For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీలునామా రాసే వారు తెలుసుకోవాల్సిన ముఖ్య విష‌యాలు

జీవితంలో నిరంత‌ర‌ మార్పు, జీవిత‌ అంతం ఈ రెండు మాత్రం తప్పకుండా ఉంటాయి. అందుకే మరణం తర్వాత ఏర్పాట్లకు సంబంధించిన పనులన్నీ వాయిదా వేసుకోకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఒక మార్గ సూచీని కి

|

ఇప్పుడు వ‌ర్థ‌మాన దేశం అయిన భారత్‌లో కూడా చాలా మంది ప్ర‌ణాళిక బ‌ద్దంగా ఉండేందుకు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక విష‌యాల్లో ఇలాంటి ప్ర‌ణాళిక అవ‌స‌రం. ఆస్తి ఎంత సంపాదించినా మ‌న త‌ర్వాత స‌క్ర‌మంగా ఉప‌యోగం అవ‌క‌పోతే అది వృథా కిందే లెక్క‌. చావు గురించి ఆలోచించడం, అనుకోకుండా తనకు మరణం సంభవిస్తే కుటుంబం ఏమవుతుందో.. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుందో అని ఊహించుకోవడం సహజమైన విషయమే.

జీవితంలో ఏదీ కచ్చితంగా ఉండదు. కానీ జీవితంలో నిరంత‌ర‌ మార్పు, జీవిత‌ అంతం ఈ రెండు మాత్రం తప్పకుండా ఉంటాయి. అందుకే మరణం తర్వాత ఏర్పాట్లకు సంబంధించిన పనులన్నీ వాయిదా వేసుకోకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఒక మార్గ సూచీని కింద ఇస్తున్నాం.

వీలునామా రూపొందించేందుకు ముందు మీ దగ్గర ఈ కింది ప్రశ్నలకు జవాబు ఉండాలి:

వీలునామా రూపొందించేందుకు ముందు మీ దగ్గర ఈ కింది ప్రశ్నలకు జవాబు ఉండాలి:

మీపై ఆధార‌ప‌డిన‌ వ్యక్తుల పట్ల మీకు బాధ్యత ఉందని మీరు భావిస్తారా?

కారు, బైక్, పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా ప్రయాణాలు చేస్తారా?

మీ పని/ఉద్యోగం సులభమైనదా లేక ఒత్తిడితో కూడుకుందా?

ఫైనాన్షియల్ ఎసెట్స్‌పై పెట్టుబడులు చేశారా?

ఇల్లు వంటి స్థిరాస్తులు ఉన్నాయా?

మీకు యువకులు, మైనర్ పిల్లలు ఉన్నారా?

మీరు, మీ భార్య ఒకేసారి మరణిస్తే?

మీరు ఆర్జన సామర్ధ్యం కోల్పోతే?

జీవితం అంటే రిస్క్ అని భావిస్తున్నారా?

మీరు లేకుండా మీ భాగస్వామి ఆస్తులను నిర్వహణ చేయగలరా?

ఎస్టేట్ ప్లానింగ్ అవ‌స‌రం ఏమిటి?

ఎస్టేట్ ప్లానింగ్ అవ‌స‌రం ఏమిటి?

చాలామంది వ్యక్తులు తమ తదనంతరం ప్రణాళికకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. తమకు ఇంకా అంత వయసు రాలేదని, లేదా అంత ధనవంతులం కాదని అనుకుంటూ ఉంటారు. కానీ సామర్ధ్యం కోల్పోవడం, విడాకులు, హఠాన్మరణం, వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు వంటివి నియంత్రించలేని పరిస్థితులకు దారి తీస్తాయి. సంర‌క్ష‌కులుగా ఎవరు ఉండాలనే విషయాన్ని ముందుగా నిర్ణయించకపోతే, మైనర్ పిల్లలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలకు సంరక్షకులు కాకుండా, మీ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని భావించే వారి చేతులకు వెళ్లిపోయే ఆస్కారం ఉంటుంది.

