ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో తప్పనిసరిగా ఉండే వాటిలో బీమా కూడా ఉంటోంది. బీమాదారు అకస్మాత్తుగా మరణించిన సమయంలో కుటుంబానికి జీవిత బీమా ఆర్థిక రక్షణ కల్పించగలదు. ఏ సమయంలోనైనా సంపాద
ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో తప్పనిసరిగా ఉండే వాటిలో బీమా కూడా ఉంటోంది. బీమాదారు అకస్మాత్తుగా మరణించిన సమయంలో కుటుంబానికి జీవిత బీమా ఆర్థిక రక్షణ కల్పించగలదు. ఏ సమయంలోనైనా సంపాదనపరుడు టర్మ్ ఇన్సూరెన్స్‌ను నిర్లక్ష్యం చేయరాదు. ప్రస్తుతం 28 నుంచి 35 ఏళ్ల వయసు ఉండేవారికి కనీసం రూ.1 కోటి సమ్ అస్యూర్డ్ ఉండే టర్మ్ పాలసీ తీసుకోవడం సూచనీయం. సగటు వేతన జీవి సైతం వీటిని తీసుకునే వీలుంది. కాబట్టి రూ. 1 కోటి బీమా రక్షణ కల్పించే వివిధ కంపెనీల పాలసీల వివరాలను గురించి తెలుసుకుందాం.

1. ఎస్‌బీఐ లైఫ్ ఈషీల్డ్
- ఎస్‌బీఐ లైఫ్ ఈషీల్డ్ సమగ్ర టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ.
- తక్కువ ప్రీమియంలో మంచి పాలసీ కావాలనుకునేవారికి ఇది బాగా ఉంటుంది.
- కనిష్టంగా 18 ఏళ్ల వయసు వారి నుంచి ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులు.
- పాలసీ కాలపరిమితి 5 ఏళ్ల నుంచి మొదలుకొని 30 ఏళ్ల వరకూ ఆప్షన్ ఉంది.
- ప్రీమియం చెల్లింపు ఏడాదికి ఒకసారి చేయాలి.
- యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ సైతం బీమా హామీ మొత్తం లేదా రూ.50 లక్షల వరకూ (ఏది తక్కువైతే అది)ఉంది.
- ఆదాయపు పన్ను చట్టం 80సీ, 10(10) D కింద పన్ను ప్రయోజనాలు ఉంటాయి.

2. ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ స్మార్ట్ లైఫ్ కవర్
- ఉత్తమ ఆన్‌లైన్ టర్మ్ పాలసీల్లో ఐసీఐసీఐ ఐప్రొటెక్ట్ స్మార్ట్ ప్లాన్ సైతం ఉంది.
- ఈ పాలసీలో యాక్సిడెంట్ రైడర్, ప్రీమియం రద్దు, తీవ్ర అనారోగ్యాన్ని కవర్ చేసే రైడర్లు ఉన్నాయి.
- దీనికి నెలకు రూ.490 నుంచి ప్రీమియం మొదలవుతుంది. అంటే ఏడాదికి దాదాపు రూ.6 వేల వరకూ ఉంటుంది.
- 34 తీవ్ర అనారోగ్యాలకు సంబంధించి కచ్చితమైన రూ.కోటి రూపాయల జీవిత బీమా ప్రయోజనాన్ని చెల్లిస్తారు.
- పాలసీదారు యాక్సిడెంట్ కారణంగా మరణిస్తే నామినీకి రెండింతల బీమాను చెల్లిస్తారు.
- పాలసీదారు యాక్సిడెంట్ కారణంగా శాశ్వత వైకల్యం పొందితే ప్రీమియంను రద్దు చేస్తారు. పాలసీ మాత్రం కొనసాగుతుంది.

3. అవీవా ఐ-లైఫ్
- రూ. కోటీ రూపాయల కవరేజీ గల ఈ పాలసీ వార్షిక ప్రీమియం రూ. 5840. (18 ఏళ్ల మగవారికి)
- ఆడవారికి అన్ని మరణ ప్రయోజనాలు కల్పించేలా ఉండే పాలసీలో 5% రిబేట్ లభిస్తుంది.
- పాలసీదారు మరణిస్తే ఏటా కొంత సొమ్మును 15 ఏళ్ల పాటు చెల్లిస్తారు.
- పాలసీదారు కాలపరిమితి మొత్తం పాటు జీవించి ఉంటే చివర్లో ఎటువంటి ప్రయోజనాన్ని చెల్లించరు.
- రూ. 1 లక్ష లోపు చెల్లించే ప్రీమియానికి ఆదాయపు పన్ను మినహాయింపులుంటాయి.

