For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ద్రవ్యోల్బణ రాహిత్యం అంటే ఏమిటి?

|

 What is disinflation?
ప్రతి ద్రవ్యోల్బణానికి, ద్రవ్యోల్బణ రాహిత్యానికి దగ్గరి సంబంధం ఉన్నప్పటికీ ఇవి రెండు ఆర్థిక వ్యవస్థలోని వేర్వేరు అంశాలు. ప్రతి ద్రవ్యోల్బణమంటే ఒక ఆర్థిక వ్యవస్థలో సాధారణ ధరల స్థాయిలో తరుగుదల కాగా, ద్రవ్యోల్బణ రాహిత్యం అంటే ద్రవ్యోల్బణ రేటు పెరుగుదలలో క్షీణత లేదా నెమ్మదించిన ధరల పెరుగుదల లేదా ద్రవ్యోల్బణం. కాబట్టి ద్రవ్యోల్బణ రాహిత్యం అనగా ఒక ఆర్థిక వ్యవస్థలో నెమ్మదిగా ధరల స్థాయి పెరుగుతుంది. అదే సమయంలో ప్రతి ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణానికి పూర్తి విరుద్ధంగా అంటే.. ప్రతి ద్రవ్యోల్బణ సమయంలో ఆర్థిక వ్యవస్థ ధరలు తరుగుదలను నమోదు చేస్తుంది.

సాధారణంగా ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్న సమయంలో కేంద్ర బ్యాంకు, ద్రవ్యోల్బణాన్ని నియంత్రంచేందుకు తగిన చర్యలు చేపడుతుంది. ఆర్థిక వ్యవస్థలో వివిధ విధానాలను అనుసరించి ద్రవ్యోల్బణ కట్టడికి పూనుకుంటుంది. ఇలాంటి సమయాల్లో కేంద్రం బ్యాంకు కీలకమైన రెపో రేటు(బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటు)ను పెంచే అవకాశం కూడా ఉంటుంది.

ఈ వడ్డీ రేటు పెంపు మార్కెట్లలో నిధుల ప్రవాహంపై ప్రభావితం చూపుతుంది. తక్కువ డిమాండ్ వల్ల ఆర్థిక వ్యవస్థలో ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కేంద్ర బ్యాంకు చేపట్టిన ఈ చర్య వల్ల ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ రాహిత్యం ప్రభావం ఏర్పడుతుంది.

ఆరోగ్యవంతమైన ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణ రాహిత్యం ప్రభావం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇదే సమయంలో ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రతి ద్రవ్యోల్బణం కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ విధంగా జరిగినట్లయితే కేంద్ర బ్యాంకు తన వడ్డీ రేటును తగ్గించుకుని ధరల స్థాయిని స్థిరంగా ఉంచే విధంగా చర్యలను చేపడుతుంది. ఈ విధంగా ధరల పెరుగల లేదా తగ్గుదలలు ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావం చేయడంతోపాటు కేంద్ర బ్యాంకు విధానాన్ని చేపట్టేందుకు కష్టతరంగా మారే అవకాశం ఉంటుంది.

English summary

ద్రవ్యోల్బణ రాహిత్యం అంటే ఏమిటి? | What is disinflation?

Though related deflation and disinflation are not synonymous, while deflation corresponds to decrease in the general price level in an economy, disinflation on the other hand means slowing in the rate of price rise or inflation.
Story first published: Wednesday, February 5, 2014, 17:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X