For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

77 శాతం పడిపోయిన బజాన్ ఫిన్ సర్వ్ నికరలాభం, రూ.838 కోట్ల నుంచి రూ.194 కోట్లకు డౌన్..

|

లాక్‌డౌన్ ప్రభావం బజాజ్ ఫిన్ సర్వ్‌ కంపెనీపై కూడా పడింది. కంపెనీ నికరలాభం 77 శాతం తగ్గింది. గత మార్చిలో కంపెనీ లాభం రూ.838.7 కోట్లు కాగా.. అది ఆ సారి రూ.194.4 కోట్లుగా నమోదైంది. అంటే లాభం 77 శాతం తగ్గింది. కరోనా వైరస్ వల్ల కంపెనీ కాంటిజెన్సీ ప్రివిజన్స్ పెరగడం వల్ల కంపెనీ నికర లాభంపై ప్రభావం చూపింది.

త్రైమాసికంలోనే బజాజ్ ఫిన్ సర్వ్ లాభాలు తగ్గగా.. మిగతా మూడు క్వార్టర్లలో మాత్రం లాభాలు నమోదు చేసుకున్నాయి. 2018-19 క్యూ4లో రూ.12,995 కోట్లుగా నమోదు కాగా.. ఈఏడాది‌‌‌‌‌ కన్సాలిడేటెడ్‌‌‌‌ ఆదాయం 2.3 శాతం పెరిగి రూ. 13,294 కోట్లకు చేరింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో బజాజ్‌‌‌‌ ఫిన్​సర్వ్‌‌‌‌‌‌‌‌ నికర లాభం 4.7 శాతం పెరిగి రూ. 3,369.13 కోట్లుగా నమోదైంది. 2018-19లో లాభం కొద్దిగా తక్కువగా రూ. 3,219 కోట్లుగా ఉంది. ఆర్థిక సంవత్సరాన్ని బట్టి చూస్తే కాస్త లాభాలనే ఆర్జించింది.

Bajaj Finserv net profit plunges 77% to ₹194 crore in March 2020 quarter

2018-19లో రూ. 42,606 కోట్లుగా నమోదైన కంపెనీ రెవెన్యూ.. 2019-20లో 27.6 శాతం వృద్ధి చెంది రూ. 54,346.69 కోట్లకు చేరుకుంది. కంపెనీ రెవెన్యూ కూడా 14 వేల కోట్ల పైచిలుకు పెరిగింది. మరోవైపు గురువారం సెషన్‌‌‌‌లో కంపెనీ షేరు విలువ 3.60 శాతం పడిపోయి రూ. 4,532.60 వద్ద ముగియడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది.

English summary

77 శాతం పడిపోయిన బజాన్ ఫిన్ సర్వ్ నికరలాభం, రూ.838 కోట్ల నుంచి రూ.194 కోట్లకు డౌన్.. | Bajaj Finserv net profit plunges 77% to ₹194 crore in March 2020 quarter

2020 march quarter bajaj finserv loss 77 percent Net profit. revenue loss 838 crores to 194 crores.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X