హోం  »  వెండి ధరలు  »  ముంబయి

ముంబయిలో వెండి ధర (8th August 2022)

Aug 8, 2022
57.40 /గ్రాము

ముంబ‌యిలో వెండిని కాస్త ఖ‌రీదైన లోహంగానే ప‌రిగ‌ణిస్తారు. భార‌త‌దేశానికి సంబంధించి మంచి వాణిజ్య కేంద్రం ముంబ‌యి. ఇక్క‌డి ప్ర‌జ‌ల్లో వివిధ వ‌య‌సు వారు పెళ్లిళ్లు, పండుగ‌లు, ముఖ్య సెల‌బ్రేష‌న్ సంద‌ర్భాల్లో వెండి రూపంలో బ‌హుమ‌తులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇంకా దేవాల‌యాల ఆభ‌ర‌ణాలు, పూజ‌లు చేసేట‌ప్పుడు, శుభ దినాల్లో వెండి కొనుగోలుకు మొగ్గుచూపుతారు. బంగారం త‌ర్వాత మ‌న దేశంలో వెండి రేట్లు తెలుసుకోవ‌డం కొంచెం క‌ష్టం. అందుకే ఇక్క‌డ నిత్యం వెండి ధ‌ర‌ల‌ను అప్‌డేట్ చేస్తుంటాం. ముంబ‌యితో పాటు మీకు కావ‌ల‌సిన న‌గ‌రంలో వెండి ధ‌ర‌ల‌ను తెలుగు గుడ్‌రిట‌ర్న్స‌లో తెలుసుకోవ‌చ్చు.

ఈరోజు వెండి ధర ముంబయి - గ్రాము వెండి ధర రూ.

Gram ఈరోజు
వెండి ధర
నిన్నటి
వెండి ధర
ప్రతి రోజూ
వెండి ధర
1 గ్రాము 57.40 57.40 0
8 గ్రాము 459.20 459.20 0
10 గ్రాము 574 574 0
100 గ్రాము 5,740 5,740 0
1 కేజీ 57,400 57,400 0

గత పది రోజులుగా భారత్‌లో వెండి ధరలు

తేదీ 10 గ్రాము 100 గ్రాము 1 కేజీ
Aug 7, 2022 574.00 5,740.00 57400.00 0
Aug 6, 2022 574.00 5,740.00 57400.00 -800
Aug 5, 2022 582.00 5,820.00 58200.00 500
Aug 4, 2022 577.00 5,770.00 57700.00 200
Aug 3, 2022 575.00 5,750.00 57500.00 -500
Aug 2, 2022 580.00 5,800.00 58000.00 0
Aug 1, 2022 580.00 5,800.00 58000.00 -400
Jul 31, 2022 584.00 5,840.00 58400.00 0
Jul 30, 2022 584.00 5,840.00 58400.00 400
Jul 29, 2022 580.00 5,800.00 58000.00 1500

వారం & నెల వెండి గ్రాఫ్ ధరలు %s

వెండి ధ‌ర‌లు గ‌తంలో ఎలా మారాయి శాతాల్లో

 • వెండి రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో , July 2022
 • వెండి ధరలు 1 కేజీ
  1 st July రేటు Rs.59,000
  31st July రేటు Rs.58,400
  అత్య‌ధిక ధ‌ర‌ July Rs.62,500 on July 6
  అత్య‌ల్ప ధ‌ర‌ July Rs.54,500 on July 26
  మొత్తంగా బంగారం రేట్లెలా ఉన్నాయి? Falling
  % మార్పు -1.02%
 • వెండి రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో , June 2022
 • వెండి రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో , May 2022
 • వెండి రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో , April 2022
 • వెండి రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో , March 2022
 • వెండి రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో , February 2022

వెండి ధ‌ర‌ల‌ను ప్ర‌భావితం చేసే అంశాలు

బంగారం మాదిరిగానే వెండి సైతం విలువైన లోహం. న‌గ‌దుగాను, పెట్టుబ‌డిగాను మంచి విలువ ఉంది. మ‌న దేశంలో వెండి ధ‌ర‌ను ప్ర‌భావితం చేసే అంశాలు చాలానే ఉన్నాయి. వెండి భ‌విష్య‌త్ రేట్ల‌ను అంచ‌నా వేసేట‌ప్పుడు గ‌త డేటాను ఎంత మాత్రం ప‌రిగ‌ణ‌న‌లోనికి తీసుకోవ‌డం స‌ముచితం కాదు. గ‌డ‌చిన రెండు ద‌శాబ్దాల్లో వెండి రేట్ల‌లో స్థిర‌మైన పెరుగుద‌ల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. అదే స‌మ‌యంలో వెండిని క‌మోడిటీగా పెట్టుబ‌డి పెట్ట‌డ‌మూ క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తోంది. కాబ‌ట్టి పెట్టుబ‌డిదారులు వెండిలో ఇన్వెస్ట్ చేద్దామ‌ని భావిస్తున్న‌ట్ట‌యితే కొన్ని అంశాల‌ను ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాం.

1. డాల‌ర్ విలువ‌

బంగారం మాదిరిగానే వెండి సైతం అమెరికా డాల‌ర్ క‌ద‌లిక‌ల‌కు ప్ర‌భావిత‌మ‌వుతుంది. ఇత‌ర క‌రెన్సీల‌తో పోలిస్తే డాల‌ర్ విలువ ప‌డిపోయిన‌ప్పుడు వెండి ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంది. అదే డాల‌ర్ విలువ పెరిగితే వెండి ధ‌ర‌లు త‌గ్గుతాయి. అయితే ఈ హెచ్చుత‌గ్గులు బంగారంతో పోలిస్తే వెండిలో త‌క్కువే అని చెప్పాలి.

2. పెద్ద ప్రైవేట్ సంస్థాగ‌త మ‌దుప‌రులు

బంగారంతో పోలిస్తే వెండి మార్కెట్ విలువ కానివ్వండి, ధ‌ర‌లు కానీయండి చాలా త‌క్కువ‌గా ఉంటాయి. పెద్ద ప్రైవేట్ సంస్థల‌కు వెండి ధ‌ర‌ల‌ను ప్ర‌భావితం చేయ‌డం ఏమంత క‌ష్ట‌మైన ప‌నికాదు. ఉదాహ‌ర‌ణ‌కు వారెన్ బ‌ఫెట్ 1997లో 130 మిలియ‌న్ ట్రాయ్ ఔన్స్‌ల వెండిని కొనుగోలు చేశారు. అప్పుడు ప్ర‌తి ట్రాయ్ ఔన్స్ కేవ‌లం 4.5డాల‌ర్లే ప‌డింది. మొత్తం 585 మిలియ‌న్ డాల‌ర్ల‌తో వెండిని కొనుగోలు చేశారాయ‌న‌. ఈ సంఘ‌ట‌న‌తో పెద్ద ట్రేడ‌ర్లు, ఇన్వెస్ట‌ర్లు మార్కెట్‌లో వెండి రేటును ఏ విధంగా ప్ర‌భావితం చేయ‌గ‌ల‌రో అర్థం చేసుకోవ‌చ్చు.

3. చ‌మురు ధ‌ర‌ల పెరుగుద‌ల‌

వెండిని వెలికితీయ‌డం చాలా శ్ర‌మ‌, శ‌క్తితో కూడుకున్న‌ది. చాలా మంది నిపుణులు వెండికి, చ‌మురు వినియోగంలో ద‌గ్గ‌ర సంబంధ‌ముంటుంద‌ని వాదిస్తారు. అందుకే చ‌మురు ధ‌ర‌ల్లో పెరుగుద‌ల వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా వెండి ధ‌ర‌లు పెరుగుతాయి. చ‌మురు ధ‌ర‌లు త‌గ్గితే వెండి ధ‌రా త‌గ్గుతుంది. ఇదే కార‌ణంతో చాలా మంది బంగారాన్ని, వెండిని పోల్చిచూడ‌కుండా వెండిని చ‌మురుతో పోల్చిచూడ‌మంటున్నారు. రెండూ పారిశ్రామికంగా ఉప‌యోగ‌ప‌డేవే. వాటి డిమాండ్ కూడా పారిశ్రామిక అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్టుగా ఉంటుంది.

4. బ‌ల‌మైన పారిశ్రామీక‌ర‌ణ‌

మ‌న దేశంలో పారిశ్రామిక రంగం విప‌రీతంగా పెరిగిపోయింది. పరిశ్ర‌మ‌ల‌లో క‌మోడిటీగా వెండి అవ‌స‌రం విప‌రీతంగా ఉంటోంది. ఇటీవ‌ల కాలంలో వెండికి ఎన‌లేని డిమాండ్ కొన‌సాగుతుంది. వెండి ధ‌ర‌లు స‌మీప భ‌విష్య‌త్‌లోనూ ఆ త‌ర్వాత కచ్చితంగా పెరుగుతాయ‌నే సంకేతాల‌ను తెలియజేస్తుంది.

5. దిగుమ‌తి సుంకాలు

భార‌త్ వెండిని ఎక్కువ‌గా దిగుమ‌తి చేసుకుంటుంది. దిగుమ‌తిపై విధించే సుంకాన్ని బ‌ట్టి వెండి ధ‌ర‌లు ప్ర‌భావిత‌మ‌వుతాయి. దిగుమ‌తి సుంకం ఎక్కువ‌గా ఉంటే మ‌న దేశంలో వెండి ధ‌ర‌లు కూడా ఎక్కువ‌గా ఉంటుంది. దీర్ఘ‌కాల ఉద్దేశంతో పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటే వెండి మంచి ఎంపికే.

 

గమనిక: నగరంలోని స్ధానిక జ్యూయలర్స్ ఆధారంగా ఉన్న వెండి ధరలు. GoodReturns.in అందించిన సమాచారం వెండి ఖచ్చితత్వం నిర్ధారించడానికి ప్రతి ప్రయత్నం చేసింది. అంతే తప్ప గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు ఖచ్చితత్వంపై ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ రేట్లు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. విలువైన వెండి కొనుగోలు లేదా విక్రయించడానికి విన్నపాలు ఎంత మాత్రం కాదు. గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు అందించిన వెండి సమాచారం ఆధారంగా జరిగే నష్టాలను లేదా అపరాధాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించదు.

భారత్‌లోని నగరాల్లో బంగారం ధర
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X