For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్ర‌తి వ్య‌క్తికి జీవిత బీమా ఉండటానికి అవ‌స‌ర‌మ‌య్యే 10 కార‌ణాలు

ప్ర‌మాదాలు, ఇత‌ర కార‌ణాల‌తో చాలా మంది జీవిత‌కాలం తీర‌క‌ముందే దుర‌దృష్ట వ‌శాత్తు లోకం విడిచి వెలుతున్నారు. సంపాదించే కుటుంబ పెద్ద ఆక‌స్మిక మ‌ర‌ణం పాలైతే ఆ కుటుంబం అంతా చెల్లాచెదురైపోతుంది. ఇంటి అద్దెల

By Krishnadivya P
|

ఆర్థిక నిర్ణ‌యాల్లో జీవిత బీమా తీసుకోవడానికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. మీకు తెలుసో లేదో భార‌త‌దేశంలో కేవ‌లం 10 శాతం మందికే బీమా ఉంది. ఇప్పుడు మ‌నం సంపాదించే దాంట్లో భ‌విష్య‌త్తులో ఎంత మిగులుతుందో మ‌న‌కే తెలియ‌ని ప‌రిస్థితి.

ప్ర‌మాదాలు, ఇత‌ర కార‌ణాల‌తో చాలా మంది జీవిత‌కాలం తీర‌క‌ముందే దుర‌దృష్ట వ‌శాత్తు లోకం విడిచి వెలుతున్నారు. సంపాదించే కుటుంబ పెద్ద ఆక‌స్మిక మ‌ర‌ణం పాలైతే ఆ కుటుంబం అంతా చెల్లాచెదురైపోతుంది. ఇంటి అద్దెలు క‌ట్ట‌డానికి, అప్పులు

చెల్లించ‌డానికి, రో్జు గ‌డ‌ప‌డానికి మ‌నం ఎంత‌గానో ప్రేమించే జీవిత భాగ‌స్వామికి అంతులేని క‌ష్టాలు వ‌స్తాయి. అందుకే కుటంబాన్ని సుర‌క్షితంగా ఉంచేందుకు జీవిత బీమా తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. అదే మీరు యుక్త వ‌య‌సులో ఉంటే ఇంకా అత్య‌వ‌స‌రం.

అస‌లు జీవిత బీమా ఎందుకు తీసుకోవాలో చెప్పే ప‌ది కార‌ణాలు ఇవీ.

1. మ‌న‌ త‌ర్వాత జీవిత భాగ‌స్వామికి భ‌రోసా

1. మ‌న‌ త‌ర్వాత జీవిత భాగ‌స్వామికి భ‌రోసా

జీవిత బీమాలో ఇది అత్యంత కీల‌క‌మైన అంశం. సంపాదించే ఆ ఒక్క‌రూ పోతే ఆ ఇంటి ఇల్లాలు చాలా క‌ష్టాలు ప‌డాల్సి ఉంటుంది. ఎలాంటి ఆర్థిక ఏర్పాట్లు చేయ‌కుంటే కుటుంబం, ఇల్లాలు ఇంకా పోయిన‌వారిపైనే ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. ఇలాంటి ఆప‌ద‌లు

రావాల‌ని ఎవ‌రూ కోరుకోరు. పిల్ల‌ల‌ను పెంచి పెద్ద చేయ‌డానికి, వారికి విద్యా బుద్ధులు చెప్పించ‌డానికి, ఇల్లు గ‌డ‌వ‌డానికి డ‌బ్బు ఉండ‌దు. చాలా క‌ష్టాల ప‌డాల్సి ఉంటుంది. అదే జీవిత బీమా తీసుకున్న‌ట్ట‌యితే ఈ బాధ‌లు ఉండ‌వు. ఇంట్లో వారికి భ‌రోసా ఉంటుంది.

2. అప్పులు తీర్చ‌డానికి

2. అప్పులు తీర్చ‌డానికి

క‌ష్టాల్లో, క‌ర‌వులో ఉన్న‌ప్పుడు మ‌న కుటుంబం ఇబ్బంది ప‌డాల‌ని ఎవ‌రం కోరుకోము. అదే స‌రైన బీమా ఉంటే ఇంకా క‌ట్టాల్సిన గృహ‌రుణం, వాహ‌న రుణం, వ్య‌క్తిగ‌త రుణం, క్రెడిట్ కార్డు బాకీలు చెల్లించ‌వ‌చ్చు. నిశ్చితంగా ఉండొచ్చు.

3. దీర్ఘ‌కాల ల‌క్ష్యాల సాధ‌న‌

3. దీర్ఘ‌కాల ల‌క్ష్యాల సాధ‌న‌

బీమాను దీర్ఘ‌కాల ఆర్థిక ల‌క్ష్యాలు సాధించే పెట్టుబ‌డిగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు. బీమా ప‌థ‌కం నుంచి వ‌చ్చే డివిడెండ్, క్యాష్‌బ్యాక్ ద్వారా డ‌బ్బు అందుతుంది. ఇంకా సుదీర్ఘ ల‌క్ష్యాలైన సొంత ఇల్లు, రిటైర్‌మెంట్ ప్ర‌ణాళిక‌లు ఏర్పాటు చేసుకోవ‌చ్చు. ఇప్పుడు చాలా

ర‌కాల పాల‌సీలు వైవిధ్య‌మైన పెట్టుబ‌డి అంశాలతో వ‌స్తున్నాయి. అదే మ‌నం స్టాక్‌మార్కెట్లో పెట్ట‌బ‌డులు పెట్టే యులిప్ లాంటి ప‌థ‌కాలు ఎంచుకుంటే దీర్ఘ‌కాలంలో మ‌న‌కు మంచి రాబ‌డి అందుతుంది. అయితే ఇవి న‌ష్ట‌భ‌యంతో కూడిన‌వి కాబ‌ట్టి అన్నీ అంశాల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి ఎంచుకోవాలి.

4. రిటైర్మెంట్ ల‌క్ష్యాల సాధ‌న‌

4. రిటైర్మెంట్ ల‌క్ష్యాల సాధ‌న‌

ఉద్యోగానికి వీడ్కోలు ప‌లికిన త‌ర్వాత ఆదాయ ప్ర‌యోజ‌నాల‌ను వ‌దులుకోవాల‌ని ఎవ‌రు అనుకుంటారు చెప్పండి! అదే మీరు బీమా తీసుకుంటే ఉద్యోగ విర‌మ‌న త‌ర్వాత నెల‌నెలా ఆదాయం పొందొచ్చు. పెన్ష‌న్ ప్ర‌ణాళిక‌లో క్ర‌మానుగుణంగా పెట్టుబ‌డులు

పెట్టిన‌ట్టే బీమా ప‌థ‌కంలోనూ పెడితే విర‌మ‌ణ త‌ర్వాత నిశ్చింత‌గా ఆదాయం పొంద‌వ‌చ్చు.

5. చిన్న‌వ‌య‌సులో తీసుకుంటే త‌క్కువ ప్రీమియం

5. చిన్న‌వ‌య‌సులో తీసుకుంటే త‌క్కువ ప్రీమియం

అంద‌రికీ బీమా అవ‌స‌రం కాక‌పోవ‌చ్చు! మ‌న వ‌ద్ద స‌రిప‌డినంత అత్య‌వ‌స‌ర నిధి ఉంటే లేదంటే త‌ల్లిదండ్రుల మీద‌నే ఆధార‌ప‌డితే బీమా అంతా అత్య‌వ‌స‌రం కాక‌పోవ‌చ్చు. అదే మీరు ఏదైనా విద్యారుణం, అమ్మానాన్న తీసుకున్న రుణాల్లో భాగ‌స్వామి అయి ఉంటే వెంట‌నే బీమా తీసుకోవ‌డం మంచింది. ఒక్కరే ఉండి త‌క్కువ వ‌య‌సులో ఉంటే ప్రీమియం రేట్లు త‌క్కువ‌గా ఉంటాయి. ఇలాంటి సమ‌యంలో బీమా ఏజెంటు మీకు అవ‌స‌రం లేని పాల‌సీలు అంట‌గ‌ట్టే ప్ర‌మాదం ఉంది. వాటి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి.

ఆర్థిక స‌ల‌హాదారు వ‌ద్ద‌కు వెళ్లి మ‌న‌కు స‌రిప‌డే బీమాను సూచించ‌మంటే మంచింది. వారు మీ ఆస్తులు, అప్పుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఎంత మొత్తానికి, ఎలాంటి పాల‌సీ అవ‌స‌ర‌మో చెప్తారు. మీకు పెళ్లికాకున్నా మీపైనే ఆధార‌ప‌డ్డ వారు ఉంటే బీమా తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. మ‌న‌పై ఆధార‌ప‌డ్డ‌వారు ఉన్న‌ట్ట‌యితే ఎంత యుక్త వ‌య‌సులో పాల‌సీ తీసుకుంటే అంత మంచిద‌ని ఫ్యూచ‌ర్ జ‌న‌ర‌ల్ జీవితా బీమా ఈసీవో ప్ర‌దీప్ పాండే అంటున్నారు. యుక్త వ‌య‌సులో ఉండి, చ‌క్క‌ని ఆరోగ్యంతో ఉంటే చాలా

త‌క్కువ ప్రీమియం వర్తిస్తుంద‌ని చెప్తున్నారు.

6. మీ వ్యాపారానికి ర‌క్ష‌ణ‌

6. మీ వ్యాపారానికి ర‌క్ష‌ణ‌

కొన్ని ర‌కాల బీమా పాల‌సీలు మీకు, మీ కుటుంబానికే కాదు మీ వ్యాపారానికి ర‌క్ష‌ణ‌గా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు మీకో వ్యాపార సంస్థ ఉంద‌నుకుందాం. మ‌రో భాగ‌స్వామి మీ వాటా కొనుగోలు చేశాడ‌నుకుందాం. ఇప్పుడు వ్యాపార భాగ‌స్వాములంతా కొనుగోలు, అమ్మ‌కం ఒప్పందంలో ఉంటారు. సంబంధిత పాల‌సీ తీసుకుంటే భాగ‌స్వామి చ‌నిపోతే వారి వాటా అమ్మ‌కుండానే నామినీకి సొమ్ము చెల్లించ‌వ‌చ్చు. జీవిత బీమా పాల‌సీలు రెండు ర‌కాలుగా ఉంటాయి. ఒక‌టి ట‌ర్మ్, రెండోది పెట్ట‌బడి త‌రహా .

ప్ర‌యోజ‌నాల‌ను బ‌ట్టి ఈ పాల‌సీలు ఉంటాయి. ట‌ర్మ్ బీమా అనేది మ‌నం ముందుగా నిర్దేశించుకున్నంత కాలం ఉంటుంది. అంటే 10 ఏళ్లు, 20, 30 ఇలా.. ఇందులో బీమా చేయించుకున్న వ్య‌క్తి ఆ ట‌ర్మ్‌లో అనుకోని ప‌రిస్థిలో చ‌నిపోతే బీమా మొత్తం నామినీకి అందుతుంది. సాధార‌ణంగా ట‌ర్మ్ ముగిస్తే ఎలాంటి డ‌బ్బులు రావు. ప్రీమియం చాలా త‌క్కువ ఉంటుంది. ఇక పెట్టుబ‌డి కోసం చేసిన పాల‌సీలైతే ట‌ర్మ్ తీరిన త‌ర్వాత ఏక‌మొత్తంలో డ‌బ్బు చేతికి అందుతుంది. ఒక వేళ మ‌ధ్య‌లోనే పాల‌సీదారుడు మృతిచెందితే నామినీకి డ‌బ్బు అందుతుంది. ఈ త‌ర‌హా పాల‌సీల‌కు ప్రీమియం ఎక్కువ ఉంటుంది.

7. ప‌న్ను మిన‌హాయింపు

7. ప‌న్ను మిన‌హాయింపు

ఎలాంటి జీవిత బీమా పాల‌సీ తీసుకున్నా ఆదాయ‌ప‌న్ను నుంచి మినహాయింపు ఉంటుంది. సెక్ష‌న్ 80సీ ప్ర‌కారం మీరు క‌ట్టిన ప్రీమియం మొత్తాన్ని రూ.1.5 ల‌క్ష‌ల లోపు మిన‌హాయించుకోవ‌చ్చు. ఆదాయ‌ప‌న్ను సెక్ష‌న్ 10(డి) 1961 ప్ర‌కారం

పాల‌సీదారుడు మృతిచెందిన త‌ర్వాత వ‌చ్చే మొత్తానికి ఎలాంటి ప‌న్ను ఉండ‌దు.

8. బ‌ల‌వంత‌పు ఆదా

8. బ‌ల‌వంత‌పు ఆదా

యూనిట్ లింక్‌డ్ పాల‌సీలు తీసుకుంటే క‌ట్టాల్సిన ప్రీమియం అధికంగా ఉంటుంది. కానీ ఆ డ‌బ్బుల‌తో స్టాక్ మార్కెట్లో పెట్టుబ‌డులు పెడ‌తారు. ఆ డ‌బ్బు విలువ పెరుగుతుంది. ఆ పాల‌సీ ద్వారా వ‌చ్చే అద‌న‌పు ఆదాయాన్ని మీరు స్వీక‌రించ‌వ‌చ్చు. లేదంటే వాటాల‌ను అమ్మి మొత్తం డ‌బ్బు పొంద‌వ‌చ్చు.

9 త‌ర్వాత క‌ష్టం

9 త‌ర్వాత క‌ష్టం

జీవిత బీమా అనేది అనిశ్చితి ఆధారంగా ఉంటుంది. మీరు యుక్త వ‌య‌సులో ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడు బీమా ప్రీమియం భారంగా అనిపించ‌వ‌చ్చు. కానీ మీరు అక‌స్మాత్తుగా అనారోగ్యం పాలైన త‌ర్వాత బీమా తీసుకుందామంటే ప్రీమీయాన్ని అమాంతంగా పెంచేస్తాయి కంపెనీలు. కొన్ని పాల‌సీల‌కు అన‌ర్హులు కూడా అవుతారు. అందుకే ముందే బీమా తీసుకోవ‌డం మంచింది. ముందే తీసుకుంటే కొన్ని ర‌కాల రైడ‌ర్స్ (అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు) ఉండే అవ‌కాశం ఉంటుంది.

రైడ‌ర్స్ అనేవి బీమాదారుడికి అద‌న‌పు ప్ర‌యోజాల‌ను క‌ల్పిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు రాము అనే వ్య‌క్తి పాల‌సీ తీసుకున్నాడ‌ని అనుకుందాం. అప్పుడే త‌న‌కు ఎలాంటి అనారోగ్యం వ‌చ్చినా ప్రీమియం క‌ట్ట‌లేన‌ని ఒక రైడ‌ర్ ఎంచుకున్నాడు. దురదృష్ట వ‌శాత్తు రాము అనారోగ్యం పాలై ప్రీమియం చెల్లించ‌లేని ప‌రిస్థితి వ‌స్తే సంస్థే మిగ‌తా ప్రీమియం చెల్లిస్తుంది. ఇలాంటివి చాలా రైడ‌ర్స్ ఉంటాయి.

10. ప్ర‌శాంత‌త‌, భ‌రోసా

10. ప్ర‌శాంత‌త‌, భ‌రోసా

మృత్యువు అనివార్యం. అలాంటి విప‌త్క‌ర ప‌రిస్థిలో మీరు మీ కుటుంబానికి ఆర్థికంగా చేయూత‌న అందివ్వాలంటే పాల‌సీ తీసుకోవ‌డం మంచింది. చిన్న మొత్తానికే పాల‌సీ తీసుకున్న అది ఏదో ఒక స‌మ‌యానికి అవ‌స‌రం వ‌స్తుంది. కుటుంబ రక్ష‌ణ‌కు, క్ర‌మ‌శిక్ష‌ణగా డ‌బ్బులు ఆదా చేసుకోవ‌డానికి జీవిత బీమా అనువైన ప‌నిముట్టు అని పాండే అంటారు. ఇది డ‌బ్బు మిగులుస్తుంద‌ని పేర్కొంటున్నారు. జీవిత చ‌క్రం తిరుగుతున్నా కొద్దీ అవ‌స‌రాలు, ఆధార‌ప‌డిన వారిని బ‌ట్టి బీమా పాల‌సీల అవ‌స‌రం మారుతుంటుంద‌ని చెప్పారు.

Read more about: life insurance
English summary

ప్ర‌తి వ్య‌క్తికి జీవిత బీమా ఉండటానికి అవ‌స‌ర‌మ‌య్యే 10 కార‌ణాలు | 10 reasons why you need to buy life insurance

Buying life insurance is one of the most important financial decisions, but believe it or not, only 10 per cent of Indians are insured. But why is it so important? Well, regardless of how much you earn, no one knows what the future holds. Lots of people die a prematurely every year from illness or accident and, if you happen to be the sole breadwinner in the family and you were to pass away, it could have devastating consequences for your loved ones-their ability to pay household expenses, debts and maintain their standard of living.
Story first published: Thursday, January 18, 2018, 23:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X