For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్ కార్డులో త‌ప్పులుంటే మార్చుకోవ‌చ్చు ఇలా...

తప్పులు దొర్లి ఉంటే మీరు ఆధార్ కేంద్రాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. ఇంట‌ర్నెట్ సదుపాయం ఉండి, మీ మొబైల్ నంబ‌ర్ ఆధార్ మెయిన్ వెబ్‌సైట్లో రిజిస్ట‌ర్ అయి ఉంటే చాలు. మీరే ఆధార్ వివ‌రాల‌ను స‌వ‌రించుకోవ‌చ్

|

ఈ మ‌ధ్య కాలంలో చాలా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ఆధార్ కార్డుతో అనుసంధానిస్తున్నారు. అయితే అందులో ముద్ర‌ణ స‌మయంలో త‌ప్పులు దొర్ల‌డం స‌హ‌జం. చాలా మందికి త‌మ పేరు, డేట్ ఆఫ్ బ‌ర్త్ వివ‌రాలు స‌రిగా ముద్రించ‌బ‌డి ఉండ‌వు. అలా తప్పులు దొర్లి ఉంటే మీరు ఆధార్ కేంద్రాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. ఇంట‌ర్నెట్ సదుపాయం ఉండి, మీ మొబైల్ నంబ‌ర్ ఆధార్ మెయిన్ వెబ్‌సైట్లో రిజిస్ట‌ర్ అయి ఉంటే చాలు. మీరే ఆధార్ వివ‌రాల‌ను స‌వ‌రించుకోవ‌చ్చు. అది ఎలాగో ఇక్క‌డ చూద్దాం.

1. ఆధార్ సంబంధించిన వెబ్‌సైట్

1. ఆధార్ సంబంధించిన వెబ్‌సైట్

ప్ర‌భుత్వ వెబ్‌సైట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) వెబ్‌సైట్‌కు వెళ్లి సరిచేసుకునే వీలుంది. ఆధార్ వెబ్‌సైట్ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి. ముందుగా https://ssup. uidai. gov.in/web/guest/ update వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత కింద నల్లటి అక్షరాల్లో కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్‌ను టైప్ చేయాలి. సెండ్ ఓటీపీ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మొబైల్ నంబ‌రును ద‌గ్గ‌ర ఉంచుకోవ‌డం మ‌ర‌వ‌కండి.

 2. ఎడిట్ పేజీ

2. ఎడిట్ పేజీ

ఆ వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేస్తే తర్వాతి పేజీకి వెళ్తాం. అక్కడ పేరు లేదా చిరునామా, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ వీటిలో మార్చాల్సిన వాటిని ఎంచుకొని వివరాలు ఇంగ్లీష్ లేదా ప్రాంతీయ భాషలో నమోదు చేయాలి. మార్పుల వివరాలను ఆధారంగా ఏదేని డాక్యుమెంట్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది. చిరునామాలో మార్పు అయితే కొత్త చిరునామాను తెలియజేసే డాక్యుమెంట్ జిరాక్స్ కాపీపై సెల్ఫ్ అటెస్టేషన్‌తో స్కాన్ చేసి దాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరగా యూటీఆర్ నెంబర్ రాసి పెట్టుకుంటే స్టేట‌స్ ఏమైందో తెలుసుకోవ‌చ్చు.

3. వివ‌రాలు అప్‌డేట్ అయ్యాయా?

3. వివ‌రాలు అప్‌డేట్ అయ్యాయా?

కొత్త వివరాలు ఆధార్‌లో చోటు చేసుకున్నాయా, లేదా అనే దానిని పరిశీలించేందుకు https://ssup.uidai.gov.in/web/guest/check-status సైట్‌కు వెళ్లాలి. ఆధార్ నెంబర్, యూఆర్‌ఎస్ నెంబర్లను నమోదు చేసి గెట్ స్టేటస్ బటన్ క్లిక్ చేస్తే స్టేటస్ వస్తుంది. వెయిటింగ్ అప్రూవల్.. లేక అప్రూవల్ అయ్యిందా.. అన్నది తెలుస్తుంది. అప్రూవల్ ముగిస్తే నూతన ఆధార్ కార్డును ఈ కార్డు రూపంలో పొందవచ్చు.

4. కొత్త ఆధార్ కార్డు కోసం

4. కొత్త ఆధార్ కార్డు కోసం

ఇందుకు https://eaadhaar.uidai.gov.in/ సైట్ ఓపెన్ చేయాలి. ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఏది ఉంటే.. దాన్ని పైన సెలక్ట్ చేసుకుని ఆ నెంబర్‌ను కిందనున్న కాలమ్‌లో ఎంటర్ చేయాలి. పూర్తి పేరు, పిన్‌కోడ్ తర్వాత కాలమ్ కింద కనిపించే అక్షరాలు, మొబైల్ నెంబర్ నమోదు చేయాలి. గెట్ వన్ టైమ్ పాస్‌వర్డ్ క్లిక్ చేస్తే మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా పాస్‌వర్డ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే పీడీఎఫ్ రూపంలో ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది. దేశంలో ఆధార్ కార్డు ఎక్క‌డెక్క‌డ త‌ప్ప‌నిసరి

5. రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ లేక‌పోతే...

5. రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్ లేక‌పోతే...

ఆధార్ కార్డులోని త‌ప్పుల‌ను స‌వరించేందుకు ఆధార్ వెబ్‌సైట్లో న‌మోద‌యిన మొబైల్ నంబ‌రే ప్ర‌ధాన ఆధారం. అది ప్ర‌స్తుతం వాడ‌టం లేదంటే ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్ కుద‌ర‌దు. ఎందుకంటే ఆ మొబైల్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాని ద్వారానే మార్పులు చేయ‌డం సాధ్య‌మ‌వుతుంది. ఒక‌వేళ కార్డు తీసుకునే స‌మ‌యంలో ఇచ్చిన నంబ‌రు మారిపోయి ఉంటే ద‌గ్గ‌ర్లోని ఆధార్ న‌మోదు కేంద్రానికి వెళ్లి మొబైల్ నంబ‌రును మార్చుకునేందుకు ద‌ర‌ఖాస్తు చేయాలి. అలా వీలు కాని వారు పోస్టు ద్వారా ద‌ర‌ఖాస్తు ఫారంను పంపి సైతం చేసుకోవ‌చ్చు. ఆధార్ అనుసంధానించ‌క‌పోతే ఏం కోల్పోతారు?

 6.పోస్టు ద్వారా పంపేవారి కోసం చిరునామాలు

6.పోస్టు ద్వారా పంపేవారి కోసం చిరునామాలు

అడ్రస్1 : UIDAI, Post Box No.10, Chhindwara, Madhya Pradesh 480001, India.

అడ్రస్ 2: UIDAI, Post Box No.99, Banjara Hills, Hyderabad 500034, India

ఇది కూడా చ‌ద‌వండి పాన్‌కార్డుతో ఆధార్ అనుసంధానం ఎలా? ఇది కూడా చ‌ద‌వండి పాన్‌కార్డుతో ఆధార్ అనుసంధానం ఎలా?

కవర్‌పైన స్పష్టంగా ఆధార్ అప్‌డేట్ / కరెక్షన్ అని రాయాలి. అలాగే పంపేవారి చిరునామా తప్పనిసరిగా రాయాలి. సెల్ఫ్ అసిస్టెడ్ గుర్తింపు పత్రాన్ని కూడా జత చేయాలి.

దేశంలో బ్యాంకులు వివిధ సేవ‌ల‌కు విధించే రుసుములుదేశంలో బ్యాంకులు వివిధ సేవ‌ల‌కు విధించే రుసుములు

7. ఆధార్ ఎందుకు అవ‌స‌రం

7. ఆధార్ ఎందుకు అవ‌స‌రం

వృత్తి, వ్యాపారం రీత్యా ఇల్లు మారుతున్న వారికి ఆధార్ శాశ్వ‌త గుర్తింపునిస్తుంది. 2006 సంవ‌త్స‌రంలో కేంద్ర ప్ర‌భుత్వం ఒక ప్ర‌త్యేక సంస్థ‌ను నెల‌కొల్ప‌డం ద్వారా ఆధార్ లేదా ప్ర‌త్యేక గుర్తింపు సంఖ్య‌ను ప్రారంభించింది. ఈ మ‌ధ్య పాన్‌కార్డు, ఇన్‌క‌మ్ ట్యాక్స్ రిట‌ర్నుల‌కు ఆధార్ అనుసంధానాన్ని త‌ప్ప‌నిస‌రి చేశారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల్లో సైతం చాలా వాటికి ఆధార్ ఉంటేనే ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తామ‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రెవెన్యూ రిజిస్ట్రేష‌న్ల‌కు ఆధార్ సాయంతో అక్ర‌మాల‌ను అరిక‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇది స‌మ‌యాన్ని సైతం ఆదా చేస్తుంది.బ్యాంకు ఖాతా ప్రారంభించడం, బీమా పాలసీ తీసుకోవడం, పాస్‌పోర్ట్‌ పొందటం, గ్యాస్‌ కనెక్షన్‌, బ్యాంక్‌లోను యితరత్రా ప్రయోజనాలు పొందటం తేలికవుతుంది. మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు ఆధార్ ఉంటే ఇన్వెస్ట్‌మెంట్స్ సులువు. పీఎప్ సంబంధిత క‌థ‌నాలు

ఆధార్ అనుసంధానానికి సంబంధించి నాలుగు ముఖ్య డెడ్ లైన్లుఆధార్ అనుసంధానానికి సంబంధించి నాలుగు ముఖ్య డెడ్ లైన్లు

Read more about: aadhaar uidai ఆధార్
English summary

ఆధార్ కార్డులో త‌ప్పులుంటే మార్చుకోవ‌చ్చు ఇలా... | How to update or correct details in Aadhaar card online

Aadhaar Card Corrections Online Update Name Address phone number simple process. Read More in Telugu Goodreturns
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X