English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

సాధార‌ణంగా డ‌బ్బు దాచుకోవ‌డానికి మ‌నం బ్యాంకు ఖాతాల వైపే మొగ్గుచూపుతాం. కావాల్సిన‌ప్పుడ‌ల్లా డ‌బ్బు తీసుకునే వీలు, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫ‌ర్‌, ఏ శాఖ‌లోనైనా డిపాజిట్ చేసే వీలుండ‌టం వంటి కార‌ణాల రీత్యా బ్యాంకులంటే అంద‌రికీ అంత ఆస‌క్తి. అయితే ప్ర‌స్తుతం క్ర‌మంలో ఒక ప‌రిమితి దాటి డిపాజిట్లు, విత్‌డ్రాయ‌ల్స్ చేసినా బ్యాంకులు రుసుములు విధించేందుకు సిద్ద‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా 1ల‌క్షా 50 వేల శాఖ‌లు క‌లిగిన పోస్టాఫీసు ఖాతాను మాత్రం చాలా మంది మ‌రిచిపోతున్నారు. త్వ‌ర‌లో చాలా చోట్ల పోస్టాఫీసు ఏటీఎమ్‌లు ఏర్పాటు కాబోతున్నాయి. పోస్టాఫీసు పొదుపు ఖాతా ఉంటే సౌక‌ర్య‌వంతంగా ఉండ‌టంతో పాటు మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అవేంటో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

ఖాతా తెర‌వ‌డం

ఖాతా తెర‌వ‌డం

భారతీయ పౌరులు ఎవరైనా ఈ ఖాతాను తెరిచి బ్యాంకు ఖాతాలవలే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. కేవలం 20 రూపాయలతో ఖాతాను తెరవచ్చు. చెక్ సదుపాయం లేకుండా అయితే కనీసం 50 రూపాయలు నిల్వ ఉంచితే చాలు. అదే చెక్ సదుపాయం కావాలనుకుంటే ఖాతాలో కనీసం 500 రూపాయలు ఎప్పుడూ నిల్వ ఉంచాలి.

 నిష్క్రియాప‌ర‌(సైలంట్‌) ఖాతా

నిష్క్రియాప‌ర‌(సైలంట్‌) ఖాతా

మూడేళ్లలో కనీసం ఓ లావాదేవీ అయినా ఉండాలి. లావాదేవీ లేని ఖాతాలను నిష్క్రియాప‌ర‌మైన‌(సైలంట్‌) ఖాతా కింద పరిగణిస్తారు. అంటే మనుగడలో ఉండదు. అటువంటి ఖాతాల‌ను మ‌ళ్లీ యాక్టివేట్ చేసుకునేందుకు సంబంధిత పోస్టాఫీసు శాఖ‌కు వెళ్లాల్సిందే. ఓ లేఖ ఇవ్వడం ద్వారా తిరిగి దాన్ని యాక్టివేట్ చేయించుకోవచ్చు. ఖాతాలో సూచించిన దాని కంటే త‌క్కువ న‌గ‌దు నిల్వ ఉంటే సేవా రుసుముల కింద రూ.20 మిన‌హాయిస్తారు.

ఖాతా బ‌దిలీ

ఖాతా బ‌దిలీ

ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు ఖాతాను సులువుగా బదిలీ చేసుకోవచ్చు. ఖాతాను బ‌దిలీ చేసుకునేవారు SB10(b) ఫారంను నింపి ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సార్లు మాన్యువ‌ల్‌గా ద‌ర‌ఖాస్తు చేసినా అంగీక‌రిస్తారు. పూర్తి చేసిన ఫారంను ఖాతాను బ‌దిలీ చేసుకునే కార్యాల‌యంలో లేదా ఇదివ‌ర‌కే ఖాతా ఉన్న కార్యాల‌యంలో ఇచ్చినా అంగీక‌రిస్తారు.

వ‌డ్డీకి సంబంధించిన అంశాలు

వ‌డ్డీకి సంబంధించిన అంశాలు

ఖాతాలో నిల్వలపై 4 శాతం వార్షిక ప్రాతిపదికన వడ్డీ చెల్లిస్తారు. వ్యక్తిగతంగానే కాదు, ఇద్దరు లేదా ముగ్గురు కలసి ఉమ్మడిగానూ ఖాతా ప్రారంభించవచ్చు. మైనర్ల పేరుతోనూ ఖాతా ప్రారంభించవచ్చు. ఖాతాలో నిల్వలపై ఏడాదికి వడ్డీ రూపంలో 10వేల వరకు వచ్చే ఆదాయంపై పన్ను ఉండదు. పోస్టాఫీసుకు సంబంధించి వివిధ పారంల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

పోస్టాఫీసు ఖాతా ఎలా తెర‌వాలి?

పోస్టాఫీసు ఖాతా ఎలా తెర‌వాలి?

ఖాతా తెరిచేందుకు అవ‌స‌మైన ఫారంను పోస్టాఫీసుకు వెళ్లి కానీ లేదా ఆన్‌లైన్‌లో పొంద‌వ‌చ్చు. పూర్తి చేసిన ఫారాన్ని కేవైసీ ప‌త్రాల‌ను జ‌త‌చేసి మీ ద‌గ్గ‌రలో ఉన్న పోస్టాఫీసులో స‌మ‌ర్పించాలి. ఖాతా తెరిచేందుకు అవ‌స‌ర‌మైన రూ. 20 చెల్లించాలి. వీలైనంత తొంద‌ర‌గా మీ ఖాతా తెరుస్తారు. పాస్‌బుక్ అంద‌జేస్తారు.

ఏక ఖాతాదారు విష‌యంలో రూ.1ల‌క్ష‌, ఉమ్మ‌డి ఖాతా విష‌యంలో రూ.2 ల‌క్ష‌ల గ‌రిష్ట డిపాజిట్ అని గుర్తుంచుకోండి.

దేశంలో సుర‌క్షిత‌మైన పోస్టాఫీసు పొదుపు ఖాతాలివి... ప్ర‌య‌త్నించండి

ఇత‌ర అంశాలు

ఇత‌ర అంశాలు

ఏటీఎం/డెబిట్ కార్డుల సదుపాయం కూడా ఉంది. నామినీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే... ఒకవేళ ఖాతాదారులు దురదృష్ట వశాత్తూ మరణానికి గురైతే ఖాతాలోని నగదును నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఖాతాదారు మరణ ధ్రువీకరణ పత్రంతో, వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలతో వెళ్లి నిర్ణీత ఫారాన్ని పూర్తి చేసి ఇవ్వాలి. ఒకవేళ నామినీగా ఎవరినీ సూచించకుంటే... వారసులు ఖాతాదారుని మరణ ధ్రువీకరణ పత్రంతో వెళ్లి ఎస్ బీ 84 పత్రాన్ని పూర్తి చేసి, వారసత్వ ధ్రువీకరణ పత్రాలతో క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సుర‌క్షిత పోస్టాఫీసు ప‌థ‌కాలు

 పోస్టాఫీసు మైన‌ర్ ఖాతా

పోస్టాఫీసు మైన‌ర్ ఖాతా

పోస్టాఫీసు పొదుపు ఖాతాను మైన‌ర్ పేరిట కూడా తెర‌వొచ్చు. 10 ఏళ్లు అంత‌కంటే పైబ‌డి వ‌య‌సు క‌లిగిన వారి పేరిట ఖాతా తెర‌వ‌డ‌మే కాకుండా వాళ్లే నిర్వ‌హించుకునేందుకు అనుమ‌తిస్తారు. పిల్ల‌ల చేత చిన్న‌ప్పుడే పొదుపు ఖాతా తెరిపించ‌డం వ‌ల్ల వారికి ఆర్థిక విష‌యాల‌పై అవ‌గాహ‌న‌ను క‌ల్పించిన‌వార‌వుతారు. పోస్టాఫీసు ఆర్‌డీ, బ్యాంకు రిక‌రింగ్ డిపాజిట్ కంటే ఉత్త‌మ‌మా?

Read more about: post office, savings account
English summary

5 Things to know about post office savings account

postal saving account can be opened by cash only. Cheque facility can be taken in an existing account also.Nomination facility is available at the time of opening and also after opening of account.Account can be transferred from one post office to another.One account can be opened in one post office. Account can be opened in the name of minor and a minor of 10 years and above age can open and operate the account.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC