English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌తో స‌హా ఆరు అంకెల వేత‌నాలు వ‌చ్చే ఉద్యోగాలు ఇవే

Posted By:
Subscribe to GoodReturns Telugu

లక్ష‌ల్లో జీతం అంటే ఎవ‌రికిష్టం ఉండ‌దు చెప్పండి! వాటితో పాటు అద‌న‌పు భ‌త్యాలు వ‌స్తే బిందాస్ జీవితం గ‌డిపేవ‌చ్చ‌ని అనుకుంటారు. మ‌రిలా భారీ జీతం వ‌చ్చే ఉద్యోగాలు రావాలంటే ఎలాంటి నైపుణ్యాలు అవ‌స‌ర‌మో తెలుసా? డిగ్రీ పూర్తి చేసేలోపే ఆయా ప‌రిశ్ర‌మ‌ల‌కు త‌గిన నైపుణ్యాల‌ను అందిపుచ్చుకుంటే మంచి కెరీర్ మీ ముందుంటుంద‌ని ఉద్యోగ నియామ‌క సంస్థ‌లు అంటున్నాయి. ఆరంకెల వేత‌నంతో పాటు ప‌దోన్న‌తులు ల‌భించేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవ‌స‌ర‌మో తెలుసుకుందాం!

1. సాఫ్ట్ వేర్ డెవ‌ల‌ప్‌మెంట్‌

1. సాఫ్ట్ వేర్ డెవ‌ల‌ప్‌మెంట్‌

మీరు ఇప్ప‌టికే స‌మాచార సాంకేతిక, వెబ్ డెవ‌ల‌ప్‌మెంట్ ప‌రిశ్ర‌మ‌ల్లో ప్రోగ్రామ‌ర్‌గా, కోడ‌ర్‌గా, డిజైన‌ర్‌గా ప‌నిచేస్తుంటే మీ నైపుణ్యాల‌ను మ‌రింత మెరుగుపెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి అప్లికేష‌న్ల‌ను నేర్చుకోవ‌డం ద్వారా లాభం ప్ర‌యోజ‌నం

ఉంటుంది. డేటాబేస్ల‌ను రూపొందించ‌డం, కొత్త ర‌కాల సాఫ్ట్‌వేర్ల‌ను అభివృద్ధి చేయ‌డ‌మే డెవ‌ల‌ప‌ర్ల అస‌లు ప‌ని. లేబ‌ర్ బ్యూరో గ‌ణాంకాల ప్ర‌కారం 2016మేలో ఈ రంగంలో నిపుణుల స‌గ‌టు వేతం 1,00,080 డాల‌ర్లుగా ఉంది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం వ‌స్తే కెరీర్ సాంతం ఆరెంక‌ల జీతం క‌న్నా ఎక్కువే పొంద‌వ‌చ్చు.

2. ఇంట‌ర్నెట్ మార్కెటింగ్‌

2. ఇంట‌ర్నెట్ మార్కెటింగ్‌

న్యూ మీడియా, డిజిట‌ల్ మీడియాల్లో మార్కెటింగ్ లో ప‌నిచేయాల‌న్న అభిరుచి ఉంటే అందుకు త‌గ్గ నైపుణ్యాల‌ను నేర్చుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. అప్పుడే ఈ రంగంలో ఆరంకెల జీతం ల‌భిస్తుంది. ఆయా సంస్థ డిజిట‌ల్ వ్యూహాల‌ను చ‌క్క‌గా అమ‌లు చేసే ముఖ్య

మార్కెటింగ్ అధికారికి ఏడాది స‌గ‌టున 245,000 డాల‌ర్ల వేత‌నం అందుతోంద‌ని ఉద్యోగ నియామ‌క సంస్థ మోండో తెలిపింది. ఇక ప్ర‌క‌ట‌న‌లు, ప్రమోష‌న్ల విభాగంలోని మేనేజ‌ర్లు 2016లో స‌గ‌టున 127,560 డాల‌ర్ల వేత‌నం అందుకున్నార‌ని బీఎల్ఎస్ నివేదిక వెల్ల‌డించింది. దాదాపు ఎక్కువ మంది మేనేజ‌ర్లు ఎంట‌ర్ ప్రైజ్ ప‌రిశ్ర‌మ‌లోనే ప‌నిచేస్తున్నారు.

3. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్

3. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్

మీరు వ్యాప‌ర రంగంలోనే ఉన్న‌వారై సాధార‌ణ టెక్ నైపుణ్యాలు ఉండి ప్ర‌సిద్ధి పొందిన అస‌నా, బేస్ క్యాంప్ వంటి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టూల్స్ తో ప‌నిచేయ‌గ‌లిగితే ఉద్యోగ ప్ర‌స్థానంలో మంచి ఎదుగుద‌ల ఉంటుంది. యాప్స్‌, సాంకేతికత‌ను ఉప‌యోగిస్తూ బృందాల‌ను, డేటా స‌మ‌ర్థంగా నిర్వ‌హించ‌గ‌ల మేనేజ‌ర్లు అయితే టెక్నాల‌జీ సంస్థ‌లు కాకున్నా వారికి గిరాకీ బాగానే ఉంది. స‌హోద్యోగుల‌ను ప‌ర్య‌వేక్షించ‌డం, బృంద స‌భ్యుల‌కు ల‌క్ష్యాలు నిర్దేశించ‌డం, ఈఆర్‌పీ వంటి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టూల్స్ ద్వారా వారిని స‌మ‌న్వ‌యం చేయ‌డం ఇక్క‌డ మీ బాధ్య‌త‌. అలాంట‌ప్పుడు మీకు ఆరెంక‌ల జీతం ల‌భిస్తుంది. సాల‌రీ.కాం ప్ర‌కారం ఈ రంగంలో ఈఆర్‌పీ ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌కు స‌గ‌టున 1,29,633 డాల‌ర్ల వేత‌నం అందుతోంది.

4. ఫైనాన్షియ‌ల్ మేనేజ్‌మెంట్‌

4. ఫైనాన్షియ‌ల్ మేనేజ్‌మెంట్‌

గ‌ణాంకాలతో ఓ ఆటాడుకుంటూ విశ్లేష‌ణాత్మ‌క మేధ‌స్సు ఉంటే మీకు ఫైనాన్స్ మేనేజ‌ర్‌గా అవ‌కాశాలు ఉంటాయి. ఆర్థిక అంచ‌నాలు, వ్యాపార స‌ర‌ళి, న‌ష్ట‌భ‌యాన్ని అంచ‌నావేయ‌డం వంటి నైపుణ్యంతో కూడిన ప‌నులు ఆర్థిక రంగంలోని కంపెనీల్లో ఉంటాయి.

బీఎల్ఎస్ ప్ర‌కారం ఈ రంగంలో ఐదేళ్ల అనుభవంతో పాటు చ‌క్క‌ని నైపుణ్యాలు ఉంటే ఏడాదికి స‌గ‌టు వేతనం 121,750 డాల‌ర్ల వ‌ర‌కు ఉంటుంది.

5. సాంకేతిక‌త ద్వారా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం

5. సాంకేతిక‌త ద్వారా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం

చేసే ప్ర‌తి ఉద్యోగంలోనూ ప్ర‌తి స్థాయిలోనూ ఎన్నో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల్సి ఉంటుంది. ఎవ‌రైతే వాటిని గుర్తించి టెక్నాల‌జీ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తారో వారికి ఎక్కువ జీతం ల‌భిస్తుంది. కంప్యూట‌ర్ సైన్స్‌లో వేత‌నాలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే కంప్యూట‌ర్ ఇంజినీరు, శాస్త్ర‌వేత్త‌, ప్రోగ్రామ‌ర్‌, క‌న్స‌ల్టెంట్గా సాంకేతిక‌త‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను వీరు ప‌రిష్క‌రించాలి. బీఎల్ఎస్ ప్ర‌కారం 2016లో కంప్యూట‌ర్, స‌మాచార ప‌రిశోధ‌న శాస్త్ర‌వేత్త‌ల‌కు స‌గ‌టున 111,840 వేత‌నాలు లభించాయి.

2024 వ‌ర‌కు ఈ రంగంలో ఉద్యోగాలు 11 శాతం పెరుగుతాయ‌ని అంచ‌నా.

6. అమ్మ‌కాలు

6. అమ్మ‌కాలు

విక్ర‌యాల‌కు సంబంధించిన ఉద్యోగాల‌న్నీ క‌మిష‌న్ ఆధారంగానే ఉంటాయి. అందుకే వీరు ఎంతైనా సంపాదించుకోవ‌చ్చు. సేల్స్, వినియోగ‌దారుల‌కు సేవ‌లందించే నైపుణ్యాలో మంచి అనుభ‌వం ఉంటే ఆరంకెల జీతం సునాయాసంగా ల‌భిస్తుంది. అన్ని

అర్హ‌త‌లు ఉంటే కంపెనీలు ల‌క్ష‌డాల‌ర్ల‌కు పైగా వేత‌నాలు అందించ‌డానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ప‌రిశ్ర‌మ‌లో ఐదేళ్ల అనుభ‌వం, క్లైంట్ల‌ను డీల్ చేయ‌గ‌ల స‌త్తా ఉంటే చాలు. సేల్స్ ట్రైనింగ్ శిబిరాలకు హాజ‌రై మీ నైపుణ్యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగులు దిద్దుకోవ‌చ్చు. బీఎల్ఎస్ ప్ర‌కారం 2016లో స‌గ‌టున ఈ రంగంలో 117,960 డాల‌ర్ల వేత‌నం ల‌భిస్తోంది.

7. క‌మ్యూనికేష‌న్, ప్ర‌జా సంబంధాలు

7. క‌మ్యూనికేష‌న్, ప్ర‌జా సంబంధాలు

అన్ని రంగాల్లోని ఉద్యోగాల‌కు క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ త‌ప్ప‌నిస‌రి. వివిధ స్థాయులు, వ‌య‌సుల వారితో చ‌క్క‌గా మాట్లాడుతూ ప్ర‌జా సంబంధాలు, నిధుల సేక‌ర‌ణ‌, మార్కెటింగ్ క‌మ్యూనికేష‌న్ ప‌రంగా ఆక‌ట్టుకుంటే ఆరంకెల జీతం దొరుకుతుంది. ప్ర‌జా సంబంధాల అధికారి ప‌నిచేసే కంపెనీ దృక్ప‌థాన్ని, స్థాయిని, ఇమేజ్‌ను వ్య‌క్తిగ‌తంగా, బృందాలు, ప్ర‌జ‌ల్లో మెరుగుప‌రిచేందుకు కృషి చేయాలి. రాజ‌కీయ నాయ‌కులు, పెద్ద పెద్ద కంపెనీల య‌జ‌మానులు, కార్పొరేష‌న్ల‌ను క‌మ్యూనికేష‌న్ నైపుణ్యాల ద్వారా ఆక‌ట్టుకోవాల్సి ఉంటుంది. మీడియాతోనూ చ‌క్క‌గా వ్య‌వ‌హ‌రించాలి. బీఎల్ఎస్ ప్ర‌కారం 2016లో ఈరంగంలో ప్ర‌జా సంబంధాలు, నిధుల సేక‌ర‌ణ మేనేజ‌ర్ల‌కు స‌గ‌టున 107,320 డాల‌ర్ల వేత‌నం ల‌భించింది.

8. బోధ‌న, ప్రేర‌ణ‌

8. బోధ‌న, ప్రేర‌ణ‌

ఎంత అనుభ‌వం ఉన్నా సాధార‌ణంగా ఉపాధ్యాయుల‌కు ఆరంకెల వేత‌నం ల‌భించ‌డం అరుదే. 2016లో పాఠ‌శాల ఉపాధ్యాయుల‌కు 58,030 డాల‌ర్ల స‌గ‌టు వేత‌నం అందింది. ఐతే చ‌క్క‌ని బోధ‌నా ప‌టిమ‌, ఎదిగేందుకు స‌ల‌హాలు అందించే స‌ల‌హాదారుల‌కు, జీవిత పాఠాలు చెప్పే శిక్ష‌కుల‌కు మంచి జీతాలే ల‌భిస్తున్నాయి. విద్యార్థులు, ఉద్యోగాలు, నాయ‌కుల‌కు దైనందిన జీవితానికి దూరంగా ప్రేర‌ణ క‌ల్పించే మాన‌సిక‌, వ్య‌క్తిత్వ వికాస నిపుణుల‌కు మంచి గిరాకీ ఉంది. ఏ కంపెనీలోనూ ప‌నిచేయ‌కుండా సొంతంగా వికాస నిపుణ పాఠాలు చెప్పే వారు సొంతంగా వారి రేట్లు నిర్ణ‌యించుకోవ‌చ్చు. ఈ రంగంలోని వారికి 2017లో స‌గ‌టున 209, 400 డాల‌ర్ల వేత‌నం ల‌భించింది.

