For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డబ్బు: పిల్లలకు పొదుపు పాఠాలు నేర్పుదామిలా?

By Nageswara Rao
|

పిల్లలు ప్రయోజకులైతే అందరికంటే ముందుగా సంతోషించేది తల్లిదండ్రులే. పిల్లలను సరైన దారిలో నడిచేలో తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపైనే ఉంది. పిల్లలు ఆరోగ్యంగా, ఆర్ధికంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకు తగిన అలవాట్లను చిన్నప్పటి నుంచే పిల్లలు అలవరచుకునేలా తల్లిదండ్రులు చూడాలి.

చిన్నతనం నుంచే పిల్లలకు మంచి నైతిక విలువలతో పాటు, డబ్బుకు సంబంధించిన అలవాట్లను కూడా తల్లిదండ్రులు నేర్పాలి. ఆర్ధిక క్రమశిక్షణను అలవరచడం ఎంతో ముఖ్యం. ఇందులో భాగంగానే పిల్లలకు చిన్నతనం నుంచే డబ్బు పొదుపు పాఠాలు నేర్పించాలి.

 డబ్బు విలువ తెలిసేలా చేయాలి

డబ్బు విలువ తెలిసేలా చేయాలి

చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని అతిగా గారాబంగా పెంచుతారు. అడిగిందల్లా కొనిపెడుతుంటారు. దీని వల్ల పిల్లలకు డబ్బు విలువ తెలియకుండా పోతుంది. ఇలా చేయడం వల్ల పెద్దయ్యాక వాళ్లు కూడా అవసరం ఉన్నా లేకపోయినా ఏది పడితే అది కొని డబ్బుని అనవసరంగా ఖర్చు చేస్తారు. కాబట్టి డబ్బు గురించి పిల్లలకు స్పష్టంగా తెలియజేయాలి.

 పొదుపు చేస్తే మంచిదే

పొదుపు చేస్తే మంచిదే

నెలవారీ జీతం సంపాదించే ఉద్యోగులు కొంతైనా డబ్బుని పొదుపు చేయాలి. ఆర్ధిక నిపుణుల సూచనల ప్రకారం ప్రతినెలా మన ఆదాయంలో 15 శాతం పొదుపు చేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఏదైనా అనుకొని అత్యవసర పరిస్ధితి వస్తే, ఇబ్బంది పడాల్సి వస్తుంది. పిల్లలకు నెలసరి పాకెట్ మనీ ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చేటపుడు వచ్చే నెల ఇలా ఇవ్వడం కుదరదు. ఈ మొత్తాన్నే వచ్చే నెలకు కూడా సర్దుబాటు చేసుకో.. అని చెప్పండి. ఇలా చేయడం వల్ల ఒక నెల ఖర్చులనే రెండు నెలలకు సర్దుబాటు చేసుకునే పద్ధతిని అలవాటు చేసుకుంటారు.

 ఎలా పొదుపు చేయాలో నేర్పాలి?

ఎలా పొదుపు చేయాలో నేర్పాలి?

కష్టపడి డబ్బు సంపాదించడంతో పాటు తెలివిగా అదనపు డబ్బు సంపాదించేలా ఎలా పొదుపు చేయాలో కూడా పిల్లలకు నేర్పాలి. పెద్దవాళ్లయిన పిల్లలకు ఈ విషయం బాగా అర్ధమవుతుంది.

 చిన్నప్పటి నుంచే పిల్లలకు పొదుపు

చిన్నప్పటి నుంచే పిల్లలకు పొదుపు

చిన్నప్పటి నుంచే పిల్లలకు పొదుపు గురించి చెప్పాలి. ప్రస్తుతం చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు చేతి ఖర్చుల కోసమని ప్రతి నెలా ఎంతో కొంత ఇస్తుంటారు. ఇదిగాక మధ్యలో ఏదైనా అడిగితే కొనిపెడుతుంటారు. ఇలా చేయకుండా... ఏదైనా చిన్న చిన్న బొమ్మల్లాంటివి కొనుక్కోవాలనుకుంటే ప్రతి నెలా చేతి ఖర్చుల కోసం నీకు ఇచ్చే డబ్బుల్లో పొదుపు చేసి కొనుక్కోవాలని చెప్పండి. దీంతో వారికి చిన్నప్పటి నుంచి పొదుపు అలవాటవుతుంది.

కష్టం విలువ తెలియాలి

కష్టం విలువ తెలియాలి

కష్టపడితేనే డబ్బు సంపాదించగలమని చెప్పండి. మీ పిల్లలను సోమరిపోతుల్లా తయారు చేయకుండా, ఈ విషయం గుర్తించేలా చేయండి. ఇందుకోసం వారికి కూడా కొన్ని పనులు అప్పగించి పూర్తి చేయమని చెప్పండి. అప్పగించిన పనులు పూర్తి చేసినపుడు వారికి కొన్ని బహుమతులు ఇవ్వండి. అప్పగించిన పని అద్భుతంగా చేస్తే, ఇంకా మంచి బహుమతి ఇవ్వండి. దాంతో పిల్లలకు చిన్నప్పటి నుంచే ‘కష్టం' విలువ తెలుస్తుంది.

 అప్పు చేయడం అనేది ఎప్పటికైనా ముప్పు

అప్పు చేయడం అనేది ఎప్పటికైనా ముప్పు

అప్పు చేయడం అనేది ఎప్పటికైనా ముప్పు అనే విషయాన్ని పిల్లలకు తెలియజేయండి. విద్య, ఆస్తుల కల్పన లేదా ఇతర తప్పనిసరి అవసరాల కోసం తప్ప అప్పు చేయడం లేదా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదనే విషయం పిల్లలకు స్పష్టంగా చెప్పాలి. శక్తికి మించి ఎడాపెడా అప్పులు చేస్తూ పోతే వడ్డీల మీద వడ్డీలు కట్టి ఆర్థికంగా ఎలా నష్టపోతామనే విషయం కూడా తెలియజేయాలి.

English summary

డబ్బు: పిల్లలకు పొదుపు పాఠాలు నేర్పుదామిలా? | 5 Ways to Teach Kids How to Save Money

If you would like to teach your child the importance of saving money, you should consider beginning your lessons at an early age. Children can learn by watching you, through playing games that involve money, and engaging in conversation with you, though the latter may come a bit later in your child’s life.
Story first published: Tuesday, September 22, 2015, 12:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X