English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

వ్య‌వ‌సాయ రంగంలో ఉన్న స్టార్ట‌ప్‌లు

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

భార‌త‌దేశంలో ఎక్కువ మంది వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డి ప‌నిచేస్తున్నారు. కానీ అందులో ఎక్కువ ఆదాయం రావడం లేదు. అందుకే ఏటేటా ప్ర‌భుత్వాలు ఎన్ని ప‌థ‌కాలు ప్ర‌క‌టిస్తున్నా రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డం ఆగ‌డం లేదు. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చీవాట్లు పెట్టినా ప్ర‌భుత్వాలు దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌లు ఆలోచించ‌డం లేదు. రైతు చ‌నిపోతే రైతుకు ఎంతో ఆర్థిక సాయం ప్ర‌క‌టిస్తున్న సంద‌ర్భాలే ఎక్కువ‌. ఈ వైఖ‌రి క‌చ్చితంగా మారాల్సిందేన‌ని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ప్ర‌భుత్వ ప్రాధాన్యాలు మ‌రెవో ఉన్న‌ప్పుడు రైతును త‌న కాళ్ల మీద నిల‌బ‌డేలా ప్ర‌భుత్వాలు ఏదో చేస్తాయ‌ని ఆశించ‌డం త‌ప్పులా క‌నిపిస్తోంది. అయితే అంద‌రూ అలానే చింతిస్తూ కూర్చోరు. వ్య‌వ‌సాయంతో సంబంధం ఉన్నా లేక‌పోయినా వీళ్లంతా వైవిధ్యంగా ఆలోచించారు. రైతు ఆదాయం పెరిగేలా, మార్కెటింగ్ అవ‌కాశం మెరుగుప‌డేలా ప్ర‌య‌త్నాలు చేశారు. దేశంలో స్టార్ట‌ప్ ప్ర‌భంజ‌నం కొన‌సాగుతున్న ఈ రోజుల్లో వ్య‌వ‌సాయానికి సంబంధించిన స్టార్ట‌ప్‌ల‌ను మొద‌లుపెట్టారు. ప్రారంభించ‌డం మాత్రం సులువే. కానీ ఎన్నో బాలారిష్టాల‌ను ఎదుర్కొని విజ‌యంత‌మైన అగ్రి స్టార్ట‌ప్‌ల గురించి ఇక్క‌డ తెలుసుకుందాం.

అగ్రిహ‌బ్‌

అగ్రిహ‌బ్‌

దిఅగ్రిహ‌బ్‌.కామ్ సంప్ర‌దాయ వ్య‌వ‌సాయ ప‌ద్ద‌తుల‌ను, ఆధునిక సాంకేతిక‌తను ముడిపెట్టేందుకు చేసిన ఒక చిరు ప్ర‌య‌త్నం. ఈ స్టార్ట‌ప్ ఏ నిజ‌మైన వ్యాపారులు, కంపెనీల‌ను, డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను రైతుల‌తో అనుసంధానిస్తుంది. ఈ స్టార్ట‌ప్ 2016లో రూ. 10 ల‌క్ష‌ల నిధుల‌తో ప్రారంభమై ప్ర‌స్తుతం అంచెలంచెలుగా ఎదుగుతున్న‌ది. పూర్తిగా ప‌ట్ట‌ణ స్థాయి క‌లిగిన టౌన్లు, న‌గ‌రాల్లో ట్రేడ‌ర్ల‌కు కొత్త వ్య‌వసాయ యంత్ర ప‌రికరాల గురించి తెలియ‌డం పెద్ద స‌మ‌స్య ఏమీ కాదు. అదే టైర్‌-2, టైర్‌3 న‌గ‌రాల విష‌యానికి వ‌స్తే కొత్త సాంకేతిక‌త గురించి తెలియాలంటే చాలా క‌ష్టాలు ప‌డాల్సి వ‌స్తుంది. మామూలుగా అయితే వారు అగ్రిక‌ల్చ‌ర్ ఎగ్జిబిష‌న్ల‌కు వెళ్లాల్సిందే. ఈ క‌ష్టాన్ని ఈ వెబ్‌సైట్ త‌గ్గిస్తోంది.

ఈ కంపెనీ రైతుల కోసం ఒక టోల్‌ఫ్రీ నంబ‌రును సైతం నిర్వ‌హిస్తోంది. వెబ్‌సైట్ కోసం అగ్రిహ‌బ్‌

డిజిట‌ల్ గ్రీన్‌

డిజిట‌ల్ గ్రీన్‌

డిజిట‌ల్ గ్రీన్ అనేది ఒక లాభాపేక్ష లేని అంత‌ర్జాతీయ సంస్థ‌. ద‌క్షిణాసియాతో పాటు, స‌బ్‌స‌హారా ఆఫ్రికా ప్రాంతాల్లో ఇది ప‌నిచేస్తోంది. ఈ సంస్థ 2008లో ప్రారంభ‌మైంది. 2008 నుంచి 2016 మ‌ధ్య దాదాపు 10 ల‌క్ష‌ల వ్య‌క్తుల‌ను చేరుకోగ‌లిగింది. 13,592 గ్రామాల‌ను క‌వ‌ర్ చేసింది. గ్రామాలు వెళ్లిన‌ప్పుడు వీడియోలు తీయ‌డం కూడా చేస్తారు. ఆ విధంగా ఇప్ప‌టివర‌కూ 4426 వీడియోల‌ను తీసి అప్‌లోడ్ చేశారు. అయితే అన్ని వీడియోలు అంద‌రికీ అందుబాటులో లేవు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1230 వీడియోల‌ను ప‌బ్లిక్ యాక్సెస్‌లో ఉంచ‌గా దాదాపు 5,88,388 వీక్ష‌ణ‌లు వచ్చాయి. అందులో భార‌త్ నుంచే 3,82,739 వ‌చ్చాయంటే భార‌తదేశంలో ఎంత ప్ర‌భావ‌వంతంగా త‌మ పనిచేసుకుపోతున్నారో అర్థం అవుతుంది.వెబ్‌సైట్ కోసం డిజిట‌ల్ గ్రీన్‌

మండి ట్రేడ‌ర్స్‌

మండి ట్రేడ‌ర్స్‌

పొలం నుంచి కొనుగోలు దాకా స‌కల స‌దుపాయాల‌ను క‌ల్పించే సంస్త మండి ట్రేడ‌ర్స్‌. ఈ విష‌యంలో ప్ర‌తి ద‌శ‌లో రైతును ఇబ్బంది ప‌డ‌కుండా చేయ‌డ‌మే మండి ట్రేడ‌ర్స్ చేసిపెట్టే ప‌ని. బెంగుళూరుకు చెందిన ఎడ్విన్ వ‌ర్ఘీస్ దీన్ని ప్రారంభించారు. వీళ్లు త‌యారు చేసిన యాప్ రైతుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని ద్వారా ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు ధ‌ర‌లు, మార్కెట్ యార్డ్ ధ‌ర‌లు, వ్య‌వ‌సాయ వార్త‌లు వంటి స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే తెలుసుకోవ‌చ్చు. కానీ ఇక్క‌డ చాలా మంది వాదించే అంశం ఎంత మంది రైతుల‌కు సాంకేతిక‌త మీద అవ‌గాహ‌న ఉంద‌ని. ప్ర‌తి ఊరిలో 10వ త‌ర‌గ‌తి చ‌దివి వ్య‌వ‌సాయం చేసే వారు ఒక్క‌రున్నా చాలు. ఈ విధ‌మైన స‌మాచారాన్ని తోటి రైతుల‌కు చేర‌వేసే అవ‌కాశం ఉంది. భార‌త్‌తో మొద‌లైన దీని ప్ర‌స్థానం ప్ర‌స్తుతం థాయ్‌లాండ్‌, కామెరూన్ దేశాల్లో సైతం ఆస‌క్తిని రేకెత్తిస్తోంద‌ని తెలుస్తోంది.

క్రాప్ ఇన్

క్రాప్ ఇన్

సాంకేతిక‌త‌ను ప్ర‌తి రంగంలో విస్త‌రిస్తున్న ప్ర‌భుత్వాలు వ్య‌వ‌సాయంలో మాత్రం చెప్పుకోద‌గ్గ విధంగా విస్త‌రించ‌డం లేద‌నేది కాద‌న‌లేని స‌త్యం. అందుకే అధునాత‌న సాంకేతిక‌త రైతుల‌కు చేరువ కావ‌డం లేదు. అయితే చాలా ఐటీ కంపెనీలు ఎన్ని రంగాల్లో దూసుకెళ్లినా వ్య‌వ‌సాయాన్ని మాత్రం దృష్టిలో ఉంచుకోవ‌డం లేదు. దాన్నే దృష్టిలో ఉంచుకుని వ్య‌వ‌సాయ ప‌రిశ్ర‌మే ప్ర‌ధాన ఆధారంగా మొద‌లైన ఉత్త‌మ స్టార్ట‌ప్‌ల్లో ఒక‌టి క్రాప్ఇన్‌. దీని వ్య‌వ‌స్థాపకులు క్రిష్ణ కుమార్‌, కునాల్ ప్ర‌సాద్. చిత్త‌రంజ‌న్ జెనా సీటీవోగా ప‌నిచేస్తున్నారు. బెంగుళూరు కేంద్రంగా ప‌నిచేస్తున్న ఈ సంస్థ క్లైంట్ల‌లో బిగ్‌బాస్కెట్ సైతం ఉంది.

ఫార్మార్ట్

ఫార్మార్ట్

చిన్న క‌మతాలు 70 నుంచి 90 శాతం ఉన్న దేశం మ‌న‌ది. ఇక్క‌డంతా రోజు వారీ జీవ‌నానికి క‌ష్ట‌ప‌డుతుంటారు. అలాంటి రైతులు ఏ విధంగా వ్య‌వ‌సాయ సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోగ‌ల‌రు? ఆ గ్యాప్‌ను బ్రిడ్జ్ చేసేందుకు వ‌చ్చిందే ఫార్మార్ట్‌. సామాన్యుడు, చిన్న రైతుకు వ్య‌వ‌సాయ ప‌రిర‌కాల‌ను అందుబాటు ధ‌ర‌లో అందించేందుకు ఈ సంస్థ కృషి చేస్తోంది. అలేఖ్‌ త‌న తాత నుంచి పంజాబ్ రైతుల క‌ష్టాలు విన్నాడు. త‌ర్వాత కొంత మంది మిత్రుల‌ను క‌లిశాడు. ఆ విధంగా ఫార్మార్ట్ పురుడు పోసుకుంది. అగ్రిక‌ల్చ‌ర్‌కు సంబంధించి ఖ‌రీదైన ప‌రిక‌రాల‌ను ఇది అద్దెకు అందిస్తుంది. దాదాపు 5% రైతులు మాత్ర‌మే సొంతంగా ట్రాక్ట‌ర్ల ద్వారా వ్య‌వ‌సాయం చేయ‌గ‌లుగుతున్న దేశమిది.

ట్రాక్ట‌ర్లు, టిల్ల‌ర్లు మొద‌లుకొని పంట కోత‌కు ప‌నికొచ్చే ప‌రిక‌రాల‌ను వీరు రైతుల‌కు అందుబాటులో ఉంచుతున్నారు. 24 ఏళ్ల వ‌య‌సులోనే అలేఖ్‌, మెహ‌తాబ్ సింగ్ హాన్స్‌, మ‌రో ఇద్ద‌రు స‌లహాదార్ల సాయంతో ఫార్మార్ట్‌ను స్థాపించారు.

ఫార్మార్ట్ వెబ్‌సైట్‌

ట్రూస్‌

ట్రూస్‌

పండ్లు, కూర‌గాయలు కొనేందుకు వ‌న్ స్టాప్ సొల్యూష‌న్‌గా ట్రూస్ వెబ్‌సైట్‌,యాప్ ప‌నిచేస్తుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి క‌దా అనుమానం చాలా మందికి ఉంటుంది. ఇక్క‌డ నాణ్య‌తకు ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త అందుకే అన‌తి కాలంలోనే చాలా మందికి తెలిసింది. ఆ సంస్థ కాంటాక్ట్ వివ‌రాలు మెయిల్ ఐడీ contact@truce.in, ఫోన్ నంబ‌ర్‌: +91-022-45042504, ఫేస్‌బుక్ , లింక్ఇన్డ్ ద్వారా సైతం మీరు యాజ‌మాన్యాన్ని సంప్ర‌దించే వీలుంది. నేరుగా రైతుల నుంచి అందుబాటు ధ‌ర‌లో వ్య‌వసాయ ఉత్ప‌త్తుల‌ను వినియోగ‌దారుడు అందుకోవాల‌నేది ఆ సంస్థ సిద్దాంతం.

 అగ్రోమాన్‌

అగ్రోమాన్‌

దేశంలోని జ‌నాలంద‌రికీ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ ఎలాగో; రైతుల‌కు ఆ స్థాయి వెబ్‌సైట్ అగ్రోమాన్. ఈ-కామ‌ర్స్ సొల్యూష‌న్ల‌ను రైతుల‌కు అందించే సంస్థ‌ల్లో దేశంలో ముందు వ‌రుస‌లో ఉండే సంస్థ‌ల్లో ఇదీ ఒక‌టి. గుర్గావ్ కేంద్రంగా ఈ సంస్థ ప‌నిచేస్తోంది. సంస్థ అడ్ర‌స్ :

Acugro Services

C-13, Sushant Arcade

Sushant Lok I, Gurgaon

Phone - 0124 4268399

email - contact@agroman.in

ముగింపు

ముగింపు

120 కోట్ల జ‌నాభాకు రైతు అన్నం పెడుతున్నాడు. దేశంలో 60 శాతం పైగా జ‌నాభా వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డింది. పారిశ్రామిక, సేవా రంగాల ఎదుగుద‌ల ఎంత‌గా ఉన్న‌ప్ప‌టికీ వ్య‌వ‌సాయం లాగా ఉపాధి కల్పించే స్థితిలో అవేవీ లేవు. ఇక్క‌డ మ‌రో స‌మ‌స్య వ్య‌వ‌సాయం అంతా వ‌ర్ష‌పాతం, కూలీల ల‌భ్య‌త‌, పంట తెగుళ్లు, మార్కెటింగ్ దానిపై ఆధార‌ప‌డి ఉంది. ఎన్నో అభివృద్ది చెందుతున్న దేశాలు వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నా భార‌త‌దేశం మాత్రం ఆ దిశ‌గా దృష్టి సారించాల్సిన స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు. జీడీపీకి వ్య‌వ‌సాయం స‌మ‌కూర్చే ఆదాయం 15% పైగా ఉంటుంద‌ని అంచ‌నాలు ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వాలు వ్య‌వ‌సాయం, అనుబంధ రంగాల‌పై శ్ర‌ద్ద పెట్ట‌డం లేదు. స‌మీప దూరంలో స‌రైన పంట ధాన్యాల ఉత్ప‌త్తి లేక దిగుమతుల‌పై ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితుల‌ను ప్ర‌భుత్వాలే బ‌లవంతంగా తయారుచేస్తున్నాయి. దీనిపై స‌త్వ‌ర‌మే దృష్టి సారిస్తార‌ని ఆశిద్దాం.

Read more about: farmers, startup, agriculture
English summary

The agri startups that are revolutionizing farmer in the country like India

Agriculture is the backbone of the Indian economy. According to a report from FICCI, about 65 percent of the Indian population depends directly on agriculture and it accounts for around 22 percent of India’s GDP. But farmers, on the other hand, face unprecedented challenges like unpredictable weather, non-availability of good quality seeds and fertilizers and un-reliable avenues to sell their crops after the harvest. There is a large scope to implement modern technology to solve these inherent problems.
Story first published: Monday, June 5, 2017, 13:14 [IST]
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC