For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భీమ్ యాప్‌తో న‌గ‌దు బదిలీ సులువుగా

డిజిటల్ లావాదేవీలను సులభతరం చేయ‌డానికి ప్రభుత్వం భీమ్(Bharat Interface for Money) యాప్‌ను తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆవిష్కరించిన మొబైల్ పేమెంట్ యాప్ భీమ్ వినియోగించడం చాలా సులువు.

|

డిజిటల్ లావాదేవీలను సులభతరం చేయ‌డానికి ప్రభుత్వం భీమ్(Bharat Interface for Money) యాప్‌ను తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆవిష్కరించిన మొబైల్ పేమెంట్ యాప్ భీమ్ వినియోగించడం చాలా సులువు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ భీమ్ యాప్‌‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

యూపీఐ పిన్‌

యూపీఐ పిన్‌

భీమ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దీనిలో బ్యాంకు ఖాతా వివరాలను రిజిస్టర్ చేసి యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి. దీంతో మీ మొబైల్ నెంబర్ మీ పేమెంట్ అడ్రస్ అవుతుంది. దాని త‌ర్వాత మ‌న‌కు అవ‌స‌ర‌మైన డిజిట‌ల్‌ లావాదేవీలు జరుపుకోవచ్చు. ఆధార్ ఆధారితమైన భీమ్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్లలో చేతి వేలి గుర్తుతో డిజిటల్ పేమెంట్స్ జరపవచ్చు.

 ఖాతా నుంచి న‌గ‌దు బ‌దిలీ, ఖాతాలోకి డబ్బు పొంద‌వ‌చ్చు

ఖాతా నుంచి న‌గ‌దు బ‌దిలీ, ఖాతాలోకి డబ్బు పొంద‌వ‌చ్చు

నెట్ బ్యాంకింగ్ మాదిరిగా ఐఎఫ్ఎస్‌సీ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి ఇతరులకు డబ్బులు పంపవచ్చు లేదా ఇతర అకౌంట్ల నుంచి మన ఖాతాలోకి సొమ్మును పొందవచ్చు. బ్యాంక్ న‌గ‌దు నిల్వ‌ను తెలుసుకోవడంతో పాటు ఫోన్ నెంబర్ షేర్ చేయకుండానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు.

యూఎస్ఎస్‌డీ

యూఎస్ఎస్‌డీ

ఫీచర్ ఫోన్ల ద్వారా భీమ్ యాప్‌తో యూఎస్ఎస్‌డీ విధానంలో లావాదేవీలు జరపవచ్చు. యూఎస్ఎస్‌డీ అంటే అవ్య‌వ‌స్థీకృత మొబైల్ చెల్లింపు విధానం. దీని కోసం మొదట *99#‌కు డయిల్ చేయాలి. దీనికి ఎలాంటి ఇంటర్‌నెట్ కనెక్షన్ అవసరం లేదు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు ఖాతాలకు ఇది అనుసంధానంగా ఉంటుంది. భీమ్ యాప్ ద్వారా ఒకసారికి గరిష్టంగా రూ.10,000, ఒక రోజులో రూ.20,000 వరకు ట్రాన్సాక్షన్ చేయవచ్చు.

భీమ్ యాప్ ప్ర‌త్యేక‌త‌

భీమ్ యాప్ ప్ర‌త్యేక‌త‌

మొబైల్ వాలెట్ యాప్ ద్వారా అయితే మొదట దానిలో నగదు నింపి, తర్వాత వాడుకోవాలి. కానీ ఈ అప్లికేష‌న్‌లో నగదు నింపాల్సినవసరం లేదు. భీమ్ యాప్ అనేది డెబిట్ కార్డు మాదిరి కస్టమర్ల చ‌ర‌వాణికి నేరుగా బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయి ఉంటుంది. కాబట్టి చెల్లింపులు వెనువెంటనే జరిపోతాయి. దీనిపై వ్యాపారులు ఎలాంటి ఆందోళనలు చెందాల్సినవసరం ఉండదు.

అన్ని బ్యాంకులూ... ఐఎఫ్ఎస్‌సీ ద్వారా

అన్ని బ్యాంకులూ... ఐఎఫ్ఎస్‌సీ ద్వారా

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి దిగ్గజ బ్యాంకులతో పాటు యూపీఐ సౌక‌ర్యం ఉన్న బ్యాంకులన్నీ భీమ్ యాప్‌ను అంగీకరిస్తాయి. యూపీఏతో సంబంధం లేని బ్యాంకులు కూడా ఐఎఫ్ఎస్‌సీ కోడ్ సాయంతో భీమ్ ద్వారా నగదు పొందుతాయి. కాబ‌ట్టి యూపీఐ సౌక‌ర్యం లేని బ్యాంకు ఖాతాదారులు చింతించాల్సిన అవ‌స‌రం లేదు.

మీరు ఇక్క‌డ నుంచి భీమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు: https://play.google.com/store/apps/details?id=in.org.npci.upiapp

Read more about: digital online bhim భీమ్
English summary

భీమ్ యాప్‌తో న‌గ‌దు బదిలీ సులువుగా | 5 Things to know about Bhim app

With the announcement by Narendra Modi saturday, campaign to promote cashless society took another step. Bharat Interface for Money (BHIM), the Aadhaar-based payments developed by the National Payment Corporation of India (NPCI) is ‘an initiative to enable fast, secure, reliable cashless payments through your mobile phone’. Currently available in Android, the iOS version of the app will be available soon. The app links your bank account to let you transfer money using UPI.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X