For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 6 ఆర్థిక అల‌వాట్లు ఉంటే చాలు.. జీవితంలో సంతోషానికి తిరుగుండ‌దు

ఆర్థిక ప్ర‌ణాళిక అంటే అదేదో అద్భుతంగా చేయాల‌నేం కాదు. ఖ‌ర్చు, పొదుపు విష‌యంలో మ‌నం పాజిటివ్ ధోర‌ణిలో ఉండి లాభ‌దాయ‌కమైన అల‌వాట్ల‌ను అల‌వ‌ర్చుకోవ‌డ‌మే. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఆర్థిక భ‌ద్ర‌త‌, స్థిర‌త్వానికి మూలం మంచి ఆర్థిక అలవాట్లు. ఉద్యోగంలో చేరిన త‌ర్వాత సాధార‌ణంగా ఎవ‌రికైనా ఆర్థిక ప్ర‌ణాళిక మీద అంత‌గా అవ‌గాహ‌న ఉండ‌దు. ఆ త‌ర్వాత త‌ర్వాత మెల్ల‌గా డ‌బ్బు, పొదుపున‌కు సంబంధించి కొన్ని అల‌వాట్లు అల‌వ‌డ‌తాయి. క్ర‌మశిక్ష‌ణ‌తో ప్ర‌ణాళిక‌ను అమ‌లుప‌ర్చుకున్న‌ట్ల‌యితే త‌ర్వాతి జీవితంలో ఆర్థికంగా ఎడ‌బాట్లు లేకుండా బ‌త‌క‌గ‌లం.

ఆర్థిక ప్ర‌ణాళిక అంటే అదేదో అద్భుతంగా చేయాల‌నేం కాదు. ఖ‌ర్చు, పొదుపు విష‌యంలో మ‌నం పాజిటివ్ ధోర‌ణిలో ఉండి లాభ‌దాయ‌కమైన అల‌వాట్ల‌ను అల‌వ‌ర్చుకోవ‌డ‌మే. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బ‌డ్జెట్ రూపొందించుకొని క‌ట్టుబ‌డండి...

1. బ‌డ్జెట్ రూపొందించుకొని క‌ట్టుబ‌డండి...

ఆర్థిక ప్ర‌ణాళిక‌లో భాగంగా బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌నే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్థిక స్వేచ్ఛ‌కు తొలి అడుగు బ‌డ్జెట్ వేసుకోవ‌డం. బ‌డ్జెట్ అంటే ఆదాయ‌, ఖ‌ర్చుల అంచ‌నా. ఇది సాధార‌ణంగా ఒక నెల లేదా ఆరు నెల‌లు లేదా సంవ‌త్స‌రానికి పరిమిత‌మై ఉంటుంది. ఫిక్స్‌డ్ బ‌డ్జెట్ గనుక పెట్టుకుంటే ఆర్థిక ల‌క్ష్యాలేమైనా పెట్టుకుంటే సుల‌భంగా చేరుకోగ‌లం.

కాబ‌ట్టి మీకు అనువైన బ‌డ్జెట్‌ను రూపొందించుకోగ‌ల‌రు...

నెల‌వారీ ఆదాయంః మీ రెగ్యుల‌ర్ ఇన్‌క‌మ్ ఎంత‌? అద‌న‌పు ఆదాయం ఏమైనా వ‌స్తుందా? వ‌డ్డీ రూపంలో, లేదా అద్దెల రూపంలో ఆదాయం అందుకుంటున్నారా? లాంటివ‌న్నీ క‌లిపి రాసుకోవాలి.

నెల‌వారీ ఖ‌ర్చులుః ఇంటి అద్దె, మొబైల్ బిల్లు, క‌రెంటు బిల్లు, లోన్ ఈఎమ్ఐలు, స‌రుకులు, బ‌ట్ట‌లు, వినోదం లాంటివాటికి ఎంత‌వుతుంది?

నెల‌వారీ పొదుపుః ప్ర‌తి నెల వాస్త‌వంగా ఎంత వ‌ర‌కు పొదుపు చేయ‌గ‌లుగుతున్నారు?

వీలును బ‌ట్టి అనుకూల‌త‌ను బ‌ట్టి బ‌డ్జెట్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకోవ‌డం స‌హేతుకమే. బ‌డ్జెట్ అంటూ రూపొందించుకోక‌పోవ‌డం మాత్రం ఆమోద యోగ్యం కాదు.

2. ప‌రిమితుల్లో బ‌తికేలా..

2. ప‌రిమితుల్లో బ‌తికేలా..

ప‌రిమితిలో బ‌త‌కడానికి నేర్చుకోవాలి. ఈ అలవాటు గ‌నుక లేక‌పోతే ఆర్థిక ఇబ్బందుల్లో ప‌డేందుకు ఎక్కువ అవ‌కాశం ఉంది. ఎక్కువ సంపాదించి త‌క్కువ ఖ‌ర్చుపెట్టాలి. దీన్ని ఎంత తొంద‌ర‌గా అల‌వ‌ర్చుకుంటే అంత సంతోష‌క‌ర‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌గ‌లం.

చిన్న చిన్న ఖ‌ర్చుల‌తో జాగ్ర‌త్త‌. ప‌డ‌వ‌లో చిన్న రంధ్రం కూడా మునిగేలా చేయ‌గ‌ల‌దు అని బెన్జ‌మిన్ ఫ్రాంక్లిన్ అనే తత్వ‌వేత్త అన్నారు.

ప‌రిమితుల్లో బ‌త‌క‌డం అంటే...

భావోద్వేగాల ప్ర‌భావంతో అన‌వ‌స‌ర‌మైన కొనుగోళ్లు చేయ‌డం త‌గ్గించాలి.

క్రెడిట్ కార్డు వాడ‌కాన్ని తగ్గించాలి.

ఖ‌ర్చుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తుండాలి.

త‌క్కువ ఖ‌ర్చు చేయ‌డం అల‌వాటు చేసుకున్నాక.. భ‌విష్య‌త్ గురించి కొంత సొమ్ము దాచిపెట్టుకోవ‌డం అల‌వాటు అవుతుంది.

3. స‌మ‌యానికి బిల్లుల చెల్లింపు

3. స‌మ‌యానికి బిల్లుల చెల్లింపు

ఇది చాలా చిన్న విష‌యంలా అనిపిస్తుంది.కానీ ఆర్థిక జీవితంలో ఇదే చాలా ముఖ్యమైన‌ది. ఒక్కోసారి మ‌న బ‌ద్ధ‌కం వ‌ల్ల లేదా స‌మ‌యాభావం వ‌ల్ల ప‌నులు ఆల‌స్య‌మ‌వుతుంటాయి. స‌కాలంలో బిల్లులు చెల్లించ‌డం మంచి అల‌వాటు. ఇది ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ను తీసుకురావ‌డ‌మే కాదు ఒక నిబ‌ద్ధ‌త క‌లిగేలా చేయ‌గ‌లుగుతుంది.

ఆల‌స్య రుసుముల‌తో, పెనాల్టీల‌తోనూ బిల్లులు క‌ట్ట‌వ‌చ్చు. అదేమంత ఎక్కువ‌గా క‌నిపించ‌దు. కానీ ఆ కాస్త ఎక్కువ కూడా ఎందుకు ఖ‌ర్చు పెట్టాలి. స‌రైన నిర్వ‌హ‌ణ‌తో దాన్ని త‌ప్పించుకోలేమా?

స‌కాలంలో బిల్లు చెల్లించేందుకు చాలా మార్గాలున్నాయి... మొబైల్ ఫోన్‌లో రిమైండ‌ర్ పెట్టుకోవ‌డం, చెల్లింపుల‌ను స్వ‌యం చ‌లితం(ఆటోమేట్) చేసుకోవ‌డం, ఖాతాల‌ను క్ర‌మంగా ప‌రిశీలిస్తూ ముఖ్య‌మైన బిల్లులుంటే చెల్లించేసేయ‌డం.

4. అప్పు చేయ‌కుండా...

4. అప్పు చేయ‌కుండా...

అప్పు దొరికించుకోవ‌డం ఈ రోజుల్లో పెద్ద విష‌య‌మేమీ కాదు. మ‌న ఆదాయం కంటే ఎక్కువ‌గా ఖ‌ర్చు పెట్ట‌డం మొద‌లుపెడితే ఇక స్నేహితుల నుంచో లేదా బ్యాంకు నుంచో రుణం పొందాల‌ని చూస్తుంటాం. చెప్పాలంటే మ‌న ప‌రిమితికి మించి జీవిస్తున్నాం లేదా ఖ‌ర్చు చేస్తున్నట్టు లెక్క‌.

అప్పును సాధ్య‌మైనంత వ‌ర‌కు తీసుకోకుండా ఉండాలి. అప్పుడే మ‌న ఆర్థిక ప‌రిస్థితిలో మెరుగుప‌డుతుంది. ఏదైనా అప్పు గ‌నుక చేసిన‌ట్ట‌యితే తొంద‌ర‌గా తీర్చ‌డానికి ప్ర‌య‌త్నించాలి. క్రెడిట్ కార్డు లాంటి బిల్లులు లేదా ఇత‌ర ఏ రుణ‌మైనా స‌రే సాధ్య‌మైనంత వ‌ర‌కు తొంద‌ర‌గా వ‌దిలించుకోవ‌డానికి ప్ర‌యత్నించాలి.

5. అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటు

5. అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటు

అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటును కేవ‌లం ఒక ఆర్థిక అల‌వాటుగా భావించ‌కండి. ఆప‌ద స‌మ‌యంలో ఇదే అండ‌గా నిల‌బ‌డుతుంది. ఎప్పుడో ఒక‌సారి ప్ర‌తి ఒక్క‌రూ ఆర్థిక అత్య‌వ‌స‌రాన్ని ఎదుర్కోవ‌డం స‌హ‌జం. ఇలాంట‌ప్పుడే ఎంతో కొంత సొమ్ము ముందే దాచిపెట్టుకొని ఉంటే క‌ష్ట‌కాలంలో ఆర్థికంగా స‌హాయక‌రంగా ఉంటుంది.

అత్య‌వ‌స‌ర నిధి మ‌న‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు రెడీగా అందుబాటులో ఉండాలి. వైద్య‌ప‌రంగా అత్య‌వ‌స‌రం ఏర్ప‌డితే తొంద‌ర‌గా డ‌బ్బు తీసుకోగ‌ల‌గాలి.

ఇందుకోసం కొంత డ‌బ్బును పొదుపు ఖాతాలో ఉంచుకోవ‌డంతో పాటు మ‌రి కొంత ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో, లిక్విడ్ డెట్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఉంచుకోవాలి. 4 నుంచి 6 నెల‌ల ఖ‌ర్చుల‌కు స‌రిపోను అత్య‌వ‌స‌ర నిధిని జ‌మ‌చేసుకోగ‌ల‌గితే బాగుంటుంది. ఆ త‌ర్వాత దీర్ఘ‌కాల ల‌క్ష్యాల కోసం పెట్టుబ‌డిని ప్రారంభించుకోవ‌చ్చు.

6. ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌

6. ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌

ఆర్థిక అల‌వాటే కాదు .. ఆర్థిక పోర్ట్‌ఫోలియోలో భాగంగా ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక ఉండ‌టం ఎంతో అవ‌స‌రం. దీర్ఘ‌కాల ల‌క్ష్యంగా రిటైర్‌మెంట్ ప్లానింగ్‌ను చేసుకోవాలి. చిన్న వ‌య‌సులోనే ప్ర‌ణాళిక వేసుకొని పెట్టుబ‌డులు ప్రారంభిస్తే త‌ర్వాత కాలంలో మంచి ఫ‌లితాల‌ను అందుకోగ‌లుగుతాం. పెట్టిన పెట్టుబ‌డిపై చక్ర‌వ‌డ్డీ ప్ర‌భావం బాగుంటుంది.

కొంచెం కొంచెంగా పొదుపు చేయ‌డం ఇప్ప‌టినుంచే అల‌వాటు చేసుకోగ‌లిగితే రిటైర్‌మెంట్ నాటికి మంచి నిధి జ‌మ అవుతుంది. ఎంత తొంద‌ర‌గా ఈ విష‌యంలో ప్లానింగ్ వేసుకుంటే అంత ఎక్కువ బెనిఫిట్స్ పొంద‌గ‌లుగుతాం.

కొంచెం ఆల‌స్యంగా పొదుపు మొద‌లుపెట్టేదానికి, ముందుకు ముందే పెట్టుబ‌డి ప్రారంభించేదానికి చాలాతేడా ఉంటుంది. దీర్ఘ‌కాలంలో మంచి సంప‌ద పోగ‌వుతుంది.

ఆర్థిక ప్ర‌ణాళిక‌లో ముఖ్య‌మైన‌ది ఏమిటంటే అన్ని అంశాల‌ను ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో పేర్చుకోవ‌డం. ఇది మీ అంత మీరు చేసుకుంటారా లేక ఎవ‌రైనా నిపుణుడి స‌హాయం తీసుకుంటారా అనేది మీ ఇష్టం. నిపుణుడి స‌ల‌హాలు తీసుకుంటే మాత్రం మంచి ప్ర‌ణాళిక త‌యార‌వుతుంది. మీకు మీరే చేసుకుంటే రాంగ్ స్టెప్ తీసుకునేందుకు అవ‌కాశాలున్నాయి. ఆ త‌ర్వాత కోలుకునేందుకు స‌మ‌యం ప‌టొచ్చు. స‌రైన అవ‌గాహ‌న ఉంటే ఎవ‌రి స‌హాయం లేకుండా మంచి ఆర్థిక ప్ర‌ణాళిక వేసుకోవ‌చ్చు.

చివ‌ర‌గా...

చివ‌ర‌గా...

మ‌నంద‌రికీ మంచి ఆర్థిక అల‌వాట్లు నేర్చుకోని, బాగా స్థిర‌ప‌డాల‌ని ఎన్నో కోరిక‌లుంటాయి. వీటిని సాధించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. దృఢ చిత్తంతో క్ర‌మమైన ఆర్థిక ప్ర‌ణాళిక వేసుకొని స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంటే విజ‌యం సాధించ‌గ‌లుగుతాం.

బెట‌ర్‌మెంట్ కోసం ప్ర‌య‌త్నించేట‌ప్పుడు ఆర్థిక అలవాట్ల‌ను మార్చుకోవ‌డానికి ఇప్ప‌టికైనా మించిపోయిందేమీ లేదు. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకోగ‌లిగితే ఆర్థిక స్వేచ్ఛ దిశ‌గా మంచి అడుగులు ప‌డ‌తాయన‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఆర్థికంగా జీవితంలో ఎదిగేందుకు ఈ 6 అల‌వాట్లను నిత్య జీవితంలోమ‌మేకం చేసుకోవాలి. అప్పుడే విజ‌యం సాధించ‌గ‌లుగుతాం.

Read more about: financial plan financial habits
English summary

ఈ 6 ఆర్థిక అల‌వాట్లు ఉంటే చాలు.. జీవితంలో సంతోషానికి తిరుగుండ‌దు | 6 financial habits for successful people to live happily

Many people wonder how they can become highly successful, not realizing that they hold within them everything they need to achieve all of the success they desire.Good financial habits are the building blocks of your financial stability and financial security. Financial habits simply implies to making small changes in the way you manage your personal finances.When I got into my first job,I was not much aware about the personal finance world. Slowly and gradually, the picture became more clear and the financial habits that I adopted few years back, are still helping me to handle my finances in a better and a disciplined way.
Story first published: Friday, November 17, 2017, 17:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X