాది దీన్ని మరలా పొడిగించుకోవచ్చు.
క‌నీస ప్రీమియం రేటు ఏడాదికి 12 రూపాయలుగా ఉండే ఈ పాలసీ పేదవాళ్ళకి, తక్కువ ఆదాయం వచ్చే వర్గాలకి ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అకాల మరణానికి, శాశ్వత అవిటితనానికి 2లక్షల రూపాయల జీవితబీమాను, శాశ్వత పాక్షిక్ష అవిటితనానికి 1 లక్ష రూపాయల బీమాను అందిస్తుంది. ఏదైనా బ్యాంకు కాతా నుంచి ఈ బీమా సౌక‌ర్యం పొంద‌వ‌చ్చు.

18-70ఏళ్ళ వయస్సు మధ్యవారు , బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. మీకు ఒకవేళ ఒక సేవింగ్స్ ఖాతా కన్నా ఎక్కువ ఉంటే, మీరు ఒక ఖాతాతోనే ఈ స్కీంలో సభ్యులవ్వాలి. మీకు ప్రధానమంత్రి సురక్ష బీమా గురించి మరింత అర్థమవ్వటానికి ఈ వ్యాసంలో దాని గురించి చర్చించాం, చదివి తెలుసుకోండి.

1. పిఎంఎస్ బివై పాలసీ కింద ఏవి కవర్ అవుతాయి మరియు ఎంతవరకు?

1. పిఎంఎస్ బివై పాలసీ కింద ఏవి కవర్ అవుతాయి మరియు ఎంతవరకు?

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద సభ్యుడికి 2 లక్షల రూపాయలు బీమాదారుడికి అకాల మరణం సంభవిస్తే వస్తాయి. ఇంకా, ఈ 2 లక్షల రూపాయలను పూర్తి అంగవైకల్యం అనగా శాశ్వతంగా కళ్ళు కోల్పోవటం, లేదా రెండు చేతులు, కాళ్ళు పనిచేయకపోవటం, పక్షవాతం మొదలైన స్థితుల్లో అందిస్తారు. పాక్షిక్ష అంగవైకల్యం వచ్చినట్లయితే బీమాదారుడికి 1 లక్ష రూపాయల జీవితబీమాను అందిస్తారు.

బీమాదారుడికి ఇతర బీమాపాలసీలు ఉన్నా కూడా పిఎంఎస్ బివై ఈ బీమా కవరేజ్ ను వాటికి అదనంగా ఇస్తుంది. ఇది కేవలం జీవితబీమా పథకం కాబట్టి ఇది మరే ఇతర మెడిక్లెయిం అనగా ప్రమాదం వల్ల కలిగే ఏ ఇతర వైద్యఖర్చులకి ఇది తిరిగి చెల్లించదు.

 2. పరిధిలోకి వచ్చేవి రానివి

2. పరిధిలోకి వచ్చేవి రానివి

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం నిర్వచించినట్లుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా మరణం, ప్రమాదాలు లేదా అవిటితనం సంభవిస్తే ఈ పాలసీ కింద బీమా చేయబడుతుంది. కానీ ఆత్మహత్యలకి ఇది వర్తించదు. హత్యలకి వర్తిస్తుంది. ఈ పథకం శాశ్వత అంధత్వం మరియు ఒక చేయి లేదా ఒక కాలు పోయి వచ్చే అవిటితనానికి కవరేజ్ ఇవ్వదు.

 3. ఎస్సెమ్మెస్ ద్వారా ప్రధానమంత్రి సురక్షా బీమా యోజనకి దరఖాస్తు చేసుకునే విధానం

3. ఎస్సెమ్మెస్ ద్వారా ప్రధానమంత్రి సురక్షా బీమా యోజనకి దరఖాస్తు చేసుకునే విధానం

అర్హులైన ఖాతాదారులకి ‘పిఎంఎస్బివైవై' అని రిప్లై ఇవ్వమని ఒక ఎస్సెమ్మెస్ పంపబడుతుంది. ఈ పథకంకి దరఖాస్తు చేసుకోడానికి, ఖాతాదారులు ‘పిఎంఎస్బివైవై' అని ఎస్సెమ్మెస్ చేయాలి. వినియోదారుడికి వారి ఎస్సెమ్మెస్ అందిందని మరో మెసేజ్ ఇవ్వబడుతుంది.

తర్వాత ప్రాసెస్ లో దరఖాస్తుదారుని వద్ద బీమాదారుడి పేరు, వైవాహిక స్థితి, పుట్టినతేదీ వంటి వివరాలు ఉండాలి. ఈ వివరాలను వినియోగదారుడి బ్యాంకు అకౌంట్ నుంచి నేరుగా తీసుకుంటారు. కానీ ఒకవేళ ఆ వివరాలు బ్యాంకు రికార్డులలో దొరకకపోతే కన్ఫర్మేషన్ ప్రాసెస్ ముందుకి వెళ్ళలేదు. అప్పుడు దరఖాస్తుదారుడు నేరుగా ఆ వివరాలతో దగ్గరిలోని శాఖలో దరఖాస్తు చేసుకోవాలి. కావాల్సినంత మినిమం బ్యాలెన్స్ అకౌంట్లో లేక ఆటోమేటిక్ ప్రీమియం చెల్లింపు కుదరకపోతే పాలసీ కవరేజ్ ఆగిపోతుంది కానీ పాలసి ఇంకా నడుస్తూనే ఉంటుంది.

 4. నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి దరఖాస్తు చేసుకునే విధానం

4. నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి దరఖాస్తు చేసుకునే విధానం

పాలసీ యొక్క అధికారక వెబ్ సైట్ కి లాగిన్ అవ్వండి మరియు ఇన్స్యూరెన్స్ అనే చోట క్లిక్ చేయండి. ఆ పేజీలో కన్పించే రెండు పథకాలలో ఒకటి ఎంచుకోండి. మీరు ప్రీమియం ఏ అకౌంట్ ద్వారా చెల్లించాలనుకుంటున్నారో అది ఎంచుకోండి. మీరు ఎంచుకున్న ఖాతా ఆధారంగా పాలసీ కవర్ ఎంత మొత్తం వస్తుందో, నామినీ వివరాలు మరియు ప్రీమియం వివరాలు స్క్రీన్ పై వస్తాయి. మీరు మీ సేవింగ్స్ ఖాతాలో ఎంచుకున్న నామినీ లేదా కొత్త నామినీని జతచేయవచ్చు.

 5. మీ పాలసీ నామినీ పేరును అక్కడ పొందుపర్చాక, ఈ కింది వివరాలపై క్లిక్ చేయండి.

5. మీ పాలసీ నామినీ పేరును అక్కడ పొందుపర్చాక, ఈ కింది వివరాలపై క్లిక్ చేయండి.

గుడ్ హెల్త్ డిక్లరేషన్ స్కీం వివరాలు, నియమాలు మరియు నిబంధనలు " నేను ఈ సేమ్ దానిపై మరే ఇతర పాలసీలను కలిగిలేను" మీరు కొనసాగించండి అనే బటన్ పై క్లిక్ చేసాక పాలసీ వివరాలన్నీ మొత్తం స్క్రీన్ పై కన్పిస్తాయి. అప్లికేషన్ ఫారంలో నింపిన వివరాలను ఒకసారి సరి చూసుకుని కన్ఫర్మ్ అనే దానిపై క్లిక్ చేయండి. మీకొక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఇవ్వబడుతుంది. అందులో ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. మీకు భవిష్యత్తులో ఏదైనా సందేహానికై ఈ ఎక్నాలెడ్జ్ మెంట్ నెంబరును జాగ్రత్తగా దాచుకోవటం మరిచిపోవద్దు.

6. సుర‌క్ష బీమా యోజ‌న‌ అర్హత వివరాలు

6. సుర‌క్ష బీమా యోజ‌న‌ అర్హత వివరాలు

18-70ఏళ్ల మధ్య వయస్సు వారు ఈ జీవితబీమా పథకానికి అర్హులు. ఇంకా ఎన్నారైలు కూడా ఈ పాలసీలో చేరవచ్చు . కాకపోతే వారికి పాలసీ డబ్బులు భారత రూపాయలలో చెల్లించబడతాయి.

7.క్లెయిం చేసుకోడానికి ఏం చేయాలి

7.క్లెయిం చేసుకోడానికి ఏం చేయాలి

అకాల మరణం లేదా అవిటితనం బీమా పొందటానికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో మీరు సాక్ష్యంగా పత్రాలు చూపాల్సి వుంటుంది. బీమాదారుడు అకాలంగా మరణిస్తే, పోలీస్ స్టేషన్లో వెంటనే ప్రమాదం గురించి రిపోర్టు ఇవ్వాలి మరియు ఆస్పత్రి రికార్డుల ద్వారా వెంటనే ధృవీకరించాల్సి ఉంటుంది. పాలసీ దరఖాస్తు ఫారంలో పేర్కొన్న బెనిఫిషియరీ వ్యక్తి క్లెయిం చేసుకోవచ్చు. అదే అవిటితనం గూర్చి క్లెయిం చేయాలంటే, సూచించబడ్డ మొత్తాన్ని పాలసీదారుడి బ్యాంకు ఖాతాలోకే జమచేస్తారు. అదే మరణం విషయంలో ఆ మరణం ద్వారా వచ్చే బీమా మొత్తాన్ని పాలసీలో సూచించిన బెనిఫిషయరీకి అందిస్తారు.

8. ఆఖరి సూచనలు

8. ఆఖరి సూచనలు

ఈ పాలసీ అందించే అన్ని లాభాలు, ముఖ్యాంశాలతో పాటు చెప్పేదేంటంటే స్వల్ప ప్రీమియం రేట్లతో ప్రధానమంత్రి సురక్షబీమా యోజన ఒక మేటి సామాజిక సురక్ష పథకం. ఇది దాచుకున్నవాటన్నిటినీ పెద్దగా ఖాళీ చేయకుండా ఆర్థికంగా బలంగా లేని వారికి జీవితబీమాను కల్పిస్తుంది.

English summary

ప్ర‌ధాన మంత్రి బీమా యోజ‌న ద్వారా మీ జీవితానికి సుర‌క్ష‌ | pradhana mantri suraksha bhima yojana a accidental insurance for common man

Pradhan Mantri Suraksha Bima Yojana has been announced by the government of India as one of the three social security schemes. PMSBY is an accidental insurance scheme that provides accidental death and disability coverage for one year, with an annual renewal.
Story first published: Saturday, January 20, 2018, 11:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X