 మీరిక్క‌డ.. పిల్ల‌లు విదేశాల్లో ఉంటే

మీరిక్క‌డ.. పిల్ల‌లు విదేశాల్లో ఉంటే

పిల్లలు విదేశాల్లో ఉండే సీనియర్ సిటిజన్స్‌కు రోజూ హెల్త్‌కేర్ అసిస్టెన్స్ అవసరం ఉండచ్చు. కానీ సుదూర ప్రాంతాల్లో ఉండడంతో, దీన్ని నిర్వహించడం కష్టమవుతుంది.

అన్ని రకాల ఆదాయ వర్గాలకు, ఫ్యామిలీ గ్రూప్స్‌కు వయసుతో సంప‌ద ఎంత ఉంద‌నే దానితో సంబందం లేకుండా ఎస్టేట్ ప్లానింగ్ అవసరం. ప్రణాళిక లేకపోతే, మీ వారసులకు స్థానికంగా అమలులో ఉన్న చట్టాల ప్రకారం మీ ఆస్తిని పంచుతారు. అదే ప్రణాళిక ఉన్నట్లయితే, మీరు నిర్దేశించిన ప్రకారం ఆస్తుల పంపకం జరుగుతుంది.

మరణానంతర ప్రణాళిక ఎందుకు ముఖ్యమంటే:

మరణానంతర ప్రణాళిక ఎందుకు ముఖ్యమంటే:

లబ్ధిదారులు & ప్రయోజనాలను నిర్వచించడం: ఎస్టేట్ ప్లాన్ ద్వారా లబ్ధిదారులను, వారికి దక్కాల్సిన ప్రయోజనం మొత్తాన్ని మీరు ఎంచుకోవచ్చు. మీరు కోరుకున్న ప్రకారమే ఆస్తులను బదలాయింపు ఉండాలని సూచించవచ్చు.

కుటుంబ ఆస్తులను నిలుపుకోవడం: సహజంగా కుటుంబాలు తమ సొంత కుటుంబ సభ్యులు ఆర్థికంగా పటిష్టంగా ఉండాలని కోరుకుంటాయి. వీలునామా లేకపోతే, మీ వారసులు ముందుగా చనిపోయినపుడు, వారి భాగస్వాములకు ఆస్తి దక్కుతుంది. విడాకుల కేసుల్లో సగం ఆస్తి వారికి వెళ్లిపోతుంది. అదే, మరణానంతరాన్ని ప్లాన్ చేసుకుంటే, కుటుంబాలు-ఆస్తులు విచ్ఛిన్నం కాకుండా ఉండేలా ట్రస్ట్ లాంటిది ఏర్పాటు చేయవచ్చు.

మైనర్ లబ్ధిదారులకు మీరు ఒక సంరక్షకుడిని నామినేట్ చేయవచ్చు. మీ జీవిత భాగస్వామి, పిల్లలు ఆర్థికంగా నిలబడేందుకు ఆర్థిక భద్రత అవసరం. ఒక వీలునామా, ఒక జీవిత బీమా ఉండడం ద్వారా, మీరు లేని పరిస్థితుల్లో కూడా మీ కుటుంబం ఆర్థిక భద్రతను పొందుతుంది.

వ్యాపారం యాజమాన్యం, వ్యక్తిగత ఆస్తులను వ్యాపార ఆస్తుల నుంచి వేరుగా ఉంచడం: హఠాన్మరణం వంటి వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంపై యాజమాన్యంతో పాటు వ్యక్తిగత ఆస్తులను కోల్పోయే అవకాశం ఉంటుంది. వీలునామా ద్వారా మీ ఆస్తులకు భద్రత కల్పించవచ్చు.

Read more about: will assets net worth
English summary

వీలునామా రాసే వారు తెలుసుకోవాల్సిన ముఖ్య విష‌యాలు | Things to know before writing a will in India

Creating and registering a Will is more important than creating assets for the loved ones. In India, many tend to fail in taking this step. Registering a Will will help to pass on the wealth to the respective ones of your choice without any trouble.
Story first published: Monday, October 16, 2017, 15:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X