For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిజిలాక‌ర్ ఉప‌యోగించి ప‌త్రాల‌ను ఆన్లైన్లో భ‌ద్ర‌ప‌రుచుకోవ‌డం ఎలా?

డిజిలాక‌ర్ సంబంధించి అన్ని ఖాతాల‌కు త‌మ‌దైన పాస్ వ‌ర్డ్‌ల‌ను వినియోగ‌దారులే సృష్టించి ఉంటారు కాబ‌ట్టి మీ ప‌త్రాల‌న్నీ భ‌ద్రంగానే ఉంటాయి. మీరు నేరుగా ఎవ‌రికి కావాలంటే వారికి ఆన్‌లైన్లోనే ముఖ్య‌మైన ప

|

డిజిలాక‌ర్ ఉప‌యోగించి ప‌త్రాల‌ను ఆన్లైన్లో భ‌ద్ర‌ప‌రుచుకోవ‌డం ఎలా?
మ‌న తండ్రులు, తాత‌ల కాలంలో విలువైన వ‌స్తువులు, ఆభ‌ర‌ణాలు దాచుకునేందుకు బీరువాలో ఒక లాక‌ర్ ప్ర‌త్యేకంగా ఉండేది. ఇప్ప‌ట్లో అంద‌రి ద‌గ్గ‌రా వివిధ పత్రాల్లోనే డ‌బ్బు సంబంధిత పెట్టుబ‌డులు ఉంటున్నాయి. భౌతికంగా ఏ వ‌స్తువులు లేక‌పోయినా ఎంతో పెట్టుబ‌డిని వివిధ మార్గాల్లో ఆన్‌లైన్లో పెడుతున్నారు. ఈ క్ర‌మంలో ముఖ్య‌మైన ప‌త్రాలు, ఇన్సూరెన్స్ స‌ర్టిఫికెట్లు, బాండ్లు వంటివి ఉన్నాయి. ఇలాంటి డాక్యుమెంట్లు పోతే మ‌ళ్లీ వాటిని ఆయా సంస్థల నుంచి తీసుకోవ‌డం కాస్త ప్ర‌యాసే. ఇలాంటి ఇబ్బందుల‌ను దూరం చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిందే డిజిట‌ల్ లాక‌ర్. ఇది భార‌త ప్ర‌భుత్వం త‌న ప్ర‌జ‌ల‌కు అందించే ప్ర‌త్యేక ఆన్‌లైన్ ఆధారిత సేవ‌. దీనికి ఆధార్ కావాలండోయ్. మ‌రి దీని వాడ‌కం, ఉప‌యోగాలేంటో తెలుసుకుందాం.

1. దీంతో స‌క‌లం భ‌ద్రం

1. దీంతో స‌క‌లం భ‌ద్రం

ప్ర‌స్తుతం యువ‌తరం బీమా పాల‌సీలు, ఎఫ్డీలు,బంగారు బాండ్లు వంటి వాటిన‌న్నింటినీ ఆన్‌లైన్లోనే కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఇంకా పాస్ పోర్టు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓట‌రు గుర్తింపు ప‌త్రం వంటి వాటి కోసం ఆన్‌లైన్లో ద‌ర‌ఖాస్తు చేసే వీలుంది. విద్యార్థులు త‌మ క‌ళాశాల‌ల్లో, విశ్వ‌విద్యాల‌యాల్లో ప్ర‌వేశాల స‌మ‌యంలో ఎన్నో ధ్రువ‌ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అయితే అవ‌న్నీ భ‌ద్ర‌ప‌రుచుకునే విష‌యం వ‌చ్చే స‌రికి ఎంతో ఆందోళ‌న ఉంటుంది. ఎందుకంటే ధ్రువ‌ప‌త్రాల‌ను ఒక‌చోట నుంచి మ‌రో చోట‌కు తీసుకుపోయేట‌ప్పుడు వేటినైనా మ‌రిచిపోయే, లేదా పోగొట్టుకునే ఆస్కారం లేక‌పోలేదు. అయితే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ ప‌రిష్కార‌మే డిజిలాక‌ర్. దీంతో ప‌త్రాల‌న్నింటినీ ఆన్‌లైన్లో భ‌ద్ర‌ప‌రుచుకోవ‌చ్చు. digilocker.gov.in

దీని గురించి మ‌రింత ముఖ్య స‌మాచారం మీ కోసం..