9. పెట్టుబ‌డులు, ఆర్ధిక నిపుణులు

9. పెట్టుబ‌డులు, ఆర్ధిక నిపుణులు

ఆర్ధిక రంగంలో అనుభ‌వం ఉండి వినియోగ‌దారులు లేదా కంపెనీల సంప‌ద‌ను పెంచే పెట్టుబ‌డుల నిర్ణ‌య స‌ల‌హాలు ఇచ్చేవారికి ఆర్థిక రంగంలో మంచి గిరాకీ ఉంది. ఆర్ధిక స‌ల‌హాదారుగా కెరీర్ ఎంచుకునే వారికి వృద్ధి బాగానే ఉంది. వీరికి బ్యాంకులు మాత్ర‌మే కాదు కార్పొరేట్ సంస్థ‌లూ నియ‌మించుకుంటున్నాయి. శాస్త్ర‌, సాంకేతిక రంగ‌ల్లోనూ కార్య‌క‌లాపాల‌నూ పెట్టుబ‌డి నిపుణులు ప‌ర్య‌వేక్షించాల్సి వ‌స్తోంది. ఇక స్టాక్‌మార్కెట్ సెక్యూరిటీలు, క‌మోడిటీలో అనుభ‌వం, నైపుణ్యం ఉంటే ఆరంకెల జీతం చాలా స‌లువుగా ల‌భిస్తుంది. బ్రోక‌రేజి, లేదా సొంత‌గానే ప‌నిచేస్తూ వినియోగ‌దారుల‌ను స‌ల‌హాలు ఇచ్చి క‌మిష‌న్ల రూపంలో డ‌బ్బు పొంద‌వ‌చ్చు.

10. పైలైటింగ్

10. పైలైటింగ్

సంప్ర‌దాయ ఉద్యోగాలు ఇష్టంలేని వారు వైమానిక రంగంలో పైల‌ట్‌గా ఉద్యోగాలు ఎంచుకోవ‌చ్చు . సైన్యంలో సేవ‌లందిస్తూ లేదంటే వైమానిక క‌ళాశాల‌ల్లోవిమానాలు న‌డ‌ప‌గ‌ల నైపుణ్యాలు నేర్చుకుంటే ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలైట్ లైసెన్స్ (ఏటీపీఎల్) ధ్రువ‌ప‌త్రం ల‌భిస్తుంది. ఇది ఉంటే ప్రైవేటు, ప్ర‌భుత్వ విమాన‌యాన సంస్థ‌ల్లో పైట‌ల్‌గా ఉద్యోగం ల‌భిస్తుంది. విమాన ప్ర‌యాణికులు పెరుగుతున్న నేప‌థ్యంలో పైలైట్ల‌కు చాలా గిరాకీ ఉంది. బీఎల్ఎస్ ప్ర‌కారం క‌మ‌ర్షియ‌ల్ పైల‌ట్ల‌కు 2016లో ఏడాదికి స‌గ‌టున 105,720 డాల‌ర్ల వేత‌నం ల‌భించింది.

Read more about: jobs, salary, software
English summary

10 Job Skills That Will Help You Land a Six-Figure Salary

If you want to make more money in the upcoming years or are ready to start searching for six-figure jobs, brushing up on some in-demand job skills could help you reach your earning goals.Many companies offer up six-figure jobs for highly skilled workers and to those who specialize in a certain field. Knowing what these work skills are before you complete a degree or pursue career development opportunities could put you in the front of the line to secure higher-paying jobs throughout your career. Click through for job skills you need so you can earn a six-figure salary
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns