English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

ఈ 5 ప్ర‌భుత్వ యాప్లు మొబైల్లో ఉంటే మీ ప‌నులన్నీ సులువే

Written By:
Subscribe to GoodReturns Telugu

ఆర్థిక లావాదేవీల‌ను డిజిట‌ల్ రూపంలో చేసుకోవ‌డం ద‌గ్గ‌ర నుంచి ప‌న్ను చెల్లింపుదారుల సందేహాల‌ను నివృత్తి చేయ‌డం లాంటి ప‌నులెన్నో ఈ యాప్‌లు చేస్తాయి. ఎన్నో ర‌కాల‌ ప్ర‌భుత్వ సేవ‌ల‌ను అందించే ఈ యాప్‌ల గురించి మీరు తెలుసుకోవాల్సిందే!

 ఉమంగ్‌

ఉమంగ్‌

యూనిఫైడ్ మొబైల్ అప్లికేష‌న్ ఫర్ న్యూ ఏజ్ గ‌వ‌ర్నెన్స్ క్లుప్తంగా ఉమంగ్‌. ఈ యాప్ స‌హాయంతో కేంద్ర‌, రాష్ట్ర, పుర‌పాల‌క ప్ర‌భుత్వాల సేవ‌ల‌న్నీ ఒకే చోటు నుంచి పొందొచ్చు. ప్ర‌ముఖ ప్ర‌భుత్వ సేవ‌లన్నీ ఈ యాప్ ద్వారా పొందొచ్చు. ఉద్యోగ భ‌విష్య నిధి, జాతీయ పింఛ‌ను ప‌థ‌కం, మై పాన్ ద్వారా పాన్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు,... ఇంకా డిజిలాక‌ర్‌, పింఛ‌నుదారుల పోర్ట‌ల్ విడిగా ఉంది. ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో ఫ్రీలాన్సింగ్ జాబులు ప‌డితే డిజి సేవ‌క్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

సీబీఈసీ జీఎస్‌టీ

సీబీఈసీ జీఎస్‌టీ

దాదాపు 100కు పైగా సేవ‌ల‌ను ఈ యాప్ ద్వారా యాక్సెస్ చేయ‌వ‌చ్చు. దీన్ని నేష‌న‌ల్ ఇ-గ‌వ‌ర్నెన్స్ డివిజ‌న్ , ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ‌శాఖ వారు రూపొందించారు.

ఎక్సైజ్‌, క‌స్ట‌మ్స్ కేంద్ర బోర్డు(సీబీఈసీ) వారు జీఎస్‌టీ ని ప‌న్ను చెల్లించేవారు సుల‌భంగా చేసుకునేలా ఈ యాప్‌ను రూపొందించ‌డం విశేషం. జీఎస్‌టీకి సంబంధించిన చాలా విష‌యాలు ఈ యాప్‌లో ఉంటాయి. జీఎస్‌టీకి ఎలా మార‌డం, జీఎస్‌టీ చ‌ట్టాలేం చెబుతున్నాయి, తాజా అప్‌డేట్స్‌, సాధార‌ణ సందేహాలు లాంటివెన్నో ఈ యాప్‌లో ఉంటాయి. దీని ద్వారా సీబీఈసీ హెల్ప్‌డెస్క్‌ను కూడా సంప్ర‌దించ‌వ‌చ్చు.

ఆయ‌కార్ సేతు

ఆయ‌కార్ సేతు

ప‌న్ను చెల్లింపుదారుల‌కు వ‌చ్చే ర‌క‌ర‌కాల సందేహాల‌ను నివృత్తి చేసేందుకుగాను ఆదాయ‌పు ప‌న్నుశాఖ వారు ఆయ‌కార్ సేతు అనే యాప్‌ను రూపొందించారు. లైవ్ చాట్ ఆప్ష‌న్ ద్వారా ఏమైనా సందేహాలుంటే అడ‌గొచ్చు. అంతేకాకుండా ఇన్‌క‌మ్ ట్యాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేసేందుకు, ట్యాక్స్ రిట‌ర్న్ ల‌ను సిద్ధం చేయ‌డంలో స‌హ‌క‌రించేవారు ఎక్క‌డ ఉంటారో ఈ యాప్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. ఇంకా టీడీఎస్ లెక్క‌లు, ప‌న్ను చెల్లింపులు ఎంత అవుతాయ‌న్న విషయాన్ని క‌నుక్కోవ‌చ్చు. హౌస్ రెంట్ అల‌వెన్సు పైన ప‌న్ను అర్హ‌త‌, ఇన్‌క‌మ్ ట్యాక్స్ ల‌య‌బిలిటీ, అడ్వాన్స్ ట్యాక్స్ లాంటివెంత చెల్లించాలి అన్న విష‌యాల‌న్నీ ఈ యాప్ ద్వారా సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు.

 ఎం-క‌వ‌చ్‌

ఎం-క‌వ‌చ్‌

మొబైల్ ఫోన్ల‌కు స‌మ‌గ్ర భ‌ద్ర‌త‌నిచ్చే యాప్ ఇది. వ్య‌క్తిగ‌త స‌మాచారం హ్యాకింగ్‌, మాలేవ‌ర్ దాడుల‌కు గురికాకుండా ఇది ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. వైఫై, బ్లూటూత్‌, కెమెరా, మొబైల్ డేటా లాంటి వాటి స‌హాయంతో ఇత‌రులు డేటాను దుర్వినియోగం చేయ‌కుండా కాపాడ‌గ‌లుగుతుంది. ఫోన్ చౌర్యానికి గురైతే అందులో సిమ్‌ను మార్చితే ట్రాక్ చేసే వీలుంటుంది. మ‌నం వేరే చోట ఉండి ఈ యాప్ స‌హాయంతో మ‌న ఫోన్‌లోని డేటాను డిలీట్ చేసి రీసెట్ చేయ‌వ‌చ్చు.

సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్‌(సీ-డాక్‌) వారు ఈ యాప్‌ను రూపొందించారు. ప్లే స్టోర్‌లో న‌కిలీ యాప్‌లెన్నో ఉన్నాయి కాబ‌ట్టి డౌన్‌లోడ్ చేసుకునేట‌ప్పుడు ఒరిజిన‌ల్‌దే కాదో స్ప‌ష్టంచేసుకోండి.

భీమ్‌

భీమ్‌

సునాయాసంగా ఆర్థిక లావాదేవీలు జ‌రుపుకునేందుకు ప్ర‌భుత్వం భార‌త్ ఇంట‌ర్‌ఫేస్ ఫ‌ర్ మ‌నీ(భీమ్‌) ను తీసుకొచ్చింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్(యూపీఐ)పైన ఆధార‌ప‌డి ఇది ప‌నిచేస్తుంది. త్వ‌రిత‌గ‌తిన‌, సుర‌క్షిత‌మైన, న‌మ్మ‌క‌మైన చెల్లింపుల‌కు భీమ్ యాప్‌ను ఆశ్ర‌యించ‌వ‌చ్చు. ఇందుకోసం యూపీఐ చెల్లింపు చిరునామా, ఫోన్ నంబ‌రు, క్యూఆర్ కోడ్‌లు అవ‌స‌ర‌మ‌వుతాయి. సులువుగా ఉప‌యోగించ‌డ‌మే కాకుండా దాదాపు అన్ని ప్ర‌ధాన బ్యాంకులు యూపీఐ ప్లాట్‌ఫామ్ పైన ఉన్నాయి కాబ‌ట్టి బ్యాంకు ఖాతాదారుల‌కు భీమ్ వాడ‌కం సుల‌భ‌త‌ర‌మైంది. నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)వారు ఈ యాప్ ను రూపొందించారు. డిజిట‌ల్ ఇండియాలో భాగంగా దీన్ని సృష్టించ‌డం జ‌రిగింది. దీంతో ఉన్న ఒకే ఒక్క చిక్కేమిటంటే వ‌ర్చువ‌ల్ పేమెంట్ చిరునామా అజ్ఞాతంగా క‌నిపించవ‌చ్చు. వీటిలో అస‌లువి, న‌కిలీవి గుర్తు ప‌ట్టేందుకు ఒక‌టికి రెండుసార్లు నిర్ధారించుకోవాలి.

 ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌తో సొంత ఇల్లు

ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌తో సొంత ఇల్లు

ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న‌తో సొంత ఇల్లు

 ఆన్లైన్లో ఎల్ఐసీ పాల‌సీ రుణం

ఆన్లైన్లో ఎల్ఐసీ పాల‌సీ రుణం

ఎల్ఐసీ పాలసీ హామీగా రుణాన్ని ఆన్‌లైన్‌లో పొంద‌డం ఎలా?

Read more about: apps, government
English summary

5 must have apps to make benefits from government services

From helping people carry out financial transactions digitally to resolving taxpayer queries, these five apps provide easy access to various government services
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns