For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అత్యంత సంప‌న్నులు ఈ 6 పెట్టుబ‌డి పొర‌పాట్లు చేయ‌రు!

అత్యంత సంప‌న్న‌వ‌ర్గాల‌కు చెందిన‌వారికి ఏదో ర‌హ‌స్య‌మైన పెట్టుబ‌డి వ్యూహం ఉంటుంద‌ని మామూలు జ‌నాలు భావిస్తారు. ఐతే సాధార‌ణంగా అలాంటిదేమీ ఉండ‌దు. సంప‌న్నులకు డ‌బ్బు గురించిన ప్రాథ‌మిక విష‌యాల‌పై మంచి

|

క‌నీసం 3 కోట్ల డాల‌ర్ల సంప‌ద ఉన్న‌వారిని అత్యంత సంపన్న‌వ‌ర్గానికి చెందిన‌వారిగా ఈ స‌మాజం గుర్తిస్తుంది. వీళ్ల సంప‌ద‌లో భాగంగా ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ సంస్థ‌ల్లో షేర్లు, స్థిరాస్తి పెట్టుబ‌డులు, క‌ళాఖండాలు, విమానాలు, కార్లు లాంటి వ్య‌క్తిగ‌త పెట్టుబ‌డులు దీంట్లో భాగం.
అత్యంత సంప‌న్న‌వ‌ర్గాల‌కు చెందిన‌వారికి ఏదో ర‌హ‌స్య‌మైన పెట్టుబ‌డి వ్యూహం ఉంటుంద‌ని మామూలు జ‌నాలు భావిస్తారు. ఐతే సాధార‌ణంగా అలాంటిదేమీ ఉండ‌దు. సంప‌న్నులకు డ‌బ్బు గురించిన ప్రాథ‌మిక విష‌యాల‌పై మంచి ప‌ట్టు ఉంటుంది. రిస్క్ ఎలా తీసుకోవాలో వారికి అవ‌గాహ‌న ఉంటుంది.

వారెన్ బ‌ఫెట్ మాట‌ల్లో చెప్పాలంటే మొద‌టి నియ‌మం డ‌బ్బును అస్స‌లు పోగొట్టుకోవ‌ద్దు. అత్యంత సంపన్న‌ప‌రులకు అద్వితీయ‌మైన శ‌క్తులేమీ ఉండ‌వు. పైగా వారికి గుప్త మంత్రాలేవీ తెలియ‌వు. దీనికి బ‌దులుగా సులువైన పెట్టుబ‌డి మార్గాలంటే వారికి బాగా తెలుసు. పొర‌పాట్లు జ‌ర‌గకుండా బాగా చూసుకోగ‌లుగుతారు. వీళ్లు సాధార‌ణంగా ఎలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తారో తెలుసుకుందాం...

1. అమెరికా, యూర‌ప్ మార్కెట్లలోనే పెట్టుబ‌డి

1. అమెరికా, యూర‌ప్ మార్కెట్లలోనే పెట్టుబ‌డి

అమెరికా, ఐరోపా దేశాలు బాగా అభివృద్ధి చెందిన‌వి. వీటిలో పెట్టుబ‌డులకు మంచి భ‌ద్ర‌త ల‌భిస్తుందనే భావన ఉంటుంది. కానీ వాస్త‌వానికి అలాంటిదేమీ ఉండ‌దు. ఇటీవ‌ల ఐరోపా స‌మాఖ్య లో నెలకొంటున్న అధిక రిస్క్ వ‌ల్ల ఈ రెండు మార్కెట్లు కాకుండా ఇత‌ర‌వాటి వైపు పెట్టుబ‌డి దారులు దృష్టి సారిస్తున్నారు.

చాలా మంది ప‌శ్చిమ‌ దేశాల్లో పెట్టుబ‌డుల‌ను కొన‌సాగిస్తూ ఉండ‌గా, అత్యంత సంప‌న్నుల ఆలోచ‌నా తీరు భిన్నంగా ఉంటుంది. వీరు వృద్ధి చెందుతున్న మార్కెట్ల దిశ‌గా దృష్టిపెడ‌తారు. వీటిలో భాగంగా ఇండొనేషియా, చిలీ, సింగ‌పూర్ లాంటి దేశాల్లో త‌మ పెట్టుబ‌డుల‌ను పెడ‌తారు. ఐతే ఇలా చేసేట‌ప్పుడు త‌మ‌కు ఆయా పెట్టుబ‌డి వ్యూహాలు త‌మ‌కు న‌ప్పుతాయా లేదా అనే విష‌యాన్ని సంప‌న్నులు చూసుకుంటూ ముందుకెళ‌తారు.

2. కేవ‌లం షేర్లు, బాండ్ల‌లోనే కాకుండా...

2. కేవ‌లం షేర్లు, బాండ్ల‌లోనే కాకుండా...

సాధార‌ణంగా పెట్టుబ‌డులు, పెట్టుబ‌డి వ్యూహాలు అన‌గానే షేర్లు, బాండ్లు గుర్తుకొస్తాయి. వీటికున్న లిక్విడిటీ, త‌క్కువ ధ‌ర‌లోనూ కొనుగోలు సౌల‌భ్య‌త వ‌ల్ల కావొచ్చేమో అన్ని స‌మ‌యాల్లో ఇవి ఉత్త‌మ‌మైన పెట్టుబ‌డి ర‌కానికి చెందిన‌వ‌ని చెప్ప‌లేం.

అత్యంత సంప‌న్నులకు భౌతికప‌ర వ‌స్తువుల విలువ గురించి తెలుసు. అందుకు త‌గిన‌ట్టే వారు కేటాయింపులు చేస్తారు. ప్రైవేట్‌, వాణిజ్య స్థిరాస్తుల్లో, బంగారం, భూమి లాంటివాటిలో పెట్టుబ‌డి పెడ‌తారు. స్థిరాస్తి ఎప్పుడూ ప్రీతిపాత్ర‌మైన పెట్టుబ‌డిగానే కొన‌సాగుతూ వ‌స్తుంది. ఇలాంటి భౌతిక‌ప‌ర ఆస్తులపై పెట్టుబ‌డులు లాభ‌దాయ‌కంగా క‌నిపించినా లిక్విడిటీ ప‌రంగా ఇవి మ‌దుప‌రుల‌కు అంత‌గా రుచించ‌వు.

సంప‌న్నులు మాత్రం లిక్విడిటీ లేని ఆస్తుల కొనుగోలుకే ఆసక్తి చూపిస్తారు. ఇవి మార్కెట్ ప్ర‌భావానికి లోనుకావు. దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డిని తెచ్చిపెట్ట‌గ‌ల‌వు. త‌మ ల‌క్ష్యాల‌కు స‌రిపోతాయా లేవా అన్న‌ది గ‌మ‌నించుకొని, ప‌రిశోధించి మ‌రీ చేస్తారు.

3. 100శాతం స్టాక్ మార్కెట్ల‌లో పెట్ట‌కుండా...

3. 100శాతం స్టాక్ మార్కెట్ల‌లో పెట్ట‌కుండా...

ప‌బ్లిక్ మార్కెట్లు లేదా అంద‌రూ సామాన్యంగా పెట్టే మార్కెట్ల‌లో 100శాతం పెట్టుబ‌డుల‌ను అత్యంత సంప‌న్నులు చేయ‌రు. చాలా మ‌టుకు సంప‌ద‌ను ప్రైవేట్ బిజినెస్‌లు చేయ‌డం ద్వారా లేదా ప్రైవేట్ ఈక్విటీలో ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్లు చేయ‌డం ద్వారా సంపాదిస్తారు.

మిట్ రోమ్నీ అనే అత్యంత సంప‌న్న వ్య‌క్తి త‌న వ్య‌క్తిగ‌త రిటైర్‌మెంట్ ఖాతాలో ఏకంగా 100 మిలియ‌న్ డాల‌ర్ల‌కు పెంచేసుకున్నాడు. ఎలా అంటే ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబ‌డుల్లో పెట్ట‌డం ద్వారా దీన్ని సాధ్యం చేసుకోగ‌లిగాడు. ఇవి కాకుండా అత్య‌ధిక రాబ‌డులు, వైవిధ్య‌మైన పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవ‌డం ద్వారా దీన్ని సుసాధ్యం చేసుకోగ‌లిగాడు.

 4. ప‌క్కవారితో పోటీప‌డ‌రు

4. ప‌క్కవారితో పోటీప‌డ‌రు

చిన్న మ‌దుప‌రులు ఏం చేస్తారంటే త‌మ ప‌క్క‌నున్నవారు దేంట్లో పెట్టుబ‌డి పెడుతున్నారు, వాళ్ల‌కు లాభాలెలా వ‌స్తున్నాయి అన్న‌దాన్ని గ‌మ‌నించి తాము అదే విధంగా లేదా క‌నీసం కొంత మొత్తంలో వారిని దాటాల‌నే ప్ర‌య‌త్నంచేస్తారు. ఈ పోటీత‌త్వం అప్ప‌టికి బాగానే అనిపించినా వ్య‌క్తిగ‌త ల‌క్ష్యాల దృష్ట్యా అంత మంచిది కాదు.

అత్యంత సంప‌న్నులు మాత్రం త‌మ వ్య‌క్తిగ‌త ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకొని దీర్ఘ‌కాల వ్యూహ‌ర‌చన చేస్తారు. ఆ త‌ర్వాతే పెట్టుబ‌డికి సంబంధించిన కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు. 5, 10 లేదా 20ఏళ్ల త‌ర్వాత ఎంత సంపాదించాల‌న్న‌ది ముందే అనుకొని పెట్టుకుంటారు. పెట్టుబ‌డి వ్యూహాన్ని ర‌చించుకొని దానికి క‌ట్టుబ‌డి ఉండిపోతారు. మార్కెట్లు ప‌డిపోయినా స‌రే త‌మ పెట్టుబ‌డుల‌ను కొన‌సాగిస్తూనే ఉంటారు. ఇదే వారి విజ‌య ర‌హ‌స్యం.

సంప‌న్నుల ప్ర‌త్యేక గుణం ఏమిటంటే వారు ఇత‌రుల‌తో పోల్చుకోరు. ఇత‌రుల‌తో పోల్చుకోవ‌డం అంటే వ‌ల‌లో చిక్కుకోవ‌డ‌మే. ప‌క్క‌నున్న‌వారు ఖ‌రీదైన కారు కొన్నార‌ని చెప్పి మ‌న‌మూ కొంటే అప్ప‌టికీ మ‌న వ్యూహాన్ని ల‌క్ష్యాన్ని కొంత స‌మ‌యానికి వాయిదా వేసుకున్న‌ట్టే. సంప‌న్నులు కొంత కాలం ఆగి వారికి త‌గిన వ‌స్తువును అప్పుడు కొంటారు.

5. వ్య‌క్తిగ‌త పోర్ట్‌ఫోలియోను స‌మీక్షించుకోక‌పోవ‌డం..

5. వ్య‌క్తిగ‌త పోర్ట్‌ఫోలియోను స‌మీక్షించుకోక‌పోవ‌డం..

వ్య‌క్తిగ‌త పోర్ట్‌ఫోలియోను క‌లిగిఉన్న‌వారు దాన్ని క‌నీసం 6 నెల‌ల‌కు ఒక సారి స‌మీక్షించుకోవ‌డం చాలా ముఖ్యం. కొంద‌రు దీని గురించి అస్స‌లు ప‌ట్టించుకోరు. త‌ర‌చూ పోర్ట్‌ఫోలియోను స‌మీక్షించి త‌గిన మార్పులు చేస్తూ ఉంటే పెట్టుబ‌డులు మంచి లాభ‌దాయ‌కంగా ఉంటాయి. కొంద‌రికి ప్ర‌త్యేక‌మైన ల‌క్ష్యాల‌తో పోర్ట్‌ఫోలియోను నిర్మించుకున్నా వాటిని అస్స‌లు స‌మీక్షించరు.

అత్యంత సంప‌న్నులకు స‌మీక్ష విలువ బాగా తెలుసు. నెల‌కు వారానికి లేదా రోజు వారి పోర్ట్‌ఫోలియోను స‌మీక్షిస్తూ త‌గిన మార్పులు చేస్తుంటారు. దీని కోసం స‌మ‌యం కేటాయించ‌లేనివారు ప్ర‌త్యేకంగా ఎవ‌రినైనా నియ‌మించుకుంటారు.

6. పొదుపు విలువ‌ను నిర్ల‌క్ష్యం చేయ‌రు

6. పొదుపు విలువ‌ను నిర్ల‌క్ష్యం చేయ‌రు

పెట్టుబ‌డిని చాలా ముఖ్య‌మైన‌దిగా భావిస్తారు. కానీ ఇదే ప‌మయంలో పొదుపు గురించి, కొంత దాచిపెట్టుకోవ‌డం గురించి పూర్తిగా మ‌ర్చిపోతారు. అదే అత్యంత సంప‌న్నులు రెండు ర‌కాల వ్యూహాల‌తో ఉంటారు. ఎక్కువ మొత్తంలో పెట్టుబ‌డి పెట్టినా కొంత మొత్తం ప‌క్క‌న పెట్టి పొదుపు చేస్తారు.

ఈ విధంగా సంప‌న్నులు త‌మ సంప‌ద‌ను దిన‌దిన ప్ర‌వ‌ర్ధ‌మానంగా ఎదిగేలా చేసుకుంటారు. ఒక్కోసారి ఏమీ లేక‌పోయినా త‌ట్టుకోగ‌లుగుతారు. ఆ త‌ర్వాత తాము అనుకున్న‌ది సాధించేందుకు ఎంతో కృషి చేస్తారు. ఎవ్వ‌రూ వూహించ‌నంత ఎత్తుకు ఎదిగి స‌మాజానికి తామేంటో చూపిస్తారు. సంప‌న్నుల‌కు ఆ దీక్షా, ప‌ట్టుద‌ల‌లు బ‌లంగా ఉంటాయి. మ‌రి మీరు అలా అవ్వాలంటే ఇలాంటి అల‌వాట్ల‌ను, సామ‌ర్థ్యాన్ని, నైపుణ్యాల‌ను పెంచుకోవాల్సిందే.

బంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలు

బంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలు

బంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలుబంగారం ధ‌ర మారేందుకు కార‌ణ‌మ‌య్యే 10 అంశాలు

సంప్ర‌దాయ పాల‌సీలు: బీమా ఏజెంట్లు చెప్ప‌ని 7 ముఖ్య‌మైన అంశాలివే!

సంప్ర‌దాయ పాల‌సీలు: బీమా ఏజెంట్లు చెప్ప‌ని 7 ముఖ్య‌మైన అంశాలివే!

సంప్ర‌దాయ పాల‌సీలు: బీమా ఏజెంట్లు చెప్ప‌ని 7 ముఖ్య‌మైన అంశాలివే!సంప్ర‌దాయ పాల‌సీలు: బీమా ఏజెంట్లు చెప్ప‌ని 7 ముఖ్య‌మైన అంశాలివే!

చంద్ర‌న్న బీమా ప‌థ‌కంలో ఎలా ల‌బ్దిదారులుగా చేరాలి?

చంద్ర‌న్న బీమా ప‌థ‌కంలో ఎలా ల‌బ్దిదారులుగా చేరాలి?

చంద్ర‌న్న బీమా ప‌థ‌కంలో ఎలా ల‌బ్దిదారులుగా చేరాలి?చంద్ర‌న్న బీమా ప‌థ‌కంలో ఎలా ల‌బ్దిదారులుగా చేరాలి?

 పెట్టుబ‌డి పెట్టేందుకు 7 చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు

పెట్టుబ‌డి పెట్టేందుకు 7 చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు

పెట్టుబ‌డి పెట్టేందుకు 7 చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలుపెట్టుబ‌డి పెట్టేందుకు 7 చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు

Read more about: money investment tips hni
English summary

అత్యంత సంప‌న్నులు ఈ 6 పెట్టుబ‌డి పొర‌పాట్లు చేయ‌రు! | 6 Investing Mistakes That the Ultra Wealthy Don't Make

When people with lower net worths look at these UHNWIs, many of them believe that the key to becoming ultra wealthy lies in some sort of secret investing strategy. However, this isn't normally the case. Instead, UHNWIs understand the basics of having their money work for them as well as understand how to take calculated risks.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X