For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

EMI వాయిదా లక్షల భారమే: ఎన్ని నెలలు ఆగితే ఎంత పెరుగుతుంది?

|

ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు కస్టమర్లకు ఈఎంఐ చెల్లింపులను మూడు నెలల పాటు వాయిదా వేసినా ఆ కాలానికి వడ్డీ భారం తప్పదని ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు వెల్లడించాయి. మారటోరియంతో రుణగ్రహీతలకు ప్రయోజనం అంతగా ఉండటం లేదని, పైగా ఆర్థికంగా నష్టమేనని అంటున్నారు. ఎస్బీఐ వంటి ప్రభుత్వరంగ బ్యాంకులు ఆటోమేటిక్‌గా, ప్రయివేటు బ్యాంకులు డిమాండ్ పైన మారటోరియం అవకాశం కల్పించాయి.

RBI మారటోరియం: మరిన్ని EMI కథనాల కోసం క్లిక్ చేయండి

అన్ని బ్యాంకులు మారటోరియానికి ఓకే

అన్ని బ్యాంకులు మారటోరియానికి ఓకే

ఎస్బీఐ మార్చి 1వ తేదీ నుండి మే 31 తేదీ వరకు కాలపరిమితుల రుణాలపై ఈఎంఐ చెల్లింపులను మూడు నెలల పాటు వాయిదా వేసింది. అదే కాలపరిమితికి వర్కింగ్ కేపిటల్ పైన వడ్డీలను వాయిదా వేసింది. కెనరా బ్యాంకు, ఐడీబీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు కూడా మారటోరియం ఆప్షన్ ఇచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రాలు కూడా డిమాండ్ పైన మారటోరియంకు సిద్ధమని చెప్పాయి.

కోరితే ఆ ఈఎంఐ వెనక్కి

కోరితే ఆ ఈఎంఐ వెనక్కి

మారటోరియం మార్చి, ఏప్రిల్, మే నెలలకు వర్తిస్తుంది. ఇప్పటికే మార్చి నెలలో చెల్లించిన వారికి మిగిలేది రెండు నెలలే. అలాగే కొన్ని బ్యాంకులు మార్చి నెల ఈఎంఐ వెనక్కి కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మారటోరియం తర్వాత కాలపరిమితి పెంచాలా, ఈఎంఐ పెంచాలా అనే ఆప్షన్‌ను రుణగ్రహీతలకే ఇస్తున్నాయి. రుణగ్రహీత వయస్సును ఇక్కడ లెక్కలోకి తీసుకుంటారు.

ప్రారంభంలోనే పెద్ద భారమే..

ప్రారంభంలోనే పెద్ద భారమే..

ఉదారణకు మీరు రూ.30 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే 9 శాతం వడ్డీ ఉంటే 240 నెలలకు గాను 3 నెలల మారటోరియం ఉపయోగించుకుంటే ఈ కాలానికి వడ్డీ రేటు రూ.68,000 అవుతుంది. అది మీ అసలులో కలవడం వల్ల రూ.30,68,000 అవుతుంది. ఈ లెక్కన ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి చేతిలో డబ్బులు ఉంటే ఈఎంఐలు చెల్లించడమే మంచిది.

ఎన్ని నెలలు వాయిదా వేస్తే ఎంత?

ఎన్ని నెలలు వాయిదా వేస్తే ఎంత?

9 శాతానికి 240 నెలలకుగాను రూ.30 లక్షల రుణం తీసుకుంటే 3 నెలలు వాయిదా వేస్తే రూ.30,68,000 అవుతుంది. 2 నెలలు వాయిదా వేస్తే రూ.30.45 లక్షలకు పైగా అవుతుంది.

రూ.30 లక్షల లోన్‌కు గాను మీ మారటోరియం ఉపయోగించుకుంటే మీ ఈఎంఐ రూ.26,992గా ఉంటుంది. వ్యవధి 240 నెలలు. మొత్తం చెల్లించేది రూ.65 లక్షల వరకు అవుతుంది. కానీ మూడు నెలల కాలపరిమితి ఉపయోగించుకుంటే రూ.1.50 లక్షలు రెండు నెలలు ఉపయోగించుకుంటే రూ.97వేల వరకు భారం పడుతుంది. ఎందుకంటే రూ.68వేలపై కూడా 9 శాతం వడ్డీ విధిస్తారు.

అంటే ఇటీవలి కాలంలో రూ.30 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే మారటోరియం కాలానికి నెలకు దాదాపు రూ.23వేల చొప్పున 3 నెలల పాటు రూ.68,000 అసలులో కలిపేస్తారు. అప్పుడు దానిపై కూడా పడే వడ్డీతో రూ. లక్షల భారం పడుతుంది.

ఎంతకాలం మిగిలి ఉంటే ఎంత భారం?

ఎంతకాలం మిగిలి ఉంటే ఎంత భారం?

మారటోరియం ఉపయోగించుకుంటే మిగిలిన ఈఎంఐలు లేదా కాలపరిమితిని బట్టి భారం ఉంటుంది. ఉదాహరణకు 8.5 వడ్డీ రేటు ఉంటే...

36 నెలలు మిగిలి ఉంటే మారటోరియం 3 నెలలు ఉపయోగించుకుంటే 1 అదనపు ఈఎంఐ చెల్లించాలి.

60 నెలల కాలం మిగిలి ఉంటే 2 ఈఎంఐలు,

120 నెలలు మిగిలి ఉంటే 5 ఈఎంఐలు,

180 నెలలు మిగిలి ఉంటే 8 ఈఎంఐలు,

240 నెలలు మిగిలి ఉంటే 15 ఈఎంఐలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉండవచ్చు. ఇది కేవలం అంచనా లెక్క మాత్రమే. కాస్త అటు ఇటు ఉండవచ్చు.

English summary

EMI వాయిదా లక్షల భారమే: ఎన్ని నెలలు ఆగితే ఎంత పెరుగుతుంది? | Why you shouldn’t opt for moratorium on EMI

The RBI put out a notification permitting banks and non banking finance companies to grant a moratorium of three months on payment of all instalments of term loans falling due between March 1, 2020 and May 31, 2020.
Story first published: Friday, April 3, 2020, 14:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X