4. హెచ్‌డీఎఫ్‌సీ క్లిక్ 2 ప్రొటెక్ట్
- 18 ఏళ్ల వ్యక్తికి రూ. 683 నెలవారీ ప్రీమియంతో రూ. 1 కోటి రక్షణ కల్పిస్తుంది.
- యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ తీసుకోవడం ద్వారా పాలసీ ప్రయోజనాలను పెంచుకోవచ్చు.
- పాలసీదారు యాక్సిడెంట్ వల్ల మరణిస్తే నామినీకి బీమా హామీ మొత్తానికి రెండు రెట్ల సొమ్మును చెల్లిస్తారు.(యాక్సిడెంట్ రైడర్ ఉంటే)
- ఒక వేళ ప్రమాదం కారణంగా వైకల్యం కలిగితే, నెలవారీ రూ.60 వేల వరకూ ప్రయోజనం పొందవచ్చు.
- దురదృష్టవశాత్తు తీవ్ర అనారోగ్యం ఉన్నట్లు తేలితే పాలసీదారు రూ.20 లక్షలను ఏకమొత్తంలో పొందవచ్చు.

5. మ్యాక్స్ లైఫ్ ఆన్‌లైన్ టర్మ్ ప్లాన్ ప్లస్
మ్యాక్స్ లైఫ్ రూ.25 లక్షలతో మొదలుకొని రూ.100 కోట్ల వరకూ కవరేజీ గల ఈ టర్మ్ పాలసీని ప్రవేశపెట్టింది.
పాలసీదారు వయసు గరిష్టంగా 70 ఏళ్ల వరకూ ఉండేలా పాలసీని రూపొందించారు.
30 ఏళ్ల కాలపరిమితికి రూ.1 కోటి కవరేజీ కోసం దీని ప్రీమియం రూ. 7400.
పాలసీలో చేరేందుకు కనిష్ట, గరిష్ట అర్హత వయసు 18 ఏళ్లు, 60 ఏళ్లు.
ఎన్ఆర్ఐలు సైతం ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు.

6. ఎల్ఐసీ ఈ-టర్మ్
- ఈ-టర్మ్ పేరుతో ప్రభుత్వ రంగ బీమా సంస్థ మొదటి ఆన్‌లైన్ పాలసీని ప్రవేశపెట్టింది.
- 30 ఏళ్ల వయసు గల వ్యక్తి రూ. 1 కోటి కవరేజీ ఉండే 25 ఏళ్ల టర్మ్ పాలసీకి రూ.9545 వార్షిక ప్రీమియం చెల్లించాలి.
- 18 ఏళ్లు నిండిన వారి నుంచి 60 ఏళ్ల వారికి ఈ పాలసీ తీసుకునేందుకు అవకాశం కల్పించారు.
- కనీస బీమా రక్షణ మొత్తం రూ.25 లక్షలుగా ఉండగా, పొగ తాగే అలవాటు లేని వారికి రూ. 50 లక్షలుగా కవరేజీ ఉంది.
- ప్రీమియం చెల్లింపును నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్/ క్రెడిట్ కార్డు ద్వారా చేయొచ్చు.

7. పాలసీ కొనుగోలు చేసే ముందు ఏయే అంశాలు చూడాలి.
- పాలసీ ప్రీమియం
- కంపెనీ పేరు ప్రతిష్టలు
- క్లెయిం సెటిల్‌మెంట్ రేషియో
- బీమా కంపెనీ ఆర్థిక స్థితిగతులు
- కంపెనీ అందిస్తున్న ఫీచర్లు,రైడర్లు
- కంపెనీ సేవలపై పాలసీదారుల అభిప్రాయాలు
- పాలసీ కాలపరిమితి, గరిష్ట కవరేజీ వయసు
- క్లెయిం సెటిల్‌మెంట్‌కు పట్టే సగటు సమయం
- పాలసీని ఎంత సులువుగా కొనుక్కోవచ్చు
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications