For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ చిన్నారి చదువు కోసం ప్రణాళిక వేశారా?

By Nageswara Rao
|

మంచి చదువు చెప్పించడమే పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే గొప్ప ఆస్తి అనేది నా అభిప్రాయం. చదువు వారి భవిష్యత్తకు భద్రతను కల్పిస్తుంది. దీంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం సరైన ప్లాన్ లేకుండా పెట్టుబడులు పెడుతున్నారు. అది సరైన రాబడిని ఇస్తుందా లేదా అనే విషయం కూడా అలోచించడం లేదు.

తల్లిదండ్రులు పెట్టిన పెట్టుబడి పిల్లల చదువుకు అక్కరకు వస్తుందా లేదా అన్న విషయం కూడా పట్టించుకోవడం లేదు. ఎవరో చెప్పారని ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో చదువుల్లో పోటీ బాగా పెరిగింది. మంచి ఎడ్యుకేషన్ సంస్ధలో సీటు పొందాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని.

చదువనేది భారీ వ్యయంతో కూడుకున్న పని. తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సరైన ప్రణాళిక వేసుకుని మీ చిన్నారి చదువుకు బంగారు బాట వేయాలంటే మనం చేయాల్సిన పనులేంటో చూద్దామా?

సరైన ప్రణాళిక అవసరం

సరైన ప్రణాళిక అవసరం

భారత్‌లో ఇతర ధరల పెరుగుదలతో పోలిస్తే చదువు కోసం మరింతగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల చదువుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇందుకు బీమా పథకాలు సరైనవి. మీ అవసరాలకు తగ్గట్టుగా మార్కెట్‌లో పలు బ్యాంకులు లేదా సంస్ధలు అందిస్తున్న బీమా పథకాన్న ఎంచుకోవాలి.

పెట్టుబడులు కొనసాగించండి

పెట్టుబడులు కొనసాగించండి

సాధారణంగా ఇంటర్ పూర్తయ్యాక పిల్లలకు ఉన్నత చదువులు ప్రారంభమవుతాయి. అంటే అప్పటికి పిల్లలకు 17 నుంచి 18 ఏళ్లు వస్తాయి. ఈ సమయానికి నగదు మీ చేతికి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. కాబట్టి పిల్లలకు 17 ఏళ్లు వచ్చే వరకు మీ పెట్టుబడులు కొనసాగుతూనే ఉండాలి.

మీ చిన్నారి చదువు కోసం ప్రణాళిక వేశారా?

మీ చిన్నారి చదువు కోసం ప్రణాళిక వేశారా?

పిల్లల చదువుల కోసం ఎంతమొత్తం దాచాలనేది అందరి మదిలో ఉండే ప్రశ్న. ఇందుకోసం నిపుణులైన ఫైనాన్షియల్ అడ్వైజర్స్‌ను సంప్రదించండి. సాధారణంగా ఇప్పుడున్న చదువులతో పోలీస్తే 10 ఏళ్లకి రెట్టింపు అవుతుంది.దీని ప్రకారం పెట్టుబడులు పెట్టండి. లేదంటే మీ జీతంలో 5-10 శాతం పిల్లల చదువుకోసం పొదుపు చేయండి.

పొదుపు జాగ్రత్తగా ఉండాలి

పొదుపు జాగ్రత్తగా ఉండాలి

ఇంటర్ లోపు చదువు వరకు అయ్యే ఖర్చుని మీ నెలవారీ ఖర్చులతో పాటు లెక్కించుకోవాలి. ఇంటర్ తర్వాత ఫీజలు భారీగా పెరుగుతాయి కాబట్టి దానికి అనుగుణంగా డబ్బుని సమకూర్చుకోవాలి. ఇందులో మీ పిల్లలు ఎంచుకునే చదువుని బట్టి కూడా ఎంత మొత్తం, ఎంత కాలానికి అవసరమవుతుందన్నది ఆధారపడి ఉంటుంది.

English summary

మీ చిన్నారి చదువు కోసం ప్రణాళిక వేశారా? | Plan Your Child's Future with Education Planner

Plan Your Child's Future with Education Planner.
Story first published: Monday, September 7, 2015, 12:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X