For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుణం తీసుకుని పై చ‌దువులు చ‌ద‌వ‌డం ఎలా?

ఐబీఏ ఏప్రిల్ 2001లో విద్యా రుణ ప‌థ‌కాన్ని ప్రారంభించింది. ఈ ప‌థ‌కం ద్వారా బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీల‌కే విద్యార్థుల‌కు సులువుగా రుణాలివ్వాలి. చ‌దువు కోసం బ్యాంకు రుణాల గురించి మ‌రింత వివ‌రంగా తెలుసుకో

|

ద‌శాబ్ద కాలం ముందువ‌ర‌కూ చ‌దువుల విష‌యాన్ని ముఖ్యంగా ఉన్న‌త చ‌దువుల కోసం అయ్యే ఖ‌ర్చు గురించి పెద్ద‌గా ఆలోచించే అవ‌స‌రం ఉండేది. ఎక్కువ‌గా ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో ఎక్కువ మంది చ‌దువుకునేవారు. విద్య కూడా ఎప్పుడైతే వ్యాపారం అయిందో అప్పుడే ఉన్న‌త విద్య సామాన్యుల‌కు అంద‌నంత ఎత్తులోకి పోయింది. ఆరోగ్యం త‌ర్వాత అంత ఎక్కువ‌గా ఖ‌ర్చయ్యేది ఉన్న‌త చ‌దువుల‌కే.
వ్య‌క్తి జీవితంలో విద్య‌కు ఎంత ప్రాముఖ్య‌త‌నిస్తున్నారో అంద‌రికీ తెలుసు. ఆర్థిక ఇబ్బందుల వ‌ల్ల చ‌దువుల‌కు ఆటంకం క‌ల‌గ‌కూడ‌దు. విద్య‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం విద్యా రుణాల‌ను ప్రోత్స‌హిస్తోంది. ప్ర‌భుత్వ ఆశయాల‌కు అనుగుణంగా ఆర్బీఐ అనుమ‌తితో భార‌తీయ బ్యాంకుల స‌మాఖ్య‌(ఐబీఏ) ఏప్రిల్ 2001లో విద్యా రుణ ప‌థ‌కాన్ని ప్రారంభించింది. ఈ ప‌థ‌కం ద్వారా బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీల‌కే విద్యార్థుల‌కు సులువుగా రుణాలివ్వాలి. చ‌దువు కోసం బ్యాంకు రుణాల గురించి మ‌రింత వివ‌రంగా తెలుసుకుందాం.

1. విద్యా రుణాలకు అర్హ‌త‌లు

1. విద్యా రుణాలకు అర్హ‌త‌లు

* విద్యార్థులంతా త‌ప్ప‌నిస‌రిగా భార‌తీయ పౌర‌స‌త్వం క‌లిగి ఉండాలి.

* ఏదైనా ప్రొఫెష‌న‌ల్ లేదా టెక్నిక‌ల్ కోర్సులో ప్ర‌వేశ ప‌రీక్ష ద్వారా అనుమ‌తి పొంది ఉండాలి.

* విద్యార్థి వ‌య‌సుతో సంబంధం లేదు

* విద్యార్థి అక‌డ‌మిక్ ట్రాక్ రికార్డు బాగా ఉండాలి

* త‌ల్లిదండ్రుల‌కు లేదా సంర‌క్షుల‌కు స్థిర‌మైన ఆదాయం ఉంటే మంచిద‌ని బ్యాంకు నిపుణులు చెబుతారు.

* స్వ‌దేశంలో కానీ విదేశాల్లో కానీ గుర్తింపు పొందిన విశ్వ‌విద్యాల‌యంలో అడ్మిష‌న్ రావాలి.

2. బ్యాంకు నుంచి ఎంత మేర‌కు రుణం పొంద‌వ‌చ్చు?

2. బ్యాంకు నుంచి ఎంత మేర‌కు రుణం పొంద‌వ‌చ్చు?

* విద్యార్థులు లేదా వారి త‌ల్లిదండ్రులు ఎంత‌మేర‌కు రుణాన్ని చెల్లించ‌గ‌ల‌రు అనేదాన్ని బ‌ట్టి

స్వ‌దేశంలో అయితే- గ‌రిష్టం రూ. 10 లక్ష‌లు

విదేశంలో అయితే- గ‌రిష్టం రూ.20 లక్ష‌ల వ‌ర‌కూ

3. మార్జిన్

3. మార్జిన్

రూ. 4 లక్ష‌ల వ‌ర‌కూ ఏమీ లేదు.

రూ.4 ల‌క్ష‌లు ఆ పైన‌- స్వ‌దేశంలో అయితే 5 శాతం, విదేశాల్లో చ‌దువుకు 15 శాతం.

బ్యాంకు మంజూరు చేసే రుణంలో ఆయా శాతాల మేర‌కు విద్యార్థి స‌మ‌కూర్చుకోగ‌ల‌గాలి.

4. ప్ర‌త్యామ్నాయ హామీ:

4. ప్ర‌త్యామ్నాయ హామీ:

రూ. 4 లక్ష‌ల వ‌ర‌కూ తీసుకునే విద్యా రుణాల‌కు ఎలాంటి ప్ర‌త్యామ్నాయ ఆస్తి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నక్క‌ర్లేదు. రూ. 4 ల‌క్ష‌ల నుంచి రూ.7.5 ల‌క్ష‌ల వ‌ర‌కూ విద్యార్థి భ‌విష్య‌త్తు ఆదాయంతో పాటు థ‌ర్డ్ పార్టీ హామీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. రూ. 7.5 ల‌క్ష‌ల‌పైన రుణాల‌కు ఏదైనా ప్ర‌త్యామ్నాయ ఆస్తిని త‌న‌ఖా ఉంచాల్సి వ‌స్తుంది.

ఈ ప‌రిమితులు బ్యాంకుల‌ను బ‌ట్టి మారుతుంటాయి.

5. వ‌డ్డీ రేట్లు ఎలా ఉంటాయి.?

5. వ‌డ్డీ రేట్లు ఎలా ఉంటాయి.?

ప్ర‌స్తుతం చాలా బ్యాంకుల వ‌డ్డీ రేట్లు 10.25% నుంచి 13.25 శాతం వ‌ర‌కూ ఉన్నాయి.

ఈ వడ్డీ రేటు చ‌దువు, విద్యా సంస్థ‌, తీసుకునే రుణ మొత్తం బ‌ట్టి మారుతూ ఉంటుంది.

6. మార‌టోరియం లేదా హాలిడే పీరియ‌డ్:

6. మార‌టోరియం లేదా హాలిడే పీరియ‌డ్:

ఈ స‌మ‌యంలో తీసుకున్న రుణంపై వ‌డ్డీ పెరుగుతూ ఉంటుంది. రుణ గ్ర‌హీత నుంచి చెల్లింపులు ఉండ‌వు. ఇది కోర్సు స‌మ‌యాన్ని క‌లుపుకొని ఉద్యోగంలో చేరు వ‌రకూ లేదా కోర్సు త‌ర్వాత ఆరు నెల‌ల నుంచి ఏడాది వ‌ర‌కూ. వీటిలో ఏది త్వ‌ర‌గా ఉంటే దాన్నే హాలిడే పీరియ‌డ్‌గా ప‌రిగ‌ణిస్తారు.

7. రుణం చెల్లించ‌డానికి ఇచ్చే స‌మ‌యం

7. రుణం చెల్లించ‌డానికి ఇచ్చే స‌మ‌యం

హాలిడే పీరియ‌డ్ త‌ర్వాత 5 నుంచి 7 ఏళ్ల లోగా రుణాన్ని తీర్చ‌వ‌ల‌సి ఉంటుంది.

రుణంపై విధించిన వ‌డ్డీని క‌లుపుకొని ఈఎంఐల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

8. రుణం పొందేందుకు కావాల్సిన ప‌త్రాలు

8. రుణం పొందేందుకు కావాల్సిన ప‌త్రాలు

అర్హ‌త ప‌రీక్ష మార్కుల ప‌త్రం(ఉదాహ‌ర‌ణ‌కు ఎంసెట్ మార్క్ కార్డు)

చేర‌బోయే క‌ళాశాల అనుమ‌తి ప‌త్రం

ఫీజులు, ఇత‌ర‌త్రా ఖ‌ర్చుల అంచ‌నా

కేవైసీ ప‌త్రం, రెండు లేదా మూడు ఫోటోలు, గుర్తింపు, చిరునామా ప‌త్రాలు

9. విద్యారుణంపై తెలుగు గుడ్‌రిట‌ర్న్స్ అభిప్రాయం

9. విద్యారుణంపై తెలుగు గుడ్‌రిట‌ర్న్స్ అభిప్రాయం

విద్యా రుణం పొందే విధానాన్ని ప్ర‌భుత్వం చాలా సుల‌భ‌త‌రం చేసింది. ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు ఈ ర‌క‌మైన రుణాలిచ్చేందుకు ప్రాముఖ్య‌తనిస్తాయి. విద్యా రుణం తీసుకున్న వారి త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కుల‌కు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80ఈ ప్రకారం వ‌రుస‌గా ఎనిమిదేళ్ల వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. ప్ర‌స్తుతం ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం రుణ మొత్తానికి, రుణ కాలావ‌ధికి క‌లిపి విద్యార్థికి బీమా తీసుకునేలా బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. ఏది ఏమైనా విద్యా రుణం తీసుకుని చ‌ద‌వ‌డం వ‌ల్ల విద్యార్థిలో బాధ్య‌త పెరుగుతుంది. ఉద్యోగంలో చేరి త్వ‌ర‌గా విద్యారుణం తీర్చాల‌నే ఆలోచ‌న క‌లిగి చ‌దువులో రాణించేందుకు ప్ర‌య‌త్నిస్తారు.

Telugu.goodreturns.in

English summary

రుణం తీసుకుని పై చ‌దువులు చ‌ద‌వ‌డం ఎలా? | How to apply for education loan in India for higher education

The Educational Loan Scheme outlined below aims at providing financial support from the banking system to meritorious students for pursuing higher education in India and abroad.The main emphasis is that a meritorious student, though poor, is provided with an opportunity to pursue education with the financial support from the banking system with affordable terms and conditions.
Story first published: Sunday, October 15, 2017, 7:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X