2.డిజిట‌ల్ లాక‌ర్ ల‌క్ష‌ణాలు

2.డిజిట‌ల్ లాక‌ర్ ల‌క్ష‌ణాలు

1. డిజిలాక‌ర్ వెబ్‌సైట్లో ఈ ప‌త్రాల‌ను జారీ చేసిన సంస్థ‌లు, పౌరుల ఇత‌ర రుజువుల‌ను ఈ ప‌ద్ద‌తిని అంగీకరిస్తాయ‌ని ప‌లు సంస్థ‌ల‌,వెబ్‌సైట్ల జాబితాలు ఉంటాయి.

2. ప్ర‌తి వ్య‌క్తి డిజిలాక‌ర్, ఆధార్ సంఖ్య‌తో అనుసంధానించేలా ఈ ఏర్పాటు ఉంటుంది.

3. సంత‌కం చేసేందుకు కూడా ఈ-సైన్ ప‌ద్ద‌తి ఉంటుంది.

4. ప్ర‌భుత్వం వ‌ద్ద న‌మోదు చేసుకున్న ఏజెన్సీ లేదా సంస్థ‌ల‌కు ఈ-డాక్యుమెంట్ల‌ను ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచుతారు.

5. మొత్తం ప‌త్రాలు దాచుకునేందుకు ఒక్కో వ్య‌క్తికి 10 ఎంబీ స్పేస్ ఉంటుంది.

 3. డిజిట‌ల్ లాక‌ర్ కోసం న‌మోదు

3. డిజిట‌ల్ లాక‌ర్ కోసం న‌మోదు

డిజి లాక‌ర్ న‌మోదు కోసం ఆధార్ సంఖ్య త‌ప్ప‌నిస‌రి

ఎంట‌ర్ ఆధార్ నంబ‌ర్ అని ఉన్న చోట 16 అంకెల ఆధార్ నంబ‌రు న‌మోదు చేయండి

త‌ర్వాత 1. ఓటీపీ ఆధారంగా 2. వేలిముద్ర ఆధారంగా అనే రెండు ఆప్ష‌న్లు వ‌స్తాయి

1. ఓటీపీని ఎంచుకున్న‌ట్ల‌యితే వారు న‌మోదిత మొబైల్, మెయిల్ ఐడీల‌కు ఓటీపీని పంపుతారు. ఓటీపీని గడిలో పూరించి వ్యాలిడేట్ ఓటీపీని నొక్కాలి. ఓటీపీ స‌రిపోలితే సైన్ అప్ పేజీలో యూజ‌ర్ నేమ్, పాస్ వ‌ర్డ్ల‌ను సృష్టించుకోవ‌చ్చు.

2. ఫింగ‌ర్ ప్రింట్‌ను ఎంచుకుంటే వినియోగ‌దారుడు ఫింగ‌ర్ ప్రింట్ యంత్రంపై వేలిముద్ర‌ను ఉంచాలి.

ఫింగ‌ర్ ప్రింట్ స‌రిపోలితే సైన్ అప్ పేజీలో యూజ‌ర్ నేమ్‌, పాస్ వ‌ర్డ్ల‌ను సృష్టించుకోవ‌చ్చు.

 4. డిజిట‌ల్ లాక‌ర్లో ధ్రువ‌ప‌త్రాల సేవింగ్ తీరు

4. డిజిట‌ల్ లాక‌ర్లో ధ్రువ‌ప‌త్రాల సేవింగ్ తీరు

జాబితాలో ఉడే ప్ర‌తి ధ్రుప‌త్రంలో ఈ కింది అంశాలు ఉంటాయి.

* ద్రుప‌త్రం పేరు

* అప్‌లోడ్ చేసిన తేదీ

* డాక్యుమెంట్ స్టేట‌స్(ఈ-సైన్ అయిందా లేదా అనే వివ‌రాలు)

* చ‌ర్య‌(డిజిట‌ల్ లాక‌ర్ నుంచి ధ్రుప‌త్రాన్ని తీసివేయడం లేదా పూర్తిగా తొల‌గించ‌డం)

* వివ‌రాలు

* షేర్ : అప్‌లోడెడ్ డాక్యుమెంట్ల‌ను ఈ-మెయిల్ ద్వారా షేర్ చేయ‌డం

* డిజిసైన్ ఆప్ష‌న్‌: ఈ-సైన్ పూర్త‌యిన ద్రుప‌త్రాల‌ను టిక్ గుర్తుతో సూచిస్తారు.

 5. డిజిలాక‌ర్ ప్రొఫైల్

5. డిజిలాక‌ర్ ప్రొఫైల్

యూఐడీఏఐ డేటాబేస్లో ఉన్న విధంగా పౌరుల గురించి పూర్తి స‌మాచారాన్ని పొందుప‌రుస్తారు.

ఇందులో పేరు,పుట్టిన తేదీ, లింగం, ఇంటి చిరునామా, ఈ-మెయిల్, మొబైల్ సంఖ్య వంటివి ఉంటాయి.

6. జారీ చేసిన వారు(My Issuer)

6. జారీ చేసిన వారు(My Issuer)

ధ్రువ‌ప‌త్రాల‌ను జారీ చేసిన సంస్థ వివ‌రాలు ఉంటాయి.

చంద్ర‌న్న బీమా ప‌థ‌కంలో ఎలా ల‌బ్దిదారులుగా చేరాలి?చంద్ర‌న్న బీమా ప‌థ‌కంలో ఎలా ల‌బ్దిదారులుగా చేరాలి?

 7. అభ్య‌ర్థించే సంస్థ‌లు

7. అభ్య‌ర్థించే సంస్థ‌లు

అభ్య‌ర్థించే సంస్థ‌ల వివ‌రాలు ఈ విభాగంలో ఉంటాయి.

మీరు అనుమ‌తిస్తేనే ఈ వివ‌రాల‌ను ఆయా ఏజెన్సీలు, సంస్థ‌లు వాడుకునేలా ఏర్పాటు ఉంటుంది.

 8. డైరెక్ట‌రీలు

8. డైరెక్ట‌రీలు

ఇక్క‌డ న‌మోదిత ప‌త్రాల ధ్రుప‌త్రాల జారీ సంస్థ‌లు, అభ్య‌ర్థించే సంస్థ‌ల వివ‌రాలు యూఆర్ఎల్‌తో స‌హా ఉంటాయి.

పిల్ల‌ల కోసం 6 ఉత్తమ పొదుపు ఖాతాలుపిల్ల‌ల కోసం 6 ఉత్తమ పొదుపు ఖాతాలు

 9. డిజిట‌ల్ లాక‌ర్లో ధ్రుప‌త్రాల అప్‌లోడింగ్‌

9. డిజిట‌ల్ లాక‌ర్లో ధ్రుప‌త్రాల అప్‌లోడింగ్‌

ధ్రువ‌ప‌త్రాల సెక్ష‌న్లో ' మై స‌ర్టిఫికెట్స్ ' అనే సెక్ష‌న్ ఎంచుకోవాలి. అందులో డాక్యుమెంట్ ర‌కాన్ని ఎంచుకోవాలి

ధ్రువ‌ప‌త్రానికి ఒక పేరు పెట్టుకోవాలి

ఎంచుకున్న డాక్యుమెంట్ రకాన్ని బ‌ట్టి, అందుకు త‌గిన వివ‌రాల‌ను న‌మోదు చేయాలి.

మీ వ్య‌క్తిగ‌త కంప్యూట‌ర్ నుంచి లాక‌ర్‌లో అప్లోడ్ చేయ‌ద‌ల‌చిన ఫైల్ను ఎంచుకోవాలి. అటువంటి ఫైల్ 1 ఎంబీ క‌న్నా త‌క్కువ సైజులోనూ. పీడీఎఫ్ లేదా జేపీఈజీ లేదా జీపీజీ లేదా పీఎన్‌జీ, బీఎంపీ లేదా జిఫ్ రూపంలో ఉండాలి.

ధ్రువ‌ప‌త్రానికి సంబంధించిన వివ‌ర‌ణ‌ల‌ను రాసుకోవాలి.

అప్‌లోడ్ బ‌ట‌న్‌ను నొక్కాలి.

మ‌న డిజిట‌ల్ లాక‌ర్ ఖాతాలో లాగ్-ఇన్(సైన్-ఇన్) అయిన‌ప్పుడు మ‌న‌కు సంబంధించిన స‌ర్టిఫికెట్ల‌ను చూసుకునేందుకు ' మై స‌ర్టిఫికెట్స్ ' అనే ఆప్ష‌న్ను ఎంచుకోవాలి. అక్క‌డ డాక్యుమెంట్ పేరు, అప్‌లోడ్ చేసిన తేదీ, షేరింగ్, ఈ-సైన్ ఆప్ష‌న్ త‌దిత‌రాలు ఉంటాయి.

 10. ధ్రువ‌ప‌త్రాల ఆన్లైన్ షేరింగ్

10. ధ్రువ‌ప‌త్రాల ఆన్లైన్ షేరింగ్

మొద‌ట షేర్ చేయ‌దల‌చుకున్న ధ్రువ‌ప‌త్రాన్ని ఎంచుకోవాలి. దాని కింద కొన్ని ఆప్ష‌న్స్ వ‌స్తాయి. ధ్రువ‌ప‌త్రంపై ఉన్న షేర్ ఆప్ష‌న్ నొక్క‌డం ద్వారా మీరు కావాల‌నుకున్న డాక్యుమెంట్‌ను షేర్ చేయ‌వ‌చ్చు.

షేర్ ఆప్ష‌న్ నొక్క‌గానే డైలాగ్ బాక్స్ మీ ముందు వ‌స్తుంది.

అక్క‌డ ఎవ‌రికి షేర్ చేయాల‌నుకుంటున్నారో వారి మెయిల్ ఐడీ ఎంట‌ర్ చేస్తే అవ‌త‌లి వారికి ధ్రువ‌ప‌త్రానికి సంబంధించిన యూఆర్‌ఐ చేరుతుంది.

11. డిజిట‌ల్ లాక‌ర్ భ‌ద్ర‌మే

11. డిజిట‌ల్ లాక‌ర్ భ‌ద్ర‌మే

డిజిలాక‌ర్ సంబంధించి అన్ని ఖాతాల‌కు త‌మ‌దైన పాస్ వ‌ర్డ్‌ల‌ను వినియోగ‌దారులే సృష్టించి ఉంటారు కాబ‌ట్టి మీ ప‌త్రాల‌న్నీ భ‌ద్రంగానే ఉంటాయి. మీరు నేరుగా ఎవ‌రికి కావాలంటే వారికి ఆన్‌లైన్లోనే ముఖ్య‌మైన ప‌త్రాల‌ను షేర్ చేయ‌వ‌చ్చు. ప్ర‌భుత్వం జారీ చేసిన ప‌త్రాల‌ను సుర‌క్షితంగా కావాల్సిన ఏజెన్సీల‌కు స‌మ‌యం వృథా కాకుండా పంపుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ప్ర‌భుత్వ అధికారులు, సంస్థ‌ల‌కు సౌల‌భ్యంగా ఉంటుంది.

Read more about: digi locker digital india
English summary

డిజిలాక‌ర్ ఉప‌యోగించి ప‌త్రాల‌ను ఆన్లైన్లో భ‌ద్ర‌ప‌రుచుకోవ‌డం ఎలా? | what is digital locker and How to use it

DigiLocker offers a dedicated personal storage space, linked to each resident’s Aadhaar number. DigiLocker can be used to securely store e-documents as well as store Uniform Resource Identifier (URI) link of e-documents issued by various issuer departments. The e-Sign facility provided as part of DigiLocker system can be used to digitally sign e-documents.
Story first published: Wednesday, December 27, 2017, 17:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X