ఈ మధ్య మన జీవన శైలి చాలా మారిపోయింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆర్థిక ప్రణాళికలో సాధారణ బీమాతో పాటు ఆరోగ్య బీమాను కూడా తప్పక చేర్చాల్సిందే. ఆరోగ్య ఖర్చులు పెరుగుతున్న తీరును గమనిస్
ఈ మధ్య మన జీవన శైలి చాలా మారిపోయింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆర్థిక ప్రణాళికలో సాధారణ బీమాతో పాటు ఆరోగ్య బీమాను కూడా తప్పక చేర్చాల్సిందే. ఆరోగ్య ఖర్చులు పెరుగుతున్న తీరును గమనిస్తే.. రానురానూ దాని కోసం మన సంపాదన ఎంత వెచ్చించాల్సి వస్తుందో అర్ధమవుతుంది. కొన్నేళ్లలో చిన్నపాటివి మినహాయిస్తే, తీవ్ర అనారోగ్యం వస్తే అయ్యే ఖర్చులకు ఖర్చు పెట్టడం సామాన్యుడికి చాలా కష్టమైపోతుంది. అందుకే ప్రతీ వ్యక్తికి ఆరోగ్య బీమా పాలసీ తప్పనిసరిగా ఉండాల్సిందే. అంతే కాకుండా హాస్పిటల్ క్యాష్ కవర్ ఉంటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

హాస్పిటల్ క్యాష్ పాలసీలు ఎందుకు?
ప్రాథమిక ఆరోగ్య బీమా పథకం.. మీరు తీసుకున్న పాలసీ పరిమితికి లోబడి, మీరు ఆస్పత్రిలో చేరినపుడు వైద్య ఖర్చులను రీఎంబర్స్ చేస్తుంది. అయితే అప్పటిప్పుడు సంభవించే ఖర్చులను లేదా అనారోగ్యం సమయంలో ఉద్యోగం చేయలేని పరిస్థితి ఎదురయినపుడు ఆదాయాన్ని అందించలేకపోవచ్చు. ఇలాంటి సమయంలో హాస్పిటల్ క్యాష్ పాలసీలు పనికొస్తాయి.

కాలపరిమితి
మీకు ఆస్పత్రిలో ఉన్న రోజులకు అనుగుణంగా నిర్ణీత మొత్తాన్ని మీకు హాస్పిటల్ క్యాష్ పాలసీ అందిస్తుంది. సాధారణంగా ఈ పాలసీ ఏడాదికి 30 రోజుల నుంచి 90 రోజుల పరిమితితో ఉంటుంది. కొన్ని పాలసీలు ఏడాదికి 180 రోజుల వరకూ హాస్పిటలైజేషన్‌కు అనుమతిస్తాయి. ఈ పాలసీలను ఆయా వ్యక్తులు వ్యక్తిగతంగాను, లేదా తమ కుటుంబ సభ్యులతో కలిపి తీసుకోవచ్చు.

ఫీచర్లతో పాటు ప్రీమియం ఎక్కువే...
పాలసీలో ఉన్న సభ్యులు ఆస్పత్రి పాలైనపుడు మాత్రమే క్లెయిం చేసుకునేందుకు వీలుంటుంది. ఈ పథకాలలో విబిన్న కంపెనీలు వైవిధ్యమైన లక్షణాలను కలిగి ఉంటాయి. కొన్ని పాలసీలు ఎంతో ఎక్కువ ఆప్షన్లతో, సాధారణం హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల మాదిరిగా ఉంటాయి. ఎక్కువ ఫీచర్స్ ఎన్ని ఉంటే, అంత ఎక్కువగా ప్రీమియం ఉంటుందనే విషయం మరిచిపోకూడదు.

స్వల్ప కాలానికే రీయింబర్స్
పలు ప్రామాణిక ఆరోగ్య బీమా పథకాల్లో హాస్పిటల్ క్యాష్‌తో పాటు ఆరోగ్యం కుదుటపడే వరకు అదనపు కవరేజ్‌లు బిల్ట్-ఇన్‌గా ఉంటాయి. అయితే, ఈ రీఎంబర్స్‌మెంట్స్ అన్నీ స్వల్ప కాలానికే పరిమితం అయి ఉంటాయి. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలో ఏడాదికి 10 రోజుల పరిమితి మాత్రమే ఉంటుంది. అయితే హాస్పిటల్ క్యాష్ పాలసీలో మాత్రం ఇది 30 రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది.

మొదట హెల్త్ పాలసీ... తర్వాతే ఈ హాస్పిటల్ క్యాష్ కవరేజీ
అదనంగా అయ్యే ఖర్చులు, అనారోగ్యం సమయంలో వేతనం లభించే పరిస్థితి లేకపోవడం, మీరు ఆస్పత్రిలో ఉంటే కుటుంబం దీర్ఘకాలం పాటు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చేట్లయితే.. మీరు అదనంగా హాస్పిటల్ క్యాష్ పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. హాస్పిటలైజేషన్ ఖర్చులకు సాధారణ ఆరోగ్య బీమా కొనుగోలు చేసిన తర్వాతే, ఈ హాస్పిటల్ క్యాష్ పాలసీ కొనుగోలు చేయాల్సిందిగా ఆర్థిక ప్రణాళిక నిపుణులు సూచిస్తుంటారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications