For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget 2022: మీ పర్సనల్ ఫైనాన్స్‌పై కేంద్ర బడ్జెట్ కీలకమా?

|

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్ అంచనాలకు సంబంధించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. బడ్జెట్ ఏదైనా మనపై ఆర్థికంగా ప్రభావం చూపవచ్చు. మీ సేవింగ్స్, పెట్టుబడుల పైన వడ్డీ రేట్ల ప్రాతిపదికన కొంత ప్రభావం చూపవచ్చు. కానీ పెట్టుబడి ప్రణాళికలు రూపొందించేందుకు మీకు బడ్జెట్‌లో భారీ ప్రకటనలు అవసరమని భావించాల్సిన పనిలేదు. ఆదాయ పన్ను మినహాయింపులు, కరోనా వంటి ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రంగాలకు కేటాయింపులు వంటి అంశాలు కొంత ప్రభావం చూపుతాయి.

అదీ అంతంతే..

అదీ అంతంతే..

ఆదాయపు పన్ను మినహాయింపులు, క్యాపిటల్ గెయినస్ ట్యాక్స్, పన్ను స్లాబ్స్‌లో మార్పు వంటి అంశాలు పర్సనల్ ఫైనాన్స్ పైన ప్రభావం చూపినప్పటికీ, ఈ బడ్జెట్‌లో అది మరీ కీలకం కాకపోవచ్చునని అంటున్నారు. ఆర్థిక రికవరీకి ఉపయోగపడేలా రియాల్టీ రంగం, పరిశ్రమలకు ఊతమిచ్చే చర్యలు ఉండవచ్చు. అప్పుడు ఇది పరిమితి సంఖ్యలోని వారికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని గుర్తు చేస్తున్నారు.

చాలామంది బడ్జెట్‌కు చాలా ప్రాధాన్యమిస్తారు. అందులో ఎలాంటి తప్పులేదు. కానీ మన పర్సనల్ ఫైనాన్స్ పైన ఈ బడ్జెట్ ప్రభావం తక్కువగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు.

ప్రతి ఏటా బడ్జెట్

ప్రతి ఏటా బడ్జెట్

ప్రతి సంవత్సరం బడ్జెట్ వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. కొత్త ప్రకటనలు చేస్తారు. పాత వాటిని వెనక్కి తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే కొనుగోలు నుండి పెట్టుబడి వరకు పూర్తిగా బడ్జెట్ పైన ఆధారపడితే ప్రయోజనం ఉండదని అంటున్నారు. బడ్జెట్ పరంగా జరిగేది జరుగుతుంది. కానీ కొంతమంది బడ్జెట్ ఆధారంగా ముందుకు వెళ్తామని వెయిట్ చేస్తారు. అది మాత్రం సరికాదని అంటున్నారు. మన ఆర్థిక ప్రణాళిక కోసం బడ్జెట్ కోసం వేచి చూడటం అంతగా అవసరం లేదని అంటున్నారు. అయితే దీర్ఘకాలిక లేదా పెద్ద లక్ష్యాల కోసం మాత్రం బడ్జెట్ కోసం వేచి చూడవచ్చునని అంటున్నారు. ఉదాహరణకు ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తే, రియాల్టీ రంగానికి ఈ బడ్జెట్‌లో ఏదైనా ప్రయోజనం దక్కుతుందని అనుకుంటే.. అలాంటి భారీ లక్ష్యాలకు వేచి చూడవచ్చునని చెబుతున్నారు.

పర్సనల్ ఫైనాన్స్ పైన బడ్జెట్ ప్రభావం

పర్సనల్ ఫైనాన్స్ పైన బడ్జెట్ ప్రభావం

మరో విషయం ఏమంటే చాలామంది పర్సనల్ ఫైనాన్స్‌ను ప్రభావితం చేసేవి బడ్జెట్‌లో వేళ్లమీద లెక్కబెట్టేలా మాత్రమే ఉంటాయి. పన్ను స్లాబ్స్ మార్పులు, మూలధన లాభాల పన్నుల్లో పెంపు, తగ్గింపు, కొత్త పొదుపు సాధనాలు వంటివి ఉంటాయి. కానీ మన పర్సనల్ ఫైనాన్స్‌ను పూర్తిగా మార్చివేసే పరిస్థితి మాత్రం ఉండదు.

English summary

Budget 2022: మీ పర్సనల్ ఫైనాన్స్‌పై కేంద్ర బడ్జెట్ కీలకమా? | Why the budget should not play a key role in managing your personal finance

In a few days, Union Budget 2022 would be presented. And if you are a regular consumer of business news, by now you would have seen several articles and videos trying to predict what might be in store for us in this Budget. But do budget announcements really matter now? Of course, they do.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X