For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూపే కార్డు గురించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు

రూపే కార్డు భార‌త‌దేశంలోనే రూపొందించిన ఎల‌క్ట్రానిక్ పేమెంట్ కార్డు. ఇది ఏటీఎమ్ క‌మ్ డెబిట్ కార్డుగా ప‌నిచేస్తుంది. రూపాయి, పేమెంట్ అనే ప‌దాలు క‌లిసి వ‌చ్చేలా రూపే కార్డు అని పేరు పెట్టారు. నేష‌నల్ పే

|

రూపే కార్డు భార‌త‌దేశంలోనే రూపొందించిన ఎల‌క్ట్రానిక్ పేమెంట్ కార్డు. ఇది ఏటీఎమ్ క‌మ్ డెబిట్ కార్డుగా ప‌నిచేస్తుంది. రూపాయి, పేమెంట్ అనే ప‌దాలు క‌లిసి వ‌చ్చేలా రూపే కార్డు అని పేరు పెట్టారు. నేష‌నల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా వారు నిర్వ‌హిస్తున్న ఈ కార్డుతో బిల్లు చెల్లింపులు, ఆన్‌లైన్ లావాదేవీలు జ‌ర‌పొచ్చు. రూపే కార్డును దేశంలోని అన్ని ఏటీఎమ్‌ల్లోనూ, వ్యాపార స‌ముదాయాల్లోనూ ఉప‌యోగించ‌వ‌చ్చు. మార్చి 2016 నాటికి దేశంలో 17.8 కోట్ల రూపే డెబిట్ కార్డులున్నాయి. భ‌విష్య‌త్తులో చిన్న ఫైనాన్స్ బ్యాంకులు సైతం ఈ కార్డుల‌ను జారీచేస్తాయి.
ఆన్‌లైన్ లావాదేవీలు, చెల్లింపుల‌కు సైతం రూపే కార్డును వాడుకోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో ఇలాంటి మ‌రెన్నో ప్ర‌యోజ‌నాల‌ను ఈ కింద తెలుసుకుందాం.

1. రూపే కార్డు ఆఫ‌ర్లు

1. రూపే కార్డు ఆఫ‌ర్లు

రూపే కార్డు దారుల‌కు ఎన్‌పీసీఐ ప‌లు ఆఫ‌ర్లు ఇస్తోంది. ఇందులో ముఖ్యంగా ఫ్యూయ‌ల్ స‌ర్‌చార్జీ ఎత్తివేత‌(ప‌రిమితితో), మార్చి,2018 వ‌ర‌కూ ఐఆర్‌సీటీసీ టిక్కెట్ల బుకింగ్‌పై క్యాష్‌బ్యాక్‌, యుటిలిటీ బిల్లు చెల్లింపుల‌పైన ఆఫ‌ర్లు వంటివి ఉన్నాయి.

రూపే కార్డుపై ఉన్న ఆఫ‌ర్ల గురించి మ‌రింత స‌మాచారం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

2. త‌క్కువ, భ‌రించ‌గ‌లిగే ఖ‌ర్చు

2. త‌క్కువ, భ‌రించ‌గ‌లిగే ఖ‌ర్చు

రూపే కార్డు ద్వారా మీరు చేసే లావాదేవీ దేశీయంగా జ‌రిపే ఏర్పాటు ఉండ‌టం మూలంగా చెల్లింపులు జ‌రిగేందుకు అయ్యే ఖ‌ర్చు(ట్రాన్సాక్ష‌న్ చార్జీ) త‌క్కువ అవుతుంది. దాని వ‌ల్ల స‌గ‌టు లావాదేవీకి అయ్యే ఖ‌ర్చు వినియోగ‌దారుడు భ‌రించ‌గ‌లిగే విధంగా ఉంటుంది.

3. దేశీయ వినియోగ‌దారుకు త‌గ్గ ఏర్పాట్లు

3. దేశీయ వినియోగ‌దారుకు త‌గ్గ ఏర్పాట్లు

మ‌న దేశంలోనే తయార‌యినందు వ‌ల్ల స‌గ‌టు దేశీయ పౌరుడిని దృష్టిలో పెట్టుకుని కార్డు త‌యారీ, నిర్వ‌హ‌ణ‌, రాయితీలు వంటివి ఉంటాయి. సేవ‌ల‌న్నీ ఈ కోణంలోనే ఉంటాయి.

4. వినియోగ‌దారుల స‌మాచారం

4. వినియోగ‌దారుల స‌మాచారం

ఇత‌ర కంపెనీల కార్డుదారుల స‌మాచారం విదేశాల్లోని డేటాబేస్‌ల్లో ఉంటుంది. రూపే కార్డు విష‌యంలో లావాదేవీలు, వినియోగ‌దారుల‌కు సంబంధించిన స‌మ‌స్త స‌మాచారం దేశంలోప‌లే ఉండ‌టం వ‌ల్ల సుర‌క్షిత విష‌యంలో భ‌రోసా ఉంటుంది.

5. మారుమూల ప్రాంతాల‌కు విస్త‌ర‌ణ‌

5. మారుమూల ప్రాంతాల‌కు విస్త‌ర‌ణ‌

గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల బ్యాంకింగ్, ఆర్థిక సేవ‌లు వినియోగదారుల‌కు త‌గిన స్థాయిలో విస్త‌రించ‌లేదు. రూపే కార్డుల సేవ‌ల ధ‌ర‌లు త‌క్కువ పెట్ట‌డం ద్వారా స‌హ‌కార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు సైతం వారి వారి ఖాతాదార్ల‌ను కార్డుల‌ను వాడేలా ప్రోత్స‌హిస్తున్నాయి.

6. చెల్లింపు మాధ్య‌మాల్లో ఉప‌యోగించుకొనుట‌కు అవ‌కాశం

6. చెల్లింపు మాధ్య‌మాల్లో ఉప‌యోగించుకొనుట‌కు అవ‌కాశం

వివిధ చెల్లింపు మాధ్య‌మాల్లో(ఆన్‌లైన్ పేమెంట్స్‌) వాడేందుకు వీలుగా రూపే కార్డు త‌యారీ జ‌రిగింది. ఏటీఎమ్‌, మ‌ర్చంట్స్‌, ఆన్‌లైన్ చెల్లింపులు వంటి వాటికి స‌రిపోయే సాంకేతిక‌త‌, ప‌రిష్కార మార్గాల‌ను వాడ‌టం ద్వారా రూపే కార్డుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప‌రిష్క‌రించారు.

ఎప్ప‌టిక‌ప్పుడు రూపే కార్డు(ఎన్‌పీసీఐ) అందించే ఆఫ‌ర్ల కోసం రూపే కార్డు అధికారిక ఫేస్‌బుక్ పేజీని ఫాలో అవ్వండి

Read more about: rupay rupay card
English summary

రూపే కార్డు గురించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు | What is Rupay card and benefits of Rupay card

The IndiaPay scheme was conceived by the National Payments Corporation of India as an alternative to the MasterCard and Visa card schemes,[2][5] and to consolidate and integrate various payment systems in India. It was renamed to RuPay to avoid naming conflicts with other financial institutions using the same name.[6